Ktr met municipal incharges and secretaries @ Telangana Bhavan

పార్టీ ప్రధానకార్యదర్శులు, రాష్ర్ట కార్యదర్శులతో టియారెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటియార్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర సమితిని మరింతగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ కార్యాచరణ ఉంటుందని టియారెస్ పార్టీ కార్యనిర్వహాక అధ్యక్షులు కెటి రామారావు తెలిపారు. ఈరోజు పార్టీ అద్యక్షులు, ముఖ్యమంత్రి అదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులతో కెటియార్ ఈరోజు తెలంగాణ భవన్ లో సమావేశం అయ్యారు. ఇప్పటికే టియారెస్ 60 లక్షల కార్యకర్తలతో దేశంలోనే బలమైన పార్టీల్లో ఒకటిగా నిలిచిందన్న కెటియార్, పార్టీ సంస్ధాగత బలంతో టియారెస్ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న పురపాలికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని కెటియార్ తెలిపారు. పురపాలక ఎన్నికల విజయం సాధించేలా యంఏల్యేలు స్దానిక పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలన్నారు. మున్సిపాలీటీల వారీగా పార్టీ, సెక్రటరీలు స్ధానిక పరిస్ధితుల మీద వివరాలు కెటియార్ కు తెలియజేశారు. జిల్లాల వారీగా పార్టీ కమీటీల ఏర్పాటుపైన కెటియార్ చర్చించారు. త్వరలోనే పార్టీ విస్తృతస్ధాయి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మంత్రి కెటియార్ కు ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
రెండవసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటియార్ కు తెలంగాణ భవన్ లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. టియారెస్ యువజన విభాగం అధ్యక్షుడు శంబీపూర్ రాజు అద్వర్యంలో భారీగా టియారెస్ కార్యకర్తలు కెటియార్ కు స్వాగతం తెలిపారు. పలువురు పార్టీ యంఏల్యేలు, యంఏల్సీలు, టియారెస్ కార్పోరేటర్లు, సీనియర్ నాయకులు కెటియార్ కు స్వాగతం పలుకగా, కెటియార్ తెలంగాణ తల్లికి పూలమాల వేసి అంజలి ఘటించారు. కార్యదర్శుల సమావేశం ప్రారంభం కావడానికి ముందు కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు కెటియార్ కు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం ప్రారంభం అయిన తర్వత మంత్రిగా పదవీ భాద్యతలు స్వీకరించిన సత్యవతి రాథోడ్ కి, అసెంబ్లీలో విప్ లుగా నియమించబడిన బొడకుంటి వేంకటేశ్వర్లు, కర్నెప్రభాకర్, భానుప్రసాదరావు, బాల్కా సమన్ లకు సమావేశం తరపున కెటియార్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ రెడ్డి జన్మదినం సందర్భంగా అయనకు పార్టీ నేతలు, కెటియార్ శుభాకాంక్షలు తెలిపారు.