Nandamuri Balakrishna released the title poster of Love Reddy

లవ్ రెడ్డి టైటిల్ పోస్టర్ ను విడుదల చేసిన నందమూరి బాలకృష్ణ !!!
ఎమ్జీఆర్ ఫిలిమ్స్, గీతన్స్ ప్రొడక్షన్స్, శహరి స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లవ్ రెడ్డి. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆంధ్ర కర్ణాటక బాడర్ లో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో స్మరన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. హేమలత రెడ్డి,
మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… యంగ్ టీమ్ అందరూ కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషన్ తెలిపారు.
కర్ణాటక లోని బాగేపల్లి ప్రాంతంలో మరియు బెంగళూరు లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. త్వరలో ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేయబోతున్నారు.
హీరో: అంజన్ రామచంద్ర
హీరోయిన్: శ్రావణి రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: స్మరన్ రెడ్డి
నిర్మాతలు:హేమలత రెడ్డి,
మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప
సంగీతం: ప్రిన్స్ హేన్రి
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
సహా నిర్మాతలు: నవీన్ రెడ్డి, సుమలత రెడ్డి, సుస్మిత రెడ్డి, హరీష్.ఏ