Megastar Chiranjeevi Bholaa Shankar Movie Opening Photos
Megastar Chiranjeevi, Meher Ramesh, Anil Sunkara’s Mega Massive Movie Bholaa Shankar Launched Grandly
Megastar Chiranjeevi’s Mega Massive Action Entertainer “Bholaa Shankar” to be helmed by stylish maker Meher Ramesh and produced by Ramabrahmam Sunkara has been launched grandly today with several special guests gracing the pooja ceremony.
Legendary filmmaker K Raghavendra Rao sounded the clap board for the muhurtham shot on Chiranjeevi, while VV Vinayak switched on the camera. Directors Koratala Siva, Harish Shankar, Vamsi Paidipally, Bobby, Malineni Gopichand, N Shankar and writer Satyanand who attended the grand launching ceremony have handed over the film’s script to the makers.
Bholaa Shankar has been making enough noise, ever since it was announced officially. Then, the title poster, followed by Rakhi special video got overwhelming response. Look test was performed on Chiru recently and everyone is curious to see how Meher Ramesh will be presenting the megastar in the highly anticipated film.
The film boasts of a good story-line, an ensemble cast and a stellar technical team. While Dazzling Beauty Tamannaah Bhatia will play the leading lady opposite Chiranjeevi, smiling sensation Keerthy Suresh will essay his sister in the film which will have all the emotions and elements in right proportions, making it a pucca commercial entertainer.
Coming to technical crew, young sensation Mahati Swara Sagar renders soundtracks, while Dudley cranks the camera. Anil Sunkara’s AK Entertainments will be producing the film, in association with Creative Commercials, on a massive scale. Story supervision is by Satyanand, wherein Marthand K Venkatesh will take care of editing and AS Prakash is the production designer. Kishore Garikipati is the executive producer.
The regular shoot of the movie commences from 15th of this month. Bholaa Shankar will release in theatres in 2022.
Cast: Chiranjeevi, Tamannaah Bhatia, Keerthy Suresh, Raghu Babu, Rao Ramesh, Murali Sharma, Ravi Shankar, Vennela Kishore, Tulasi, Pragathi, Sri Mukhi, Bithiri Sathi, Satya, Getup Srinu, Rashmi Gautam, Uttej, Prabhas Seenu etc.
Technical Crew:
Director: Meher Ramesh
Producer: Ramabrahmam Sunkara
Banner: AK Entertainments
Ex-Producer: Kishore Garikipati
Music: Mahati Swara Sagar
DOP: Dudley
Editor: Marthand K Venkatesh
Production Designer: AS Prakash
Story Supervision: Satyanand
Fight Masters: Ram-Laxman, Dileep Subbarayan, Kaeche Kampakdee
Choreography: Sekhar Master
Lyrics: Ramajogayya Sastry, Kasarla Shyam, Srimani, Sirasri
PRO: Vamsi-Shekar
VFX Supervisor: Yugandhar
Publicity Designers: Anil-Bhanu
Digital Media Head: Viswa CM
Line Production: Meherr Creations
మెగాస్టార్ చిరంజీవి స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్లో రాబోతోన్న యాక్ష్ ఎంటర్టైనర్ భోళా శంకర్ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను హైద్రాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు ఘనంగా నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు క్లాప్ కొట్టగా.. వి వి వినాయక్ కెమెరామెన్ స్వీచ్ ఆన్ చేశారు. కొరటాల శివ, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, బాబీ, గోపీచంద్ మలినేని, ఎన్ శంకర్, రైటర్ సత్యానంద్ కలిసి స్క్రిప్ట్ ను మేకర్స్ కి అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో …
అనిల్ సుంకర మాట్లాడుతూ.. ‘గత ఏడాదిగా ఈ స్క్రిప్ట్ మీద మెహర్ రమేష్ గారు ఎంతో వర్క్ చేశారు. మా హీరోయిన్ తమన్నాను మళ్లీ రిపీట్ చేస్తున్నాం.. సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ను కంటిన్యూ చేస్తాం’ అని అన్నారు..
కేఎస్ రామారావు మాట్లాడుతూ.. ‘చాలా ఏళ్ల తరువాత ఇది నాకు చాలా మంచి రోజు. అనిల్, రమేష్ గారు నన్ను మరి చిరంజీవికి మళ్లీ దగ్గర చేశారు. ఎన్నో ఎళ్లు గ్యాప్ వచ్చింది. మొత్తానికి మేం ఇద్దరం కలిసి జర్ని చేస్తున్నాం. భవిష్యత్తులోనూ ఇంతే ఎనర్జీతో ముందుకు వెళ్తాం. ఇది చాలా పెద్ద విజయం సాధించాలి’ అని అన్నారు.
మహతి స్వర సాగర్ మాట్లాడుతూ.. ‘ఈ అవకాశం ఇచ్చినందుకు మెహర్ భయ్యాకు థ్యాంక్స్. డ్రీమ్ కమ్స్ ట్రూ అంటారు. కానీ ఇది అంతకంటే పెద్దది. చాలా థ్యాంక్స్’ అని అన్నారు.
