loveyouram Movie Event Photos
VV Vinayak Launched First Look & Theme Video Of K Dasaradh, DY Chowdary’s Love You Ram
Director K Dasaradh is known for making classic family entertainers and his Santosham will remain to be one of the best family entertainers in Telugu. Dasaradh wrote the story for his maiden production venture titled as Love You Ram. DY Chowdary who is directing the movie is also producing it, alongside K Dasaradh under Mana Entertainments and Sri Chakra Films banners.
Rohit Behal is playing the lead role, while Aparna Janardhanan is the leading lady. Today, the makers began the promotions by launching the first look and a video depicting theme of the movie. Director VV Vinayak released the first look and the theme video of the movie.
The first-look poster shows the sparkling chemistry of Rohit and Aparna. While Aparna looks gorgeous in traditional wear, Rohit looks handsome here. The theme music is very pleasant and so are the visuals in it.
Sudhakar Borra (Tennessee) and D Nageswar Rao are the co-producers of the movie for which the screenplay was penned by Kishore Gopu and Shiva Mokka. Praveen Varma wrote the dialogues.
Sai Santhosh, K Vedaa, and SB Uddhav take care of the camera, music, and editing departments respectively. Guru Murali Krishna is the art director.
The film’s shoot has been wrapped up and the post-production works are happening at present.
Cast: Rohit Behal, Aparna Janardhanan, Benerjee, Pradeep, Kadambari Kiran, Cartoonist Malik, Meer K Dasaradh, DY Chowdary, Prabhavati Varma, Shanti Devagudi, and others.
Technical Crew:
Director: DY Chowdary
Producers: K Dasaradh, DY Chowdary
Co-producers: Sudhakar Borra (Tennesse), D Nageswara Rao
Banners: Mana Entertainments and Sri Chakra Films
Story: K Dasaradh
DOP: Sai Santhosh
Music: K Vedaa
Editing: SB Uddhav
Screenplay: Kishore Gopu, Shiva Mokka
Dialogues: Praveen Varma
Art: Guru Murali Krishna
PRO: Vamsi-Shekar
కె దశరధ్, డివై చౌదరి ‘లవ్ యూ రామ్’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన డైరెక్టర్ వివి వినాయక్, థీమ్ వీడియోను రిలీజ్ చేసిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్ రమణ
క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లను అందించడంలో పేరుగాంచారు దర్శకుడు కె దశరధ్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సంతోషం’ సినిమా తెలుగులో అత్యుత్తమ ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో ఒకటిగా నిలిచిపోతుంది. దశరధ్ తన తొలి ప్రొడక్షన్ వెంచర్‌కు ‘లవ్ యూ రామ్’ అనే టైటిల్ తో కథని రాశారు. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి మన ఎంటర్టైన్మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రోహిత్ బెహల్ హీరోగా నటిస్తుండగా, అపర్ణ జనార్దనన్ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. ఈరోజు మేకర్స్ ఫస్ట్ లుక్, సినిమా థీమ్‌ను తెలిపే వీడియోను విడుదల చేయడం ద్వారా ప్రమోషన్లను ప్రారంభించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ని డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేయగా, థీమ్ వీడియోను తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్ రమణ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రోహిత్, అపర్ణల కెమిస్ట్రీ ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తుల్లో అపర్ణ చాలా అందంగా కనిపించగా, రోహిత్ హ్యాండ్సామ్ గా కనిపించాడు. థీమ్ మ్యూజిక్, విజువల్స్ చాలా ఆహ్లాదకరంగా వున్నాయి.
అనంతరం వివి వినాయక్ మాట్లాడుతూ.. దశరధ్ మంచి స్నేహితుడు. ఇష్టమైన వ్యక్తి. తన కథ రాసి చౌదరిగారితో కలసి తొలిసారిగా ప్రొడక్షన్ లోకి వచ్చారు. మన స్టూడియో పెట్టి డివై చౌదరి గారు గత 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో వున్నారు. ఆయన తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. హీరో, హీరోయిన్లు చక్కగా ఫెర్ ఫార్మ్ చేశారు. బెనర్జీ గారి పాత్ర కొత్తగా వుంటుంది. అందరూ చక్కగా చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు.
