Meeku Maathrame Cheptha teaser released
‘‘మీకు మాత్రమే చెప్తా’’ టీజర్ రిలీజ్
కింగ్ ఆప్ ది హిల్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సెన్సేషనల్ హీరో విజయ్
దేవరకొండ నిర్మిస్తోన్న చిత్రం ‘‘మీకు మాత్రమే చెప్తా’’. ఎవ్రీ ఫోన్
హ్యాజ్ ఇట్స్ సీక్రెట్స్ అనేది ట్యాగ్ లైన్. తరుణ్ భాస్కర్,అభినవ్ గోమటం
లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ మూవీ లోఅనసూయ భరద్వాజ్,వాణి భోజన్,పావని
గంగిరెడ్డి,నవీన్ జార్జ్ థామస్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. టైటిల్ కు తగ్గట్టుగానే ఫన్
ఎంటర్టైనర్ గా ఉండబోతోందని టీజర్ చూస్తేనే తెలుస్తుంది.
‘‘మీకు మాత్రమే చెప్తా’’ అనే క్యాచీ టైటిల్ తో వస్తోన్న ఈ మూవీ టీజర్
తోనే ప్రామిసింగ్ మూవీ అనిపించుకుంటోంది. చిన్న పాయింట్ చుట్టూ
అల్లుకున్న మంచి ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. ఇక థియేటర్ లో పూర్తిగా
నవ్వులు పంచేందుకు మూవీ టీమ్ రెడీ అవుతోంది.షూటింగ్ అంతా కంప్లీట్
చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దశలో ఉంది..అన్ని
కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు
ప్లాన్ చేస్తున్నారు.
నటీనటులు : తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్,అభినవ్ గోమటం, పావని
గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్
వర్మ,జీవన్
కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ : మదన్ గుణదేవా, సంగీతం : శివకుమార్, ఆర్ట్ డైరెక్టర్ :
రాజ్ కుమార్, కో డైరెక్టర్ : అర్జున్ కృష్ణ, పిఆర్.వో : జి.ఎస్.కె
మీడియా, లైన్ ప్రొడ్యూసర్ : విజయ్ మట్టపల్లి, నిర్మాతలు : వర్ధన్
దేవరకొండ, విజయ్ దేవరకొండ, రచన, దర్శకత్వం : షమ్మీర్ సుల్తాన్