Kalyanam Kamaneeya 1st Song: Melodious Treat

Kalyanam Kamaneeya 1st Song: Melodious Treat
Santosh Soban and Priya Bhavani Shankar starrer Kalyanam Kamaneeyam is
headed for release on the 14th of January and the promotions are in
full swing now. The makers have now unveiled a new song from the album
– Oh Manasa and it gives a dive into the love life of the lead pair
while they are in the midst of their marriage.
The song depicts how Priya changed Santosh’s life for good and how
they got married. Krishna Kant’s lyrics are very good and so is
Shravan Bharadwaj’s composition. It has a melodious touch and will
strike the viewers right in the first listening.
Shravan composes the song and also croons it. He has done a very
impressive job. The visual presentation is also of top quality. The
visuals in the lyrical video are aesthetic. The visuals have a rich
feel.
This song perfectly sets the stage for the promotional campaign that
is to follow and also the film which is set for release on 14 January,
marking the occasion of Sankranthi. Anil Kumar Alla is directing the
film while UV Concepts are producing it.
“కళ్యాణం కమనీయం” చిత్రం నుంచి “ఓ మనసా” లిరికల్ సాంగ్ రిలీజ్
యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఈ
చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో
ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ
నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్
కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజాగా కళ్యాణం కమనీయం సినిమా నుంచి “ఓ మనసా” అనే లిరికల్ పాటను విడుదల
చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. శ్రావణ్ భరద్వాజ్
కంపోజ్ చేసి పాడారు. ఓ యువ జంట పెళ్లి సంబంధం కుదిరినప్పటి నుంచి
పెళ్లయ్యే దాకా సాగే సందర్భాలన్నీ ఈ పాటలో అందంగా చూపించారు. నా కథలే
మలుపే తిరిగే, నీ మహిమే జరిగే.. నా కనులా నిదురే తరిగే…నీ కలలే
పెరిగే..అంటూ బ్యూటిఫుల్ లిరిక్స్ తో సాగుతుందీ పాట.
ఇటీవలే రిలీజైన ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ కు మంచి స్పందన
వస్తోంది.యూవీ కాన్సెప్ట్స్ నుంచి మరో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్
రాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశలో ఉన్న ఈ
సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.