కె దశరధ్ మాట్లాడుతూ..నేను చేసిన ప్రతి కథ ఓ ముగ్గురికి చెబుతాను. అందులో వినాయక్ గారు ఒకరు. ఆయన ఇచ్చిన అద్భుతమైన సూచునలతో ఈ కథ చేశాం. ఆయనకి కృతజ్ఞతలు. అలాగే గోపి మోహన్ హరికృష్ణ గారు నాపై వున్న ప్రేమతో అన్ని రకాలుగా సహాయం చేశారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. డివై చౌదరి నాకు చిన్నప్పటి ఫ్రండ్. మా ఇద్దరిదీ ఒకటే ఊరు. ఇండస్ట్రీకి వచ్చాక కూడా పాతికేళ్ళుగా ఫ్రండ్ గా ఉంటున్నాం. తనతో కలసి ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం చాలా మంది ప్రతిభగ యువకులు పని చేశారు. స్క్రీన్ ప్లే కిషోర్ గోపు, శివ అందించారు. ప్రవీణ్ వర్మ మాటలు రాస్తున్నారు. ఉద్ధవ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కె వేద మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా కోసం చాలా మంచి టీం వర్క్ చేశాం” అన్నారు.
డివై చౌదరీ మాట్లాడుతూ.. దశరధ్ చాలా స్ఫూర్తిని నింపే కథ చెప్పారు. ప్రస్తుత జనరేష్ కి కావాల్సిన సందేశం ఇందులో వుంది. ప్రేమించడమే జీవితం అని నమ్మే అమ్మాయి, నమ్మించమే జీవితం అని భావించే అబ్బాయి మధ్య జరిగే ప్రేమ కథ. చాల మంచి ఫీల్ గుడ్ మూవీ. దశరధ్ బ్రాండ్ కనిపిస్తుంది. లవ్ యూ రామ్ సినిమాని టీం అంతా కలసి ఒక ఫ్యామిలీలా పని చేశాం. టీం సపోర్ట్ వలన చాలా హ్యాపీగా షూటింగ్ పూర్తి చేశాం. మారేడుమిల్లి, ఖమ్మం, నార్వే లాంటి ప్రదేశాల్లో షూట్ చేశాం. మా టీం చాలా సపోర్ట్ చేసింది. మంచి కథ, కథనంతో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి”అంబి కోరారు .
రోహిత్ బెహల్ మాట్లాడుతూ.. దశరధ్ , డివై చౌదరిగారికి కృతజ్ఞతలు. రామ్ పాత్ర నేను చేయగలనని నమ్మారు. ఈ ప్రాజెక్ట్ భాగం కావడం ఎంతో అనందంగా వుంది. లవ్ యూ రామ్ చాలా స్పెషల్ మూవీ. అద్భుతమైన లోకేషన్స్ లో చిత్రీకరీంచాం. సినిమా కంప్లీట్ ప్యాకేజ్ లా వుంటుంది. ఈ సినిమా పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణలందరికీ కృతజ్ఞతలు” తెలిపారు.
అపర్ణ జనార్దనన్ మాట్లాడుతూ.. లవ్ యూ రామ్ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని తెరకెక్కించాం. అందరూ సినిమాని చూసి మమ్మల్ని ప్రోత్సహించాలి” అని కోరారు
బెనర్జీ మాట్లాడుతూ.. లవ్ యూ రామ్ వండర్ ఫుల్ లవ్ స్టొరీ. ఈ సినిమా షూటింగ్ గొప్ప అనుభూతిని ఇచ్చింది. డివై చౌదరి గారు అద్భుతంగా డైరెక్ట్ చేశారు. దశరధ్ గారు చాలా గొప్ప కథని అందించారు. చాలా మంచి మ్యూజిక్ వుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ గ్రేట్ వర్క్ ఇచ్చారు. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాదిస్తుంది” అన్నారు
సుధాకర్ బొర్రా (టేనస్సీ), డి నాగేశ్వర్ రావు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ గోపు, శివ మొక్క స్క్రీన్ ప్లే అందించారు. ప్రవీణ్ వర్మ మాటలు రాశారు.
సాయి సంతోష్ కెమరామెన్ గా, ఎస్.బి ఉద్ధవ్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కె వేద మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
తారాగణం: రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్, బెనర్జీ, ప్రదీప్, కాదంబరి కిరణ్, కార్టూనిస్ట్ మల్లిక్, మీర్, కె దశరధ్, డివై చౌదరి, ప్రభావతి వర్మ, శాంతి దేవగుడి తదితరులు
సాంకేతిక విభాగం
దర్శకత్వం: డివై చౌదరి
నిర్మాతలు: కె దశరధ్, డివై చౌదరి
సహ నిర్మాతలు: సుధాకర్ బొర్రా (టేనస్సీ), డి నాగేశ్వరరావు
బ్యానర్లు: మన ఎంటర్టైన్మెంట్స్, శ్రీ చక్ర ఫిల్మ్స్
కథ: కె దశరధ్
డీవోపీ: సాయి సంతోష్
సంగీతం: కె వేద
ఎడిటింగ్: ఎస్.బి ఉద్ధవ్
స్క్రీన్ ప్లే: కిషోర్ గోపు, శివ మొక్క
డైలాగ్స్: ప్రవీణ్ వర్మ
ఆర్ట్: గురు మురళీకృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్