Madhanam Trailer launch photos
1-నేనొక్కడినే సినిమా అక్కడ ఆడకపోయుంటే ఇక్కడ నేను ఉండేవాన్ని కాదు – సుకుమార్
కొరియోగ్రాఫర్ అజయ్ సాయి మణికందన్ మొదటిసారిగా దర్శకత్వం వహిస్తూ శ్రీనివాస్ సాయి హీరోగా నటిస్తున్న మథనం ట్రైలర్ లాంచ్ హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది,
దీనికి ముఖ్య అతిధులు గా స్టార్ డైరెక్టర్స్ సుకుమార్,సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సినిమా డిసెంబర్ 6న అమెరికాలో రిలీజ్ కానుంది.
లిరిసిస్ట్ పూర్ణ చారి మాట్లాడుతూ…
సుకుమార్ సర్ ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్స్ మీరు సపోర్ట్ చేస్తే మాములు సినిమా కూడా మంచి హిట్ అవుతుంది.దానికి ఉదాహరణ ఈ మధ్య వచ్చిన రాజావారు-రాణిగారు సినిమా.మీ సపోర్ట్ ఈ సినిమాకి ఉండడం చాలా హ్యాపీగా ఉంది.
ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయి అండి, అన్ని నేనే రాసాను,సిద్ శ్రీరామ్ పాడిన ఎగిరేగిరే
పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
హీరో శ్రీనివాస్ సాయి మాట్లాడుతూ….
నన్ను ప్రొడ్యూసర్ కి ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ గారికి చాలా థాంక్స్ అండి,నన్ను అందరూ యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు అని అడుగుతారు,
నేనెక్కడ నేర్చుకోలేదు అండి,అజయ్ సర్ దగ్గరకి డాన్స్ క్లాస్ కి వెళ్తే అక్కడ అద్దాలులో చూసి ఎక్స్ప్రెషన్స్ నేర్చుకున్న.ఈ సినిమా మీద నాకు మంచి నమ్మకం ఉంది అండి,ఈ టీం అంత బాగా సపోర్ట్ చేశారు,ఈ సినిమా డిసెంబర్ 6 న అమెరికాలో రిలీజ్ కానుంది.
హీరోహిన్ భావన రావ్ మాట్లాడుతూ….
ఇక్కడికి వచ్చిన సుకుమార్,సురేందర్ రెడ్డి సర్ కు చాలా థాంక్స్ అండి.
ఈ సినిమా చేయడం చాలా ఆనందగా ఉంది,టీం అంత మంచి సపోర్ట్ చేసారు.డిసెంబర్ 6న అమెరికాలో రిలీజ్ కానుంది.నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి చాలా థాంక్స్.
డైరెక్టర్ అజయ్ సాయి మాట్లాడుతూ….
ఇక్కడికి వచ్చిన సురేందర్ రెడ్డి,సుకుమార్ గారికి థాంక్స్ అండి,
నా టీం లో వర్క్ చేసిన అందరికి చాలా థాంక్స్ అండి,అందరూ చాలా బాగా కష్టపడ్డారు.చాలా జెన్యూన్ గా వర్క్ చేసాము,ఇది చాలా ఆనందంగా ఉంది.
ఎక్కడో కేరళ లో పుట్టి,తమిళ్ నాడు లో పెరిగి,హైదరాబాద్ లో సినిమా చేస్తే అమెరికాలో రిలీజ్ అవుతుంది.
అందరికి చాలా థాంక్స్ అండి.
ప్రొడ్యూసర్ అశోక్ ప్రసాద్ మాట్లాడుతూ….
ఇక్కడికి వచ్చిన సుకుమార్,సురేందర్ రెడ్డి గారికి చాలా థాంక్స్ అండి,
ఈ సినిమాపై మా డైరెక్టర్ 6 సవంత్సరాలు కష్టపడ్డారు, అందుకే ఈ సినిమా డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నాం.టీం అందరూ మంచి సపోర్ట్ చేసారు,ఇది ఒక చిన్న సినిమాల ఉండదు,నేను కూడా కాంప్రమైజ్ కాలేదు.కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది.
ఫస్ట్ టైం అమెరికాలో రిలీజ్ చేస్తున్నాం.
నా వైఫ్ దివ్య ప్రసాద్ మంచి సపోర్ట్ చేసింది.
డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ….
ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా చేసిన అశోక్ ప్రసాద్ సినిమా పిచ్చోడు,
ఈ కథ ఒక కొత్త ప్రయత్నం,ఖచ్చితంగా బాగుంటుంది,అమెరికాలో ముందు రిలీజ్ అవుతుంది అక్కడ రెస్పాన్స్ బట్టి ఇక్కడ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ప్రేక్షకుల ఆదరిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ….
లాస్ట్ లో మాట్లాడితే మనం మాట్లాడనికి మాటలు ఉండవు,
అమెరికా ప్రేక్షకులకు చాలా థాంక్స్ అండి,1 నేనొక్కడినే సినిమా అక్కడ బాగా సపోర్ట్ చేశారు, ఆ సపోర్ట్ వలనే నేను ఇక్కడ నిల్చుని ఉన్నాను,
ఈ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్ మొదటి నుంచి నవ్వుతూనే ఉన్నారు,
అప్పుడు అర్ధమైంది సినిమా మీద ఎంత నమ్మకంతో ఉన్నారు అని.
సినిమా మంచి విజయం కావాలని కోరుకుంటున్నాను.
చివరగా
ప్రియాంకా రెడ్డి విషయాన్ని గురించి చెబుతూ తన బాధను వ్యక్తం చేస్తూ,ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.