My marriage at Tirupathi –Janhvi
తిరుపతిలోనే నా పెళ్లిఃజాన్వి
ధడక్ చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన అందాల భామ జాన్వీ కపూర్. ఈ అమ్మడు ఐఏఎఫ్ విమానం నడిపిన తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవితమాధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. తన పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. కానీ పెళ్లి మాత్రం తిరుపతిలోనే చేసుకుంటానని శ్రీదేవి కుమార్తె జాన్వికపూర్ తెలిపింది. పెళ్లిలో హంగూ, ఆర్భాటాలు లాంటివి ఏమీ ఉండవు. కుటుంబ సభ్యుల ముందు అత్యంత ఆత్మీయుల ముందు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చాలా ఆహ్లాదకరంగా పెళ్లి జరుగుతుందని వెల్లడించింది. ప్రస్తుతం జాన్వీ గుంజన్ సక్సేనా ది కార్గిల్ గాళ్ పైలట్‌గా నిలిచింది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.
గత ఏడాది చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా , ఈ చిత్రాన్ని మార్చి 13,2020న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. శరన్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ తండ్రిగా పంకజ్ నటిస్తున్నారు. నటుడు అంగద్ బేడీ .. జాన్వీ కి సోదరుడిగా కనిపించనున్నారు. తాజాగా గుంజన్ సక్సెనా పాత్రలో నటిస్తున్న జాన్వీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో జాన్వీ లుక్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. గుంజన్ సక్సేనా.. ‘కార్గిల్ గర్ల్’ అనే టైటితో చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రం కోసం జాన్వీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో శిక్షణ తీసుకుంది. అయితే మహిళా పైలట్ గుంజన్ 1999 కార్గిల్ యుద్ధంలో గాయాలపాలైన సైనికులను తన విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించి అందరిచే ప్రశంసలు పొందింది. ఆమె ధైర్యానికి మెచ్చిన ప్రభుత్వం శౌర్యవీర్ అవార్డ్ కూడా అందించింది. ఈమె జీవిత నేపథ్యంలో మూవీ రావడం గర్వించదగ్గ విషయం.లేత బ్లూ రంగు లో ఐఏఎఫ్ అధికారుల యూనిఫామ్ ని ధరించి ఉన్న జాన్వీ చాలా స్పెషల్ గా కనిపిస్తోంది ఈ ఫోటోలో. ఇటీవలే గుంజన్ సక్సేనా ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేసినప్పుడు అద్భుత స్పందన వచ్చింది.