Mismatch Review

ఇట్స్ ఏ డ్రా మ్యాచ్
నటీనటులు-ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్,ప్రదీప్ రావత్,సంజయ్ స్వరూప్,
దర్శకత్వం- ఎన్. వి.నిర్మల్ కుమార్
నిర్మాత- జి.శ్రీరామ్ రాజ్,కె భరత్ రామ్
సంగీతం-గిప్ట్ న్
సినిమాటోగ్రఫీ- ఎమ్. సి.గణేష్ చంద్ర
ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్ జంటగా డాక్టర్.సలీమ్ సినిమా దర్శకుడు నిర్మల్ దర్శకత్వంలో వచ్చిన “మిస్ మ్యాచ్” ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ:
సిద్ధు(ఉదయ్ శంకర్) ఒక తెలివైన స్టూడెంట్,ఒక మంచి ఫ్యామిలీ లో పద్ధతి గా పెరుగుతున్న కుర్రాడు,
మహాలక్ష్మి (ఐశ్వర్య రాజేష్) స్కూల్లో జరిగిన ఒక సంఘటన వలన చిన్నప్పుడు స్కూల్ మానేసి,తండ్రీ వారసత్వంగా కుస్తీ పోటీలను ప్రాక్టీస్ గోల్డ్ మెడల్ సంపాదించాలని అని ఆశయంతో బ్రతుకున్న ఒక అమ్మాయి.
సిద్ధు ను మహాలక్ష్మి ఎక్కడ కలిసింది,
ఎలా కలిసింది,వాళ్లద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది,వాళ్లిద్దరూ మళ్ళీ విడిపోవడానికి ఎలాంటి కారణాలు అడ్డు వచ్చాయి,చివరగా ఎలా కలిసారు,వాళ్ళ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు అనే విషయాలను తెరపైన చూడాల్సిందే.
విశ్లేషణ:
ఆట గదరా శివ తరువాత ఉదయ్ శంకర్ హీరోగా చేసిన ఈ సినిమాలో తన నటన తో పర్వాలేదు అనిపించాడు, అక్కడక్కడ హీరో లో పవర్ స్టార్ మ్యానరిజమ్స్ , అటిట్యూడ్ కనిపిస్తాయి.హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ చాలా బాగా చేసింది,
ఇద్దరి మధ్యలో ఉన్న కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి,గిఫ్ట్ న్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు,ఈ సినిమాలో మ్యూజిక్ ఒక కొత్త ఫీల్ ని క్రియేట్ చేస్తుంది.తొలిప్రేమ సినిమాలోని ఈ మనసే సాంగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు అనిపిస్తుంది.సినిమాలోని అక్కడక్కడ వచ్చే ఫైట్ సీన్స్ బాగుంటాయి,ఇంకొన్ని అంశాలను జోడించి, తండ్రి,కూతురు మధ్యలో ఏమోషన్ బాగా చూపించగలిగితే సినిమా ఇంకా బాగుండేది అని చెప్పొచ్చు.
ఓవర్ ఆల్ గా ఒకసారి చూడదగ్గ ఒక యావరేజ్ సినిమా ఈ “మిస్ మ్యాచ్”
Rating- 2.5