Koramenu Movie Pre Release Event Photos
ఆనంద్ రవి కథానాయకుడిగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తోన్న సినిమా ‘కోరమీను’. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరమైన అంశంతో మడిపడిన మూవీ ఇది. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు … ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య నడిచే చిత్రమే ‘కొరమీను’. డిసెంబర్ 31న సినిమా రిలీజ్ అవుతుంది. పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయ్యాయి. కొరమీను’ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం కొరమీను టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
పరిమితమైన బడ్జెట్‌తో రూపొందుతోన్న సినిమాలకు సంబంధిచి కొరమీను, లక్కీ లక్ష్మణ్ సినిమా టీమ్స్ కలిసి ఓ కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. ఒకరోజు ముందుగా వస్తున్న లక్కీ లక్ష్మణ్ టీమ్ మంగళవారం రాత్రి జరిగిన తమ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కొరమీను టీమ్‌ను ఆహ్వానించగా హీరో ఆనంద్ రవి, హీరోయిన్ కిశోరి వెళ్లి టీమ్‌కు విషెష్ తెలియజేశారు. అలాగే బుధవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు లక్కీ లక్ష్మణ్ టీమ్‌ని కొరమీను టీమ్ ఆహ్వానించగా.. సోహైల్, హీరోయిన్ మోక్ష హాజరై తమ విషెష్‌ను అందించారు. ఇలా ఒకరికొకరు సపోర్ట్ అందించుకుంటూ ముందుకు సాగే సరికొత్త ట్రెండ్‌కి ఈ రెండు సినిమా యూనిట్స్ ఆహ్వానం పలికాయి. దీన్ని ఇలాగే అందరూ కొనసాగిస్తే బావుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ సందర్భంగా..
నిర్మాత సమన్య రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమా బాగా వచ్చింది. మా చిత్రం డిసెంబర్ 31న రాబోతోంది. మీడియా పిలిస్తే జనాలు కచ్చితంగా థియేటర్‌కు వస్తారు. లక్కీ లక్ష్మణ్ కథ వేరేగా ఉంటుందని, ఆ లక్ మాకు కూడా రావాలని, కొరమీను కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
డైరెక్టర్ శ్రీపతి మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 31న మా చిత్రం రిలీజ్ కాబోతోంది. అందరూ చూడండి. మా సినిమా గురించి టీం అంతా మాట్లాడింది. ఒక డైరెక్టర్లా కాకుండా.. నేను ఓ ప్రేక్షకుడిలా చెబుతున్నా. రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే సమయంలో కచ్చితంగా ప్రేక్షకులే సినిమాను ప్రమోట్ చేస్తారు’ అని అన్నారు.
ఆనంద్ రవి మాట్లాడుతూ.. ‘ఇక్కడకు వచ్చి ప్రమోట్ చేసిన లక్కీ లక్ష్మణ్ టీంకు థాంక్స్. డిసెంబర్ 30న లక్కీ లక్ష్మణ్ వస్తోంది. డిసెంబర్ 31న మా కొరమీను రాబోతోంది. మందుబాబుల దినోత్సవం నాడు మా సినిమా రాబోతోంది. సినిమాను చూసిన ఏ ఒక్కరూ నిరాశచెందరు. ఇంతకు మించి నేనేమీ ఇప్పుడు చెప్పను. ఆ తరువాత మాట్లాడుకుందాం’ అని అన్నారు.
హీరోయిన్ కిషోరి మాట్లాడుతూ.. ‘కొరమీనులో మీనాక్షి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇలాంటి పాత్రను నాకు ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చిన పెద్ద బాధ్యతను నాపై పెట్టారు. నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. నిర్మాత సమన్య గారికి థాంక్స్. ఇంత మంచి పాత్రను రాసిన రవి గారికి థాంక్స్’ అని అన్నారు.
లక్కీ లక్ష్మణ్ డైరెక్టర్ అభి మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడకు రావడానికి కారణం రవి అన్న. నేను కాలేజ్‌లో ఉన్న సమయంలో ప్రతినిధి సినిమాను చూశాను. నెపోలియన్ తరువాత రవి అన్నను చూశాను. ఆయనతో కలిసి పని చేయాలని అనుకున్నాను. ఈ రోజు ఇలా స్టేజ్ మీద ఆయన పక్కన ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.
