Mukha Chitram Movie Teaser launch Photos
ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న “ముఖచిత్రం” టీజర్, విశ్వక్ సేన్ చేతుల
మీదుగా రిలీజ్.
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన
పాత్రల్లో నటిస్తున్న సినిమా ముఖచిత్రం. కలర్ ఫొటో మూవీ తో హిట్ కొట్టిన
దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే, మాటలు
అందిస్తున్నారు. కాల భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ఎస్
కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల
ముఖచిత్రం సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ అనే కొత్త
దర్శకుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఫన్ అండ్ ఇంటెన్స్
డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ ను గురువారం హైదరాబాద్ ప్రసాద్
ల్యాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో హీరో విశ్వక్ సేన్ విడుదల చేశారు.
అనంతరం విశ్వక్ సేన్ మాట్లాడుతూ…నాకు ఈ నగరానికి ఏమైంది చిత్రంలా
సినిమా బండి తర్వాత వికాస్ వశిష్టకు ముఖచిత్రం డిఫరెంట్ సినిమా అవుతుంది.
ప్రియ వడ్లమానికి ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది. తను ఎప్పటినుంచో ఓ మంచి
సినిమా కోసం వేచి చూస్తోంది. టీజర్ చాలా బాగుంది. టెక్నికల్ గా
ఆకట్టుకునేలా ఉంది. సినిమా చూపిస్తా అన్నారు. సినిమా చూసేందుకు నేను
ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. మొత్తం టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నారు.
ప్రియ వడ్లమాని మాట్లాడుతూ..ముఖచిత్రం లాంటి గొప్ప సినిమా నాకు
ఇచ్చినందుకు సందీప్ రాజ్ కు థాంక్స్. ఇలాంటి సినిమా కోసం నేను చాలా
కాలంగా వేచి చూస్తున్నాను. ఇప్పుడు ఏమీ మాట్లాడలేకపోతున్నా. ప్రీ రిలీజ్
కార్యక్రమంలో మాట్లాడుతా. అన్నారు.
నిర్మాత ప్రదీప్ మాట్లాడుతూ…ప్రొడక్షన్ లో మాకు అనుభవం లేదు. దాంతో
టీమ్ ను కొంత ఇబ్బంది పెట్టాము. కానీ అందరూ అర్థం చేసుకుని సినిమా
కంప్లీట్ చేశారు. మా యూనిట్ అందరికీ థాంక్స్. అన్నారు.
దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ…ముఖచిత్రం కు మొదట హీరోను వెతకడమే
టాస్క్ అయ్యింది. సినిమా బండి చూశాక వికాస్ పర్పెక్ట్ అనుకున్నాము. 30
వెడ్స్ 21 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న చైతన్య కు లీడ్ క్యారెక్టర్
చెప్పగానే చేస్తానన్నారు. ప్రియవడ్లమాని లేకుంటే ఈ సినిమా లేదు. తను ఎంత
కీలకమో, ఎంత బాగా నటించిందో సినిమా చూస్తే తెలుస్తుంది. ఎస్ కే ఎన్
నిర్మాతగా నా దర్శకత్వంలో ఓ పెద్ద సినిమా చూడాలని కోరుకుంటున్నా.
అన్నారు.
హీరో వికాస్ వశిష్ట మాట్లాడుతూ..సినిమా బండి విడుదలయ్యాక ముఖ చిత్రం ఆఫర్
నా దగ్గరకు వచ్చింది. సందీప్ కథ చెప్పినప్పుడు చాలా అద్భుతంగా
ఉందనిపించింది. సినిమా అంతకంటే బాగా రూపొందించారు. ఎస్ కేఎన్ కు సినిమా
మీద ధ్యాస. ఎప్పుడూ ముఖచిత్రం గురించే చర్చించేవారు. ప్రియ, చైతన్య నాకు
మంచి మిత్రులు అయ్యారు. టెక్నికల్ గా సినిమా సూపర్బ్ గా ఉంటుంది.
