Megastar deep condolences on demise of Ali’s mother

అలీని మెగాస్టార్ చిరంజీవి పరామర్ళ
ప్రముఖ హాస్యనటుడు అలీ తల్లి జైతన్ బీబీ మరణ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి
హైదరాబాద్ లోని అలీ ఇంటికి చేరుకుని పరామర్ళించారు. జైతన్ బీబీ పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రాజమండ్రిలో చనిపోవడంతో మృతదేహాన్ని గురువారం ఉదయం హైదరాబాద్ కు తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే చిరంజీవి అలీ ఇంటికి బయలుదేరి వెళ్లారు. చాలాసేపు అక్కడే గడిపి అలీని ఓదార్చారు.