లక్కీ లక్ష్మణ్ నిర్మాత హరిత మాట్లాడుతూ.. ‘మనిషికి ఉండే ఇగో అనే క్వాలిటీ మీద సినిమాను తీస్తున్నారు కాబట్టి అందరికీ రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. లక్కీ లక్ష్మణ్ డిసెంబర్ 30న రాబోతోంది.. డిసెంబర్ 31న కొరమీను రాబోతోంది. మా రెండు సినిమాలు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
సోహైల్ మాట్లాడుతూ.. ‘క్రాస్ ప్రమోషన్స్ అంటేనే నాకు చాలా ఇష్టం. పెద్ద సినిమాల విషయంలో ఓపెనింగ్స్ వస్తాయి. కానీ చిన్న సినిమాలకు టాక్ వస్తేనే కలెక్షన్లు వస్తుంటాయి. ఓపెనింగ్స్ ఉండవు. ప్రతినిధి సినిమాను నేను చూశాను. అందులో డైలాగ్స్ చాలా ఇష్టం. నెపోలియన్‌లో కథ కొత్తగా ఉంటుంది. కొరమీను లాంటి సినిమాను నాకు చేయాలని ఉంది. ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. నాకు చాలా నచ్చింది. డిసెంబర్ 30, 31 కథ వేరే ఉంటది’ అని అన్నారు.
కమెడియన్ వేణు.. ‘ఆనంద్ రవి గారిని నేను ఫ్యాన్‌ను. నెపోలియన్, ప్రతినిధిలో ఆయన అద్భుతంగా రాశారు. ఈ సినిమా కూడా అంతే ఎంగేజింగ్‌గా, గ్రిప్పింగ్‌గా ఉంటుందని భావిస్తున్నాను. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
రైటర్ లక్ష్మీ భూపాల మాట్లాడుతూ.. ‘ప్రతినిధి సినిమా నేను రాసి.. రవి డైరెక్టర్ చేయాల్సింది. కానీ రవి రాసి.. వేరే వారితో డైరెక్ట్ చేయించాడు. నేను రాసి ఉంటే అంత బాగా వచ్చి ఉండేది కాదేమో. లెక్కలేసుకుని ఏమీ చేయడు. సహజంగా నటిస్తాడు. కిషోరి పేరు చాలా కొత్తగా ఉంది. ఆకాశం నీహద్దురా అపర్ణా బాలమురళి, ఐశ్వర్యా రాజేష్‌లు వావ్ అనేలా ఉండరు.. కానీ వారి పర్ఫామెన్స్ అద్బుతంగా ఉంటుంది. అలానే కిషోరి కూడా అనిపిస్తుంది. డైరెక్టర్ శ్రీపతి కర్రి పెద్ద హిట్ కొట్టాలి. సినిమా కోసం పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
లిరిక్ రైటర్ పూర్ణాచారి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నేను నాలుగు పాటలు రాశాను. కొరమీను నా జీవితంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. మనిషి అహం గురించి ఓ పాటలు వివరించే ప్రయత్నం చేశాను. టీం అంతా కూడా సినిమాను చూశాం. మీరు పెట్టిన ప్రతీ రూపాయికి ఫన్, ఎమోషన్, ఎగ్జైట్మెంట్ అన్నీ దొరుకుతాయ’ని అన్నారు.
లక్ష్మీ ప్రియాంక మాట్లాడుతూ.. ‘కొరమీను సినిమాను చూశాను. చాలా బాగుంది. ఆడియెన్స్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను చూడండి’ అని అన్నారు.
నటుడు శత్రు మాట్లాడుతూ.. ‘ప్రతీ ఒక్కరికీ ఇగో ఉంటుంది. ఆ ఇగోను గెలికితే ఎలా ఉంటుందో చూపిస్తుంది ఈ సినిమా. ఆనంద్ రవి రైటింగ్ అద్భుతంగా ఉంది. డైరెక్టర్ శ్రీపతి రాక్షసుడు. సినిమా యూనిట్ అంతా కూడా ఫ్యామిలీలా కలిసి పని చేశాం. డిసెంబర్ 31న సినిమా రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.
