KGF Chapter 2 Poster
రాకింగ్ స్టార్ యష్ ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ ఫస్ట్ లుక్ విడుదల.. అమేజింగ్ రెస్పాన్స్
సినిమా చరిత్రలో హిట్స్, సూపర్‌హిట్స్, బ్లాక్‌బస్టర్ చిత్రాలు వస్తుంటాయి. కానీ ట్రె్‌ండ సెట్టింగ్ మూవీస్ మాత్రం అరుదుగానే వస్తుంటాయి. అలాంటి అరుదైన ట్రెండ్ సెట్టింగ్ మూవీస్‌లో ‘కె.జి.యఫ్’ ఒకటి. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ కన్నడ చిత్రసీమలో ‘కె.జి.యఫ్’ ట్రె్‌ండ సెట్టింగ్ మూవీగా నిలవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రా్‌ండ రిలీజైంది. వసూళ్లలోనే కాకుండా అవార్డుల్లోనూ ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ విజువల్ ఎఫెక్ట్, స్టంట్స్ విభాగాల్లో ఈ ఏడాది జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.
అటు అభిమానులు, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసిన ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’కి కొనసాగింపుగా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2‘ రూపొందుతోంది. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో అంచనాలకు ధీటుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ విడుదలైన ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ ఫస్ట్ లుక్‌ను శనివారం సాయంత్రం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో రాకింగ్ స్టార్ యష్ డిఫరెంట్ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకులు, అభిమానుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. బాలీవు్డ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ఈ చిత్రంలో అధీర అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను 2020 ద్వితీయార్థంలో విడుదలవుతున్న ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రాకీ భాయ్‌గా రాకింగ్ పెర్ఫామెన్స్‌తో యష్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.