Namaste Nesthamaa pressmeet Photos
‘Namaste Nestama’ Which Is Inspired From ‘Teri Meherbaniyan’ Will Surely Become A Superhit – Popular Film-maker KC Bokadia
Bollywood popular film-maker KC Bokadia needs no introduction. He is the one who has created a record by making 50 films in a very quick time introducing many star heroes, heroines to Bollywood. ‘Namaste Nestama’ is the latest film Produced and Directed by him while Lalit Modi, Gouthamchand Rathore are presenting it. KC Bokadia is debuting into Telugu with ‘Namaste Nestama’ which is being made as a part 2 for his previous blockbuster ‘Teri Meherbaniyan’. The casting of ‘Namaste Nestama’ involves Eshanya Maheshwari, Nazar, Brahmanandam, Shayaji Shinde, Taagubothu Ramesh, Chammak Chandra while Sri Ram guest appearance. two dogs playing key roll inthis movie. Bappilahari and Charan Arjun are composing the music. On this occasion, the team held a press meet at Prasad Labs in Hyderabad. Popular film-maker KC Bokadia, Presenter Gouthamchand Rathore, Heroine Eshanya Maheshwari, Co-Producer SR Chaplat, Fight Master BJ Sridhar, Rakumar Bokadia, Actor Taagubothu Ramesh attended the event.
Fight Master BJ Sridhar says, ” I am very happy to work with Bokadia garu who has worked with many legendary fight masters. A dog performing action sequences in this film is quite different. Action scenes came out very well. This film will impress all sections of audiences.”
Film Presenter Gouthamchand Rathore says, ” This is a very big film. Our entire team has worked very hard for this film. This is the first Telugu film of Bokadia garu who has proved himself as a Producer, Director, Screenplay writer with 64 films. This film is Part -2 for ‘Teri Meherbaniyan’. We believe that ‘Namaste Nestama’ too will entertain you like its 1st part.”
Heroine Eshanya Maheshwari says, ” ‘Namaste Nestama’ is a beautiful project. Though this is a dog-centric film, it has all elements of drama, emotion, romance in it. Bokadia garu is a very talented film-maker. I am very lucky to act in his film who has introduced many star heroes and heroines.”
Popular Film-maker KC Bokadia says, ” I came from a small town in Rajasthan. My father hasn’t watched a single film. Hailing from such family, I came to Bombay and making ‘Riwaaz’ with Sanjeev Kumar in 1972 withstanding high competition is an unforgettable experience for me. ‘Pyar Jukhtha Nahin’ which came out in 1985 became a silver jubilee film in all languages it was released. Later in the same year, I launched ‘BMB Production’ after my father’s name BM Bokadia and made ‘Teri Meherbaniyan’ which became Super Duper Hit. This film was remade in almost all languages and became a big hit in them. After that, all the films from our banner became super hits. My directorial ‘Aaj Ka Arjun’ with Amitabh Bachchan became a huge hit. Later on, I worked with Amitabh garu for many films. I never worked for any Director. I took training for half an hour from the Tamil Director Manivannan and directed a film. Latha Mangeshkar garu supported me and sang many songs for the films I produced and directed in my banner. I worked for 5 films with Rajinikanth garu. I worked with more than 100 stars like Amitabh Bachchan, Rajinikanth, Akshay Kumar, Ajay Devgn, Sunny Deol, Shahrukh Khan, Salman Khan. I introduced Priyanka Chopra as a heroine. Media stands as the main reason behind all my achievements. I can’t be where I am today without media. ‘Namaste Nestama’ is my first Telugu film and I love this film. This film which is being made as a part – 2 for ‘Teri Meherbaniyan’ will surely become a Superhit. We made this film with two dogs. Well-known actor Sri Ram did an important role in this film. Brahmanandam, Nazar, Shayaji Shinde, Taagubothu Ramesh, and others will be seen in other important roles. This film’s success will pave way for me to make more films in Telugu. Thanks to BA Raju garu who is supporting me in promoting this film.”
Actor Taagubothu Ramesh says, ” Brahmanandam garu did the role of a dog trainer in this film. I will be seen as his assistant. Mine is a very good character in the film. Bokadaia garu has worked with many Stars. His experience is evident during the shoot of the film. He plans every scene so perfectly. I am very lucky to work in his direction.”
