Naina Ganguly Spicy Pics

రామ్ గోపాల్ వర్మ బ్యూటిఫుల్ ట్రైలర్ కు విశేష స్పందన
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా). నైనా కథానాయికగా, సూరి కధానాయకుడిగా నటిస్తున్నారు. అగస్త్య మంజు దర్శకుడు. లోగడ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు రామ్ గోపాల్ వర్మతో పాటు అగస్త్య మంజు సహ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.రామ్ గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై నిర్మాణమవుతున్న చిత్రమిది. టి.అంజయ్య సమర్పణలో టి.నరేష్ కుమార్, టి.శ్రీధర్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ప్రేమ కధాంశంతో వైవిధ్య భరితంగా ఆకట్టుకోనున్న ఈ చిత్రం ట్రైలర్ ను బుధవారం విడుదల చేశారు. ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో వుంది. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా…సంగీతాన్ని రవి శంకర్ సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్య మంజు.