Mass Maharaja Ravi Tej’s First Look From Mega Star Chiranjeevi
Mass Maharaja Ravi Tej’s First Look From Mega Star Chiranjeevi, Bobby Kolli, Mythri Movie Makers Waltair Veerayya On December 12th
Megastar Chiranjeevi and Mass Maharaja Ravi Teja are working together to create a storm at the box office with the highly anticipated movie Waltair Veerayya which is being directed ambitiously by director Bobby Kolli (KS Ravindra). Chiranjeevi’s first look, title teaser, and also first single increased the buzz on the movie.
Here comes an update about Ravi Teja’s first look in the movie. The makers released a power-packed pre-look poster to make the announcement regarding Ravi Teja’s first look. Holding a baby goat in one hand and holding an axe in another hand to drag the cylinder, Ravi Teja is all set for the action. “Mass Is Coming,” reads the poster. The first look of Ravi Teja will be out on December 12th at 11:07 AM.
Shruti Haasan is the leading lady opposite Chiranjeevi in the film and songs are currently being filmed on the lead pair in Europe. Music for the movie is scored by Rockstar Devi Sri Prasad.
The film is produced on a grand scale by Naveen Yerneni and Y Ravi Shankar of Mythri Movie Makers, while GK Mohan is the co-producer.
Arthur A Wilson cranks the camera, whereas Niranjan Devaramane is the editor and AS Prakash is the production designer. Sushmita Konidela is the costume designer.
While the story and dialogue were written by Bobby himself, Kona Venkat and K Chakravarthy Reddy penned the screenplay. The writing department also includes Hari Mohana Krishna and Vineeth Potluri.
Waltair Veerayya will be hitting the screens grandly worldwide on January 13, 2023.
Cast: Chiranjeevi, Ravi Teja, Shruti Haasan and others.
Technical Crew:
Story, Dialogues, Direction: KS Ravindra (Bobby Kolli)
Producers: Naveen Yerneni and Y Ravi Shankar
Banner: Mythri Movie Makers
Music Director: Devi Sri Prasad
DOP: Arthur A Wilson
Editor: Niranjan Devaramane
Production Designer: AS Prakash
Co-Producers: GK Mohan, Praveen M
Screenplay: Kona Venkat, K Chakravarthy Reddy
Additional Writing: Hari Mohana Krishna, Vineeth Potluri
CEO: Cherry
Costume Designer: Sushmita Konidela
Line Producer: Balasubramanyam KVV
PRO: Vamsi-Shekar
Publicity: Baba Sai Kumar
Marketing: First Show
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ నుండి మాస్ మహారాజా రవితేజ ఫస్ట్ లుక్ డిసెంబర్ 12న విడుదల
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి భారీ అంచనాలు వున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించడానికి సిద్ధమౌతున్నారు. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్, ఫస్ట్ సింగిల్ కూడా సినిమాపై బజ్ పెంచాయి.
ఈ సినిమాలో రవితేజ ఫస్ట్ లుక్ గురించి అప్ డేట్ వచ్చింది. రవితేజ ఫస్ట్ లుక్ కి సంబంధించిన అనౌన్స్ మెంట్ చేయడానికి మేకర్స్ పవర్-ప్యాక్డ్ ప్రీ-లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఓ చేతిలో మేక పిల్లను పట్టుకుని మరో చేతిలో గొడ్డలి పట్టుకుని సిలిండర్‌ని లాగుతున్న రవితేజ.. పవర్ ఫుల్ యాక్షన్‌కు సిద్ధమైనట్లు కనిపించారు. “మాస్ ఈజ్ కమింగ్” అని పోస్టర్ పై రాసుంది. రవితేజ ఫస్ట్ లుక్ డిసెంబర్ 12వ తేదీ ఉదయం 11:07 గంటలకు విడుదల కానుంది.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, ప్రస్తుతం యూరప్ లో లీడ్ పెయిర్‌పై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత.
ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్ దేవరమానె ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.
ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్మెంట్లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.
నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు.
సాంకేతిక విభాగం:
కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
సిఈవో: చెర్రీ
కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల
లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో