Mega family pongal@Mega star Chiru’s house
పండగ అంటే పదిమంది కలవడం,
ఆనందంగా గడపడం,
ఎన్ని పనులు ఉన్న ఆ టైం కి అన్ని ముగించుకుని నా అనుకున్నవాళ్లకు దగ్గరవుతాం.
ఆ కలవడంలో ఉన్న ఆనందం వేరు
అలా కలిసి పండగ చేసుకోవడంలో ఉన్న ఆనందం ఎన్ని కోట్లు ఖర్చుపెట్టిన కొనుక్కోలేం.
ఈ విషయాన్నీ గుర్తుపెట్టుకున్నా మెగా కుటుంబం అంతా ఒక్కటిగా కలిసి సంక్రాంతి పండగను జరుపుకున్నారు.
పవన్ కళ్యాణ్ మినహా మెగా ఫ్యామిలీ అంతా కలిసి అకిరా ఆనంద్ సహా చిరంజీవి ఇంట్లో పండగను జరుపుకుని ప్రేక్షకులకు ఇలా ఫోటో రూపంలో కనువిందు చేస్తూ,
ఈ సంక్రాంతి మీ కుటుంబ సభ్యులు,
బంధువులతో ఆనందంగా జరుపుకోవాలని అనే సందేశాన్ని అంతర్లీనంగా తెలియజేసారు.!
మీకు మీ కుటుంబ సభ్యులకు మా సిరి సినిమా తరుపున సంక్రాంతి శుభాకాంక్షలు.