Sri Ram, Eshanya Maheshwari, Nazar, Brahmanandam, Shayaji Shinde, Taagubothu Ramesh, Chammak Chandra, and Others will be seen as lead cast. Cinematography: Ajmal Khan, Music: Bappilahari, Charan Arjun, Editor: B Lenin, Fights: BJ Sridhar, Presented by: Lalit Modi& Gouthamchand Rathore, Co-Producer: SR Chaplat, Produced by BMB Music and Magnetics Limited, Written and Directed by : KC Bokadia
‘తేరి మెహర్భానియా` ఇన్స్పిరేషన్ తో వస్తోన్న ‘నమస్తే నేస్తమా’ తప్పకుండా సూపర్‌హిట్ అవుతుంది – పాపులర్ ఫిలింమేకర్ కె.సి.బొకాడియా.
కె.సి. బొకాడియా చలనచిత్ర రంగంలో పరిచయం అవసరంలేని పేరు. ఎందరో స్టార్‌హీరోలను, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి, ఫాస్ట్‌గా 50 సినిమాలు కంప్లిట్ చేసిన ఫిలిం మేకర్‌గా రికార్డ్ సాధించిన బాలీవుడ్ పాపులర్ ఫిలిం మేకర్. లేటెస్ట్గా లలిత్ మోడీ, గౌతమ్‌చంద్ రాథోర్ సమర్పణలో కె.సి.బొకాడియా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘నమస్తే నేస్తమా’. గతంలో ఆయన నిర్మాణంలో బ్లాక్బస్టర్హిట్ సాధించిన ‘తేరి మెహర్భానియా’ చిత్రానికి పార్ట్-2 వస్తోన్నఈమూవీ ద్వారా తెలుగు పరిశ్రమకి పరిచయమవుతున్నారు కె.సి.బొకాడియా. ఈషానియ మహేశ్వరి, నాజర్, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్, చమక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో యువ నటుడు శ్రీరామ్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నారు. రెండు కుక్కలు ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి బప్పిలహరి, చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాపులర్ ఫిలిం మేకర్ కె.సి.బొకాడియా, చిత్ర సమర్పకులు గౌతమ్‌చంద్ రాథోర్, హీరోయిన్ ఈషానియ మహేశ్వరి, కో- ప్రొడ్యూసర్ ఎస్.ఆర్ చాప్లాట్, ఫైట్ మాస్టర్ బి.జె శ్రీధర్, రాజ్ కుమార్ బొకాడియా, నటుడు తాగుబోతు రమేష్ పాల్గొన్నారు..
ఫైట్ మాస్టర్ బి.జె.శ్రీధర్ మాట్లాడుతూ – ”ఎంతో మంది లెజెండరీ ఫైట్ మాస్టర్స్‌తో వర్క్ చేసిన బొకాడియా గారితో పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఒక డాగ్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం కొత్త విషయం. యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా బాగా వచ్చాయి. అన్నివర్గాల వారికి ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది” అన్నారు.
చిత్ర సమర్పకులు గౌతమ్ చంద్ రాథోర్ మాట్లాడుతూ – ”చాలా పెద్ద సినిమా..మా టీమ్ అందరం ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాము. 64 సినిమాలతో నిర్మాతగా, దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్‌గా తనని తాను ప్రూవ్ చేసుకున్న బొకాడియా గారు తెలుగులో తీస్తున్న మొదటి సినిమా. ‘తేరి మెహర్భానియా’ సినిమాకి పార్ట్-2 . ఆ చిత్రంలాగే ‘నమస్తే నేస్తమా’ చిత్రం కూడా మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాము” అన్నారు.
హీరోయిన్ హీరోయిన్ ఈషానియ మహేశ్వరి మాట్లాడుతూ – ”నమస్తే నేస్తమా’ ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఇది ఒక డాగ్ సెంట్రిక్ మూవీ అయినప్పటికీ ఈ సినిమాలో డ్రామా, ఎమోషన్, రొమాన్స్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. బొకాడియా గారు వెరీ టాలెంటెడ్ ఫిలిం మేకర్. ఎంతో మంది స్టార్ హీరోలను, హీరోయిన్లను ఇంట్రడ్యూస్ చేసిన బొకాడియా గారి సినిమాలో నటించడం నిజంగా నా అదృష్టం” అన్నారు.