హరీష్ ఉత్తమన్ మాట్లాడుతూ.. ‘ఈ క్రాస్ ప్రమోషన్స్ చాలా మంచిది. ఒకే రకమైన పాత్రలు చేస్తున్న సమయంలోనే నాకు శ్రీపతి ఈ కారెక్టర్ చెప్పాడు. ముందు నాకు మీసాల రాజు పాత్ర ఇచ్చాడు. కానీ నేను చేయను అని అన్నాను. కరుణ కారెక్టర్ గురించి తరువాత చెప్పాడు. నాకు చాలా నచ్చింది. కొరమీనుకు ఆనంద్ రవి గారి రైటింగ్ ప్లస్ పాయింట్. ప్రతినిధి, నెపోలియన్ రేంజ్‌లోనే ఈ కొరమీను ఉంటుంది’ అని అన్నారు.
కెమెరామెన్ కార్తిక్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. డిసెంబర్ 31న ఈ చిత్రం రాబోతోంది. మెటాఫర్‌ను చూస్తూ ఈ సినిమాను షూట్ చేశాం. మా టీంను బాగా చూసుకున్న నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సిద్దార్థ్ సదాశివుని మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం టీం అంతా కూడా ఎంతో కష్టపడి పని చేసింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు సినిమాను చూశాను. ప్రతీ టీం అద్బుతంగా పని చేసింది. అప్పుడే అయిపోయిందా? అని అనిపిస్తుంది. ఈ సినిమాను థియేటర్లో చూడండి’ అని అన్నారు.
ఇందు మాట్లాడుతూ.. ‘కొరమీను సినిమాను డిసెంబర్ 31న రాబోతోంది. అందరూ థియేటర్‌కు వచ్చి సినిమాను చూసి మా అందరినీ ఆశీర్వదించండి’ అని అన్నారు.
జబర్దస్త్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘నెపోలియన్ సినిమా నాకు చాలా ఇష్టం. డైరెక్టర్, హీరో, రైటింగ్ అన్నీ చేయడం చాలా కష్టం. కానీ రవి గారు చేసి చూపించారు. కొరమీను సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
రాజా రవీంద్ర మాట్లాడుతూ.. ‘ఇంత వరకు నేను చేయనటువంటి పాత్రను పోషించాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చినందుకు ఆనంద్ రవి గారికి థాంక్స్. ఇది రెగ్యులర్ సినిమాలా ఉండదు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటీనటులు:
……………………….
కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్, దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా ‘జబర్దస్త్’ ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సాంకేతిక వర్గం:
…………………………
ఈ చిత్రానికి పీఆర్వో : నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి బియాండ్ మీడియా, స్టైలిష్: పూజ శేఖర్, ఎడిటర్: విజయ్ వర్ధన్ కె, పాటలు: అనంత నారాయణన్ ఏజీ, ప్రొడక్షన్స్ డిజైనర్: ముసి ఫణి తేజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవన్ కుమార్ జన స్వామి, సినిమాటోగ్రాఫర్: కార్తీక్ కొప్పెర, సౌండ్ డిజైన్: సాయి వర్మ ముదునూరి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సిద్ధార్థ్ సదాశివుని, ప్రొడక్షన్ హౌస్: ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్, మాంగో మీడియా సమర్పణ , డిస్ట్రిబ్యూషన్ : గంగ ఎంటర్టైన్మెంట్స్ , ఆడియో : మాంగో మ్యూజిక్ , స్టోరీ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ : ఆనంద్ రవి, డైరెక్టర్: శ్రీపతి కర్రి, నిర్మాత : పెళ్లకూరు సమన్య రెడ్డి.
‘Korameenu’, a raw and rustic film set in the backdrop of Jalaripeta, stars Anand Ravi, Harish Uthaman and Shatru in key roles. The film’s pre-release event was held today. Presented by Mango Mass Media and produced by Pellakuru Samanya Reddy on Full Bottle Entertainments, it is coming with the caption ‘Story of Egos’ on December 31. The film’s pre-release event was held today.
