Namaste Nestama Movie Stills
Bollywood popular film-maker KC Bokadia needs no introduction. He is the one who has created a record by making 50 films in a very quick time introducing many star heroes, heroines to Bollywood. ‘Namaste Nestama’ is the latest film Produced and Directed by him while Lalit Modi, Gouthamchand Rathore are presenting it. KC Bokadia is debuting into Telugu with ‘Namaste Nestama’ which is being made as a part 2 for his previous blockbuster ‘Teri Meherbaniyan’. The casting of ‘Namaste Nestama’ involves Eshanya Maheshwari, Nazar, Brahmanandam, Shayaji Shinde, Taagubothu Ramesh, Chammak Chandra while Sri Ram guest appearance. two dogs are playing key roles in this movie. Bappilahari and Charan Arjun are composing the music. The film is getting ready to release soon, On this occasion,
Actor Brahmanandam says, ” KC Bokadia Garu produced and directed this film, ‘Namaste Nestama’ which is his first Telugu film. I did a very good role in this film. My Character will be entertaining as well as emotional in the film. This character has given me a lot of satisfaction. Bokadia Garu is a renowned producer. He has extracted the performances he needed from artists without any tension. He has made a superb film. Watch ‘Namaste Nestama’ film in theatres. Particularly I am very happy to say that my character in this film is very good. All the best to the entire team.”
Sri Ram (Guest Appearance), Eshanya Maheshwari, Nazar, Brahmanandam, Shayaji Shinde, Taagubothu Ramesh, Chammak Chandra, and Others will be seen as lead cast. Cinematography: Ajmal Khan, Music: Bappilahari, Charan Arjun, Editor: B Lenin, Fights: BJ Sridhar, Presented by: Lalit Modi& Gouthamchand Rathore, Co-Producer: SR Chaplat, Produced by BMB Music and Magnetics Limited, Written and Directed by : KC Bokadia
కె.సి. బొకాడియా చలనచిత్ర రంగంలో పరిచయం అవసరంలేని పేరు. ఎందరో స్టార్‌హీరోలను, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి, వేగంగా 50 సినిమాలు కంప్లిట్ చేసిన బాలీవుడ్ పాపులర్ ఫిలిం మేకర్. లేటెస్ట్గా లలిత్ మోడీ, గౌతమ్‌చంద్ రాథోర్ సమర్పణలో కె.సి.బొకాడియా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘నమస్తే నేస్తమా’. గతంలో ఆయన నిర్మాణంలో బ్లాక్బస్టర్హిట్ సాధించిన ‘తేరి మెహర్భానియా’ చిత్రానికి పార్ట్-2 వస్తోన్నఈమూవీ ద్వారా తెలుగు పరిశ్రమకి పరిచయమవుతున్నారు కె.సి.బొకాడియా. ఈషానియ మహేశ్వరి, నాజర్, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్, చమక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో యువ నటుడు శ్రీరామ్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నారు. ఈ చిత్రానికి బప్పిలహరి, చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రెండు కుక్కలు ముఖ్య పాత్రలు పోషించడం విశేషం. త్వరలో విడుదల కాబోతున్న సందర్భంగా …
నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ – ” కె సి బొకాడియా గారు నిర్మించి తొలి సారి తెలుగులో దర్శకత్వం వహించిన సినిమా నమస్తే నేస్తమా. ఈ సినిమాలో నేను హాస్యమే కాకుండా కొంచెం ఎమోషనల్ గా ఉండే క్యారెక్టర్ చేశాను. నాకు చాలా సంతృప్తిని ఇచ్చిన క్యారెక్టర్. బొకాడియా గారు నిర్మాతగా చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆయనతో సినిమా చేస్తున్నపుడు ఏ రకమైన టెన్షన్ లేకుండా ఎంతో హ్యాపీగా తనకు కావాల్సినటువంటి రీతిలో ఆర్టిస్టుల నుండి కావాల్సిన పెర్ఫామెన్స్ రాబట్టుకుని అద్భుతమైన సినిమా నిర్మించారు. నమస్తే నేస్తమా సినిమా థియేటర్ లో చూడండి. పర్టిక్యులర్‌గా నా క్యారెక్టర్ బాగుంటుందని మీకు చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్”అన్నారు
శ్రీరామ్(గెస్ట్ అప్పీయరెన్స్), ఈషానియ మహేశ్వరి, నాజర్, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్, చమక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అజ్మల్‌ఖాన్, సంగీతం: బప్పిలహరి, చరణ్ అర్జున్, ఎడిటర్: బి. లెనిన్, ఫైట్స్: బి.జె శ్రీధర్, సమర్పణ: లలిత్ మోడీ, గౌతమ్‌చంద్ రాథోర్, కో-ప్రొడ్యూసర్: ఎస్.ఆర్ చాప్లాట్, నిర్మాత: బి.ఎం.బి మ్యూజిక్ అండ్ మాగ్నెటిక్స్ లిమిటెడ్, రచన- దర్శకత్వం: కె.సి. బొకాడియా.