Karthikeya 90ml Movie Interview photos
నాకు యాక్టింగ్ అంటే ఇష్టం,నచ్చితే షార్ట్ ఫిల్మ్ కూడా చేస్తా – కార్తికేయ గుమ్మకొండ
కార్తికేయ గుమ్మకొండ,నేహా సోలంకి జంటగా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 90Ml చిత్రం విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ను సంపాదించింది.
వన్ డే లేట్ రిలీజ్ ఎందుకు అయ్యింది.?
సెన్సార్ వాళ్ళు చూడటమే ఒకరోజు లేట్ గా చూసారు,అదే డీలే అయింది.
కొన్ని బీప్ సౌండ్స్ ఉన్నాయి.?
కొన్ని బ్రాండ్ పేర్లు యూస్ చేసాం అండి అందుకు బీప్ ఇచ్చారు అంతే….
ఇంకా సైకో అనే పదానికి ఒక బీప్ సౌండ్ ఇచ్చారు అంతే.
మీకు ఫీడ్ బ్యాక్ ఎలా వచ్చింది.?
చాలా బాగా వచ్చింది సర్,ట్విట్టర్ లో అందరూ మెన్షన్ చేసి మరీ బాగా చేశారు అని చెప్తున్నారు.
డాన్స్ లు బాగా చేశారు ఇప్పటివరకు ఏ సినిమాలో చేయలేదు.?
ఇప్పటివరకు ఛాన్స్ రాలేదు అండి చేయడానికి, నాకు డాన్స్ అంటే చాలా ఇంట్రస్ట్ నేను చిరంజీవి గారి డాన్సులు చూసే నేను నాలో ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది.
నెక్స్ట్ ఎలాంటి జోనర్ చెయ్యాలి అనుకుంటున్నారు.?
కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉన్న స్క్రిప్ట్ ఒకటి చేస్తున్నాను కొంచెం కామెడీ కూడా ఉంటుంది, ఒక డిఫరెంట్ ఏమోషన్ తో సాగే ఒక లవ్ స్టొరీ ఒకటి చేస్తున్నాను.
క్రిటిసిసం ఎలా తీసుకుంటారు.?
సినిమా బాగాలేదు అంటే వింటాను,ఎందుకు నచ్చలేదు అని కారణాలు తెలుసుకుంటాను,ఇంకా నేర్చుకుంటూ ఉంటాను,నేను ఒక తప్పు చేస్తే, మళ్ళీ దానిని రీపిట్ కానివ్వను.
రెస్పాన్స్ అందరూ బాగుంది అన్నారు మీ వరకు నెగిటివ్ గా ఏమైనా వచ్చిందా.?
ఫస్ట్ హాఫ్ బాగా వెళ్ళింది,సెకండాఫ్ కొంచెం ల్యాగ్ అయింది అన్నారు, కానీ మాకు కూడా అక్కడ ఇంకేమి చెయ్యాచ్చు తెలియలేదు.నేను విన్నాను నెక్స్ట్ టైం ఇలా రీపిట్ కాకుండా చూసుకుంటాను.
90ml అంటే ఫ్యామిలీ స్ థియేటర్ కి వస్తారు అనుకునున్నారా.?
ఫ్యామిలీ స్ కోసం అయితే ఒక కంప్లీట్ ఫ్యామిలీ మూవీ చేసేవాళ్ళం కదా సర్,
ఇది మాస్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని చేసాం.నేను చూసిన రెండు మాస్ థియేటర్లలో కూడా రెస్పాన్స్ చాలా బాగుంది.
గ్యాంగ్ లీడర్ లో యాంటీ రోల్ చేశారు కదా మళ్ళీ వస్తే చేస్తారా.?
నచ్చితే తప్పకుండా చేస్తాను సర్,
అది నాకు బాగా ఉపయోగపడాలి, అలానే సినిమాకి కూడా పడాలి,ఆ కేరెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి.
వెబ్ సిరీస్ ఏమైనా చేస్తారా.?
నా వరకు ఇంకా అలాంటివి రాలేదు అండి,నాకు యాక్టింగ్ అంటే ఇంట్రస్ట్ బాగా నచ్చితే షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసేస్తా.
మీ బ్యానర్ లో నెక్స్ట్ ఏమైనా చేస్తానరా.?
ఇంకేమి ప్లాన్ లేదు సర్ ప్రస్తుతానికి అయితే బయట ప్రొడక్షన్స్ లో చేస్తున్న ప్రస్తుతానికి.