Team ‘Korameenu’ was at the pre-release event of ‘Lucky Lakshman’ (to be released on December 30) as guests. Anand Ravi and Kishori were there to wish the team. For today’s ‘Korameenu’ event, Sohel, producer Haritha Gogineni, director Abhi, actor Shani were present as guests. The two teams supported each other.
Producer Samanya Reddy said, “The film has come out really well. The media’s influence is of paramount importance. ‘Korameenu’ has been made with a different story. I also wish ‘Lucky Lakshman’ all the best.”
Director Sripathy Karri said, “Please do watch our movie in theatres. I want to talk like an audience member now. This movie is a roller-coaster ride. The audience will turn promoters of the movie after they watch it.”
Anand Ravi said, “I thank the ‘Lucky Lakshman’ team on this occasion. It is releasing on December 30. Our movie is coming out on December 31. Our film is not going to disappoint anyone.”
Heroine Kishori said, “I have played a character named Meenakshi. I thank the director for giving me such a character. He and the producer completely trusted my abilities. I hope I have done full justice to the role. I thank Ravi for writing such a beautiful character.”
Lucky Lakshman director Abhi said, “I am here at this event because of Ravi anna today. I watched his movie ‘Prathinidhi’ while in college. After ‘Napolean’, I met him for the first time. I have been wanting to work with him.”
Lucky Lakshman producer Haritha Gogineni said, “I think ‘Korameenu’ is going to appeal to a wide section of the audience. I hope this movie and our movie ‘Lucky Lakshman’ both become hits.”
Sohel said, “Cross promotions are very likable to me. Small films can earn collections only if ‘word of mouth’ is strong. I loved ‘Prathinidhi’ so much. I love the dialogue in it. ‘Napolean’ had a fresh concept. ‘Korameenu’ is the kind of film I would love to do someday. The trailer looks so promising. I hope ‘Korameenu’ and ‘Lucky Lakshman’ both become big hits.”
Comedian Venu said that he is a big fan of Anand Ravi. He mentioned Ravi’s previous movies and also said that ‘Korameenu’ is very engaging and gripping.
Writer Lakshmi Bhupala said that ‘Prathinidhi’ was supposed to be written by him and directed by Ravi first. “But something else happened. But Ravi’s writing was so good that I might not have written it so well. Coming to ‘Korameenu’, the film seems promising. Kishori is a novel name. She looks like another Aparna Balamurali and Aishwarya Rajesh. I wish director Sripathy and others all the best.”
Lyric writer Purnachari said that he has written four songs in the movie. “Korameenu is going to be a special movie. I have described the role of ego in a man’s life. We have watched the movie and I can assure you that it’s going to give you a bang for the buck. Fun, emotion and excitement are awesome,” he added.
Lakshmi Priyanka said, “I have watched ‘Korameenu’. It’s very good. The audience are going to love it. Please watch it in theatres.”
Actor Shatru said, “Everyone is egoistic. Our film tells the story of egos. Anand Ravi is a wonderful writer. The director Sripathy is very talented. This December 31, please watch our movie with your families.”
Harish Uthaman lauded the film’s cross promotions. “I was offered Meesala Raju character first. But I declined it. Karuna character was offered later. Ravi’s writing is a big asset for ‘Korameenu’,” he added.
The film’s cinematographer Karthik said that Korameenu’s cinematography is metaphorical. Music director Siddharth Sadasivuni said, “I watched the movie while composing the background score. I didn’t know when the movie was over. It was so thrilling.”
Indu said that ‘Korameenu’ must be watched by one and all in theatres. Jabardasth Ram Prasad said that ‘Napolean’ is a film he loved a lot. “It’s not an easy job to play a hero, direct a movie and also write it. Ravi garu did it. ‘Korameenu’, I hope, becomes a big hit,” he added.
Raja Ravindra said that he has essayed a role he has never done before. “I thank Anand Ravi garu on this occasion. This is not a regular film,” he added.