అన్నారు.
చైతన్య రావ్ మాట్లాడుతూ..ముఖచిత్రం బ్యూటిఫుల్ ఫిల్మ్. సందీప్ ఏమనుకుని ఈ
కథ రాశాడో గానీ సినిమా చూస్తే మీకు ఎంత అందంగా సినిమా ఉంటుంది అనేది
తెలుస్తుంది. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. అన్నారు.
ఆయేషా ఖాన్ మాట్లాడుతూ…తెలుగు ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం అవుతున్నాను.
ముఖచిత్రంలో మాయ అనే క్యారెక్టర్ లో నటించాను. ముఖ చిత్రం నాకు మంచి
కెరీర్ ఇస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.
ముఖచిత్రం దర్శకుడు గంగాధర్ మాట్లాడుతూ…టీజర్ లో మీరు చూసింది కొంతే.
ఇంతకు వంద రెట్లు సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నేను ఈ స్టేజీ మీద
ఉండేందుకు కారణమైన సందీప్ అన్నకు థాంక్స్. అన్నారు.
ప్రెజెంటర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ…ఇవాళ చిరంజీవి గారు ఇతర ఇండస్ట్రీ
పెద్దలు సీఎం జగన్ గారితో కలిసి టాలీవుడ్ సమస్యలకు పరిష్కారానికి
ముందుకొచ్చారు. ఇలాంటి మంచి రోజున మా ముఖ చిత్రం సినిమా టీజర్ విడుదల
చేయడం సంతోషంగా ఉంది. ఇవాళ్టి సమాజంలోని ఓ బలమైన అంశాన్ని ఎంచుకుని
సందీప్ రాజ్ కథ రాశాడు. రెండు షేడ్స్ లో ప్రియ వడ్లమాని అద్భుతంగా
నటించింది. ఇవాళ పాన్ ఇండియా లెవెల్లో డిజిటల్ వ్యూస్ లో పుష్ప, కలర్
ఫొటో సినిమాలు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి. అది మన టాలీవుడ్ కు గర్వకారణం.
ముఖచిత్రం డిఫరెంట్ మూవీ అవుతుంది. అన్నారు.
ముఖచిత్రం సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే…ఆపరేషన్ థియేటర్ నుంచి
బయటకొచ్చిన ఇద్దరు వైద్యులు సరదాగా మాట్లాడుకుంటుంటే టీజర్ మొదలైంది.
మహతి మాయ అనే ఇద్దరు బాల్య స్నేహితురాల్లు పరిచయం చేసుకోవడం, వాళ్లు
టీనేజ్ లోకి రావడం చూపించారు. అడిగినంత కట్నం ఇవ్వలేక వరుసగా పెళ్లి
చూపులకు హాజరయ్యే అమ్మాయిగా ప్రియ వడ్లమాని కనిపించింది. కట్నం ఆశించని
వికాస్ వశిష్ట ఆమెను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితం ప్రారంభిస్తాడు.
రోడ్డు ప్రమాదం జరిగి వాళ్ల జీవితాలు మారిపోవడం చూపించారు. చివరగా టైటిల్
సాంగ్ తో టీజర్ ఆసక్తికరంగా ముగిసింది. డైలాగ్స్ ఫన్నీగా ఉండి కొత్తదనం
తీసుకొచ్చాయి.
టీజర్ చూస్తే దర్శకుడు సందీప్ రాజ్ మరో ఇంట్రెస్టింగ్ కథను రాసినట్లు
తెలుస్తోంది. ఎస్ కేఎన్ ఈ చిత్రానికి ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు – వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్
సాంకేతిక నిపుణులు – సంగీతం – కాల భైరవ, ఎడిటింగ్ – పవన్ కళ్యాణ్, సమర్పణ
– ఎస్ కేఎన్, నిర్మాతలు – ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల, కథ స్క్రీన్ ప్లే
మాటలు – సందీప్ రాజ్, దర్శకత్వం – గంగాధర్