పాపులర్ ఫిలిం మేకర్ కె.సి. బొకాడియా మాట్లాడుతూ – ”మాది రాజస్థాన్ లోని చిన్న గ్రామం, మా నాన్న గారు ఒక్కసినిమా కూడా చూడలేదు. అలాంటి ఒక ఫ్యామిలీ నుండి వచ్చి బొంబాయిలో ఉన్న హైకాంపిటేషన్‌ని తట్టుకొని 1972లో సంజీవ్ కుమార్‌తో ‘రివాజ్’ సినిమాను నిర్మించడం నేను ఎప్పటికి మర్చిపోలేను. ఆతరువాత 1985లో ‘ప్యార్ జుక్తా నహి’ విడుదలైన అన్ని భాషలలో సిల్వర్ జూబ్లీ చేసుకుంది. ఆ తర్వాత అదే సంవత్సరంలో మానాన్నగారు బి.ఎం. బొకాడియా పేరుమీద ‘బి.ఎం.బి’ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నిర్మించిన ‘తేరి మెహర్భానియా’ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా కూడా దాదాపు అన్ని భాషలలో రీమేక్ అయింది. ఈ తరువాత మా ప్రొడక్షన్లో వచ్చిన సినిమాలు అన్ని సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. ఆ తరువాత నా డైరెక్షన్లో అమితాబ్ హీరోగా ‘ఆజ్ కాఅర్జున్’ సినిమా వచ్చి గొప్ప విజయం సాధించింది. తరువాత అమితాబ్ గారితో చాలా సినిమాలకు వర్క్ చేయడం జరిగింది. ఏ డైరెక్టర్ దగ్గర వర్క్ చేయడకుండానే మద్రాస్ డైరెక్టర్ మణివన్నన్ గారి దగ్గర అరగంట ట్రైనింగ్ తీసుకొని దర్శకత్వం వహించాను. ఆ తరువాత లతామంగేష్కర్ గారు నాకు చాలా సపోర్ట్ చేసి నా నిర్మాణంలో, దర్శకత్వంలో చాలా పాటలు పాడడం జరిగింది. నేను రజినీకాంత్ గారితో 5 సినిమాలకు వర్క్ చేయడం జరిగింది. అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, అక్షయ్‌కుమార్, అజయ్‌దేవగన్, సన్నీదేవన్, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ అలా 100కు పైగా పెద్దపెద్ద స్టార్స్‌తో వర్క్ చేయడం జరిగింది. ప్రియాంక చోప్రాని హీరోయిన్గా పరిచయం చేసింది నేనే. దీనంతటికి మీ మీడియా వారి ప్రోత్సాహమే కారణం. మీరు లేకుంటే నేను లేను. ‘నమస్తే నేస్తమా’ నా ఫస్ట్ తెలుగు మూవీ. అలాగే నాకు చాలా ఇష్టమైన మూవీ. ‘తేరి మెహర్భానియా’ ఇన్స్పిరేషన్తో తీసిన ఈ మూవీ తప్పకుండా సూపర్ అవుతుంది అనుకుంటున్నాను. రెండు డాగ్స్‌తో ఈ సినిమా తీయడం జరిగింది. మీ అందరికీ సుపరిచితుడు అయిన శ్రీరామ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అలాగే బ్రహ్మనందం, నాజర్, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్, తదితరులు నటించారు. ఈ సినిమా విజయంనాకు తెలుగులో మరిన్ని సినిమాలు నిర్మించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్‌లో నాకు ఎంతో సహకరిస్తున్న బి.ఎ.రాజు గారికి ధన్యవాదాలు” అన్నారు.
నటుడు తాగుబోతు రమేష్ మాట్లాడుతూ – ‘ఈ సినిమాలో బ్రహ్మనందం గారు పోలీస్ డాగ్ ట్రైనర్ ఆయనకి అసిస్టెంట్‌గా నటించాను. చాలా మంచి క్యారెక్టర్. బొకాడియా గారు ఎంతో మంది స్టార్స్‌తో వర్క్ చేశారు. ఆయన ఎక్స్పీరియన్స్ షూటింగ్లో తెలుస్తుండేది. ప్రతి సీన్ పర్ఫెక్ట్గా వచ్చేలా ప్లాన్ చేసే వారు. ఆయన దర్శకత్వంలో వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు.
శ్రీరామ్, ఈషానియ మహేశ్వరి, నాజర్, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్, చమక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అజ్మల్‌ఖాన్, సంగీతం: బప్పిలహరి, చరణ్ అర్జున్, ఎడిటర్: బి. లెనిన్, ఫైట్స్: బి.జె శ్రీధర్, సమర్పణ: లలిత్ మోడీ, గౌతమ్‌చంద్ రాథోర్, కో-ప్రొడ్యూసర్: ఎస్.ఆర్ చాప్లాట్, నిర్మాత: బి.ఎం.బి మ్యూజిక్ అండ్ మాగ్నెటిక్స్ లిమిటెడ్, రచన- దర్శకత్వం: కె.సి. బొకాడియా.