తమన్నా మాట్లాడుతూ.. ‘ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సినిమాలు బయటకు రావడం, హిట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పెద్ద సినిమాలు ఇంకా ప్రారంభం అవ్వడం, ఇలాంటివి త్వరగా రావాలని ప్రేక్షకులు అనుకుంటారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు అనిల్ గారికి థ్యాంక్స్. ఈ ఏడాదిలో చాలా సినిమాలు చేశాను. ఇక కాస్త బ్రేక్ తీసుకుందామని అనుకున్నాను. కానీ మెహర్ గారు నన్ను అడిగారు. మామూలుగా అయితే కెరీర్ ప్రారంభంలోనే నేను ఆయనతో చేయాల్సింది. కానీ డేట్స్ వల్ల అడ్జస్ట్ కాలేదు. ఈ చిత్రంలో నేను ఈ పాత్రకు న్యాయం చేస్తాను అని నమ్మనందుకు థ్యాంక్స్. ఇప్పటి వరకు నా బెస్ట్ చూడలేదని అనుకుంటున్నాను. ఇందులో నన్ను మెహర్ గారు అద్బుతంగా చూపిస్తారు అని అనుకుంటున్నాను. ఇన్నేళ్ల తరువాత రీమేక్ చేస్తున్నారంటే.. ఆ కథలోని బలం. అది మెహర్ గారు ఇంకా బాగా చూపిస్తారని అనుకుంటున్నాను. కెమెరామెన్ డడ్లీ ఎప్పుడూ నన్ను అందంగానే చూపిస్తారు’ అని అన్నారు.
కెమెరామెన్ డడ్లీ మాట్లాడుతూ.. ‘మెహర్ రమేష్ గారు నాకు పదేళ్లుగా తెలుసు. ఆయన అడిగితే నో చెప్పలేను. ఇదే నా మొదటి చిత్రం. కచ్చితంగా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. తమన్నాతో ఇది నాకు రెండో చిత్రం. షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.
మెహర్ రమేష్ మాట్లాడుతూ..‘ఏడాదిన్నర కష్టపడి రెడీ చేశాం.. అనిల్ గారు, నేను కలిసి మొదట చిరంజీవిని కలిసినప్పుడు ఎంత ఎనర్జీతో ఉన్నామో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. సత్యానంద్ గారి ఆధ్వర్యంలో స్క్రిప్ట్ వర్క్ చేశాం. ఇది మంచి కథ, సిస్టర్ సెంట్రిక్ కథ. రామారావు గారు నన్ను కన్నడలో దర్శకుడిగా పరిచయం చేశారు. బాస్ సినిమాతొ మళ్లీ ఇలా కలవడం ఆనందంగా ఉంది. చిరంజీవి గారితో ఎన్నెన్నో బ్లాక్ బస్టర్లు తీశారు. ఆయనతో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. చిరంజీవి గారితో సినిమా చేయాలనేది నా డ్రీమ్. ఇన్నేళ్య గ్యాప్ తరువాత మంచి కథతో రావాలి.. చిరంజీవితో కలిసి రావాలని అనుకున్నాను. నా శక్తినంతా ఇందులో పెడతాను. కమర్షియల్గా అందరికీ నచ్చేలా చేస్తాను. తమన్నా చాలా బిజీగా ఉంది. ఎన్నో సినిమాలు చేస్తోంది. సిస్టర్ పాత్రకు కీర్తి సురేష్ ఓకే అయ్యింది. అయితే కథ చెప్పేటప్పుడే తమన్నా అని అందరికీ చెప్పాను. ఎలా అయినా సరే మాకు డేట్స్ ఇవ్వమని తమన్నాను అడిగాం. ఇందులో సాంగ్స్ ప్రత్యేకంగా ఉండబోతోన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్గా సాగర్ని అనుకున్నాను అంటే.. అనిల్ గారు, చిరంజీవి గారు వెంటనే ఓకే చెప్పారు. అందరూ అన్నయ్యను భోళా శంకర్ అని అంటారు. ఆయన పేరులో కూడా ఉంటుంది. ఈ టైటిల్ పెట్టడంతో వైబ్రేషన్స్ మారిపోయాయి. మీడియా మద్దతు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటీనటులు : చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు
సాంకేతిక బృందం
డైరెక్టర్ : మెహర్ రమేష్
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిషోర్ గరికిపాటి
డీఓపీ : డడ్లీ
సంగీతం : మహతి స్వర సాగర్
ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్
స్క్రిప్ట్ పర్యవేక్షణ : సత్యానంద్
ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, దిలీస్ సుబ్బరాయన్, కెచ్చా
కొరియోగ్రఫర్ : శేఖర్ మాస్టర్
లిరిక్స్ : రామ జోగయ్య శాస్త్రి, కాస్లర్ శ్యాం, శ్రీమణి, సిరా శ్రీ
వీఎఫ్ఎక్స్ : యుగంధర్
పబ్లిసిటీ డిజైన్ : అనిల్ భాను
పీఆర్వో : వంశీ శేఖర్
డిజిటల్ మీడియా హెడ్ : విశ్వ సీఎం
లైన్ ప్రొడక్షన్ : మెహర్ క్రియేషన్స్
ప్రొడక్షన్ కంట్రోలర్ : అజయ్ కుమార్ వర్మ
చీఫ్ కో డైరెక్టర్ : లలిత్ ప్రభాకర్
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్స్ : రామకృష్ణ రెడ్డి, రవి దుర్గా ప్రసాద్