Megastar Chiranjeevi & Koratala Siva Film Pooja Ceremony

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై కొత్త చిత్రం
మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా కొత్త చిత్రం ప్రారంభమైంది. చిరంజీవి 152వ చిత్రమది.
`ఖైదీ నంబర్ 150`, `సైరా నరసింహారెడ్డి` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత చిరంజీవి హీరోగా.. డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్స్తో వరుస బ్లాక్ బస్టర్స్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను హైదరాబాద్‌లో నిర్వహించారు.
శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైన్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాతలు: రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి
బ్యానర్స్: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: సురేష్ సెల్వరాజన్