Kida is the Best Film at Chennai International Film Festival
Acclaimed Producer Sravanthi Ravikishore’s ‘Kida’ is the ‘Best Film’ at Chennai International Film Festival.
Prominent Telugu Producer Sravanthi Ravikishore’s debut tamil production ‘Kida’ received a standing ovation at the Panorama screening of IFFI, GOA last month.
Extending the glory and appreciation, it has now won the ‘Best Film’ Award at Chennai International Film Festival and both the Producer ‘Sravanthi’ Ravikishore and director R.A Venkat were rewarded with 1 Lakh of prize money each. Actor Poo Ramu from the film has also won the Best Actor Award.
‘KIDA’ is Produced by ‘Sravanthi Ravikishore’, directed by R.A Venkat and presented by Krishna Chaitanya. Poo Ramu, Kaali Venkat, Master Deepan, Paandiyamma, Loki, Kamali played major roles.
The Story revolves around a Grandfather, Grandson, a Goat and a sensible lovestory amidst all. It’s a debut film for most of the technicians who worked in it.
In its 20th year now, Chennai International Film Festival is known to recognize talented artists, filmmakers and other technicians, highlighting their effort and contribution to the Indian cinema.
Despite the competition, the story, screenplay, performances and production values of ‘Kida’ impressed the jury enough to be selected as the ‘Best Film’ for the year.
Speaking on the occasion, producer ‘Sravanthi’ Ravikishore says, “Kida was screened in GOA IFFI this year and received standing ovation from the crowd. Extending the excitement, the Chennai International Film Festival jury has selected our film as the ‘Best Film’ amidst tough competition. We’re very happy with the recognition and respect and are planning to release it soon.”
Poo Ramu, Kaali Venkat, Master Deepan, Paandiyamma, Loki, Kamali and others played major roles in the film.
Director : Ra. Venkat
DOB : M.Jayaprakash
Editor : Anand Geraldin
Music : Theeson
Art Director : K.B.Nandhu
Stunt : Om Siva Prakash
Lyric : Ekadesi
Production Company : Sri Sravanthi Movies
Producer : ‘Sravanthi’ Ravi Kishore
Presenter : Krishna Chaitanya
చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ‘కిడ’కు అవార్డు
– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –
ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. ఇప్పుడు ఈ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. గోవాలో జరిగిన ఇఫీ (ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా)లోని పనోరమాలో చిత్రాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా 20వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా ‘కిడ’కు పురస్కారాన్ని అందజేశారు.
నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్, దర్శకుడు ఆర్ఏ వెంకట్… అవార్డుతో పాటు రివార్డుగా ఇద్దరికీ చెరొక లక్ష రూపాయలను 20వ చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్లో అందజేశారు. ఈ చిత్రంలో నటించిన పూ రాము ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు.
శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘కిడ’. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి ప్రధాన తారాగణం. ఓ తాత, మనవడు, మేక చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. దర్శకుడితో పాటు సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు… ఇలా చాలా మందికి తొలి చిత్రమిది.
ఇరవై ఏళ్లుగా చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులు, దర్శక – నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందిస్తున్నారు. పలు చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ ‘కిడ’లో కథ, కథనం, నటీనటుల ప్రతిభ, నిర్మాణ విలువలు మెచ్చిన ఫెస్టివల్ జ్యూరీ ‘ఉత్తమ చిత్రం’ అవార్డు అందించారు.
అవార్డు వచ్చిన సందర్భంగా చిత్ర ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ”గోవాలో ఈ ఏడాది జరిగిన ఇఫీలోని పనోరమాలో ‘కిడ’ను ప్రదర్శించారు. అప్పుడు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఇప్పుడు సినిమాకు అంతకు మించిన ఆదరణ, గౌరవం పొందింది. చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా పురస్కారం లభించింది. నాకు, మా చిత్ర బృందానికి ఎంతో సంతోషంగా ఉంది. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు.
పూ రాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆడియోగ్రాఫర్: తపస్ నాయక్, ఆర్ట్ డైరెక్టర్ : కె.బి. నందు, లిరిసిస్ట్ : ఏకదేసి, ఎడిటర్ : ఆనంద్ గెర్లడిన్, సంగీతం : థీసన్, సినిమాటోగ్రఫీ : ఎం. జయప్రకాశ్, నిర్మాత : స్రవంతి రవికిశోర్, దర్శకత్వం: ఆర్ఏ వెంకట్.