Linga Linga Lyrical Song From Madhurapudi Gramam Ane Nenu
శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “మధురపూడి గ్రామం అనే
నేను”. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఈ
చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు
నిర్మాతలు.కల్యాణ్ రామ్ కత్తి ఫేమ్ మల్లి ఈ సినిమాను డైరెక్ట్
చేస్తున్నాడు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా “మధురపూడి గ్రామం అనే
నేను” సినిమాలోని ‘లింగా లింగా నీరైన గంగా..’ లిరికల్ సాంగ్ ను విడుదల
చేశారు. శివతత్వాన్ని చెప్పే ఈ పాట ఆధ్యాత్మిక భావనతో ఆకట్టుకుంటోంది.
మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ పాటకు పరిమి కేదరనాథ్ సాహిత్యాన్ని
అందించగా..సాయికుమార్ పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే..లింగా లింగా నీరైన
గంగ..గంగ తడిసిన శిలలు శివుని రూపంగా..జన్మకో లీలలు, కర్మ పాశంగా..ధన్యమౌ
జీవులు నిన్ను తెలియంగా..లింగా లింగా నీరైన గంగ..గంగ తడిసిన శిలలు శివుని
రూపంగా..అంటూ సాగుతుందీ పాట. శివలీలను గుర్తుచేస్తూ రాసిన పాటగా
తెలుస్తోంది.
త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలు – కె శ్రీధర్
రెడ్డి, ఎం జగ్గరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – కె శ్రీనివాసరావు,
వై అనిల్ కుమార్, సంగీతం – మణిశర్మ, సినిమాటోగ్రఫీ – సురేష్ భార్గవ్,
ఎడిటర్ – గౌతమ్ రాజు, ఫైట్స్ – రామకృష్ణ, మాటలు – ఉదయ్ కిరణ్, ప్రొడక్షన్
ఎగ్జిక్యూటివ్ నరేన్ జి సూర్య, పీఆర్వో – జీఎస్ కే మీడియా, సమర్పణ – జి
రాంబాబు యాదవ్, బ్యానర్ – లైట్ హౌస్ సినీ మ్యాజిక్, నిర్మాతలు – కేఎస్
శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు, రచన – దర్శకత్వం – మల్లి