Nani Latest Photos
*The significance of 5th September: the much-awaited Nani and Sudheer Babu-starrer ‘V’, also Nani’s 25th film and much more!*
*Nani talks about the significance of 5th September, the day ‘V’ is releasing*
The much awaited Nani and Sudheer Babu starrer V holds a lot more relevance than just talented minds coming together. The release date 5th September is what binds it all together. V is Nani’s 25th film of his career and also, is his third collaboration with the director Mohana Krishna Indraganti. Nani’s debut film Ashta Chamma was also directed by Mohana and now after 12 years, the actor-director are collaborating with V.
Talking about his journey of 12 years, Nani shares, “I always wanted to be a good actor and entertain the audience. It has been 12 years since ‘Ashta Chamma’ arrived at theatres. I am glad that ‘V’ gave me an opportunity to work with some wonderful people”.
Nani added, “I feel immensely blessed that the Telugu audience have always seen me as one of their own. With each film, my responsibility goes up. I will continue to bring to the audience good films that entertain them. I thank each and everyone who has made ‘V’ possible. I thank the audience and media for always showering love on me.” Interestingly, like ‘Ashta Chamma’, ‘V’, too, is directed by Mohanakrishna Indraganti.
Director Mohana Krishna Indraganti shares on his association with Nani, “From a guy who came into my office very differently wearing dark glasses because he had some eye infection to what Nani is now, it has been a fantabulous journey for him. I take some of the credit for launching talent – I’ll say, I’ve introduced a lot of good talents along with Nani. But what this man achieved after I introduced him much of the credit goes to him.”
He adds, “He worked very hard, he took risks, one of the things about Nani is he never hesitated to take risks – he did unusual films that probably went against convention, he took chances, he fell down, he rose up, that’s been his quality which I admired since day one. Our relationship hasn’t changed much, we’ve been the same. We did a film in 2016, Gentleman which was a big hit – he’s matured as an actor he’s learnt a lot and one thing is that he can adapt his style to different genres and roles – that adaptability is a unique feature and that’s a sheer inborn talent. That isn’t something you cannot teach a particular individual, and that’s what is taking him into places.”
“This 25th film –V, is a mainstream entertainer which promises a-thrill-a-minute. It is not very easy in Telugu which is highly commercialized as an industry. To be able to choose films that are against conventional choices that are off-beat and still succeed and make a niche for yourself is a major achievement! That makes me feel very proud as someone who helped launch him but then he shone on his own and he continues to shine”, shares Director Mohana on the collaboration.
Directed and written by Mohana Krishna Indraganti, the film stars ‘Natural Star’ Nani and Sudheer Babu in the lead, along with Nivetha Thomas and Aditi Rao Hydari essaying pivotal roles. The much-awaited Telugu action thriller and the first star-studded Telugu film V will be streaming on Amazon Prime Video starting September 5, 2020.
మొదటి సినిమా చేసిన దర్శకుడితోనే 25వ సినిమాగా ‘వి’ చేయడం యాదృచ్చికం : నాని
అష్టాచమ్మాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన నాని.. పుష్కర కాలంలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ హీరోగా నేచురల్ స్టార్ అనే ఇమేజ్ను దక్కించుకున్నారు. అష్టాచమ్మా చిత్రంతో నానిని హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి.. జెంటిల్మన్ అనే సూపర్‌హిట్ సినిమాను కూడా నానితో డైరెక్ట్ చేశారు. ఇప్పుడు నాని 25వ సినిమాగా రూపొందుతున్న చిత్రం ‘వి’ను ఆయనే డైరెక్ట్ చేశారు. ఇప్పటి వరకు నాని చేసిన చిత్రాలకు భిన్నమైన నెగటివ్ షేడ్ ఉన్నపాత్రలో నాని ప్రేక్షకులను ఈసారి మెప్పించనున్నారు. ‘వి’ సినిమా సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నానితో ఇంటర్వ్యూ…
* సినిమాలో నేను విలనా? హీరోనా? అని సినిమా చూసి మీరే చెప్పండి.. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చాలా కొత్తగా ఉన్నాయి. ఒకప్పటిలా లేవు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులను రీచ్ కావడానికి ఇదొక్కటే దారి. చాలా రోజులుగా సినీ ప్రేక్షకులు ఓ మంచి సినిమాను చూస్తామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు ‘వి’ సినిమాతో ప్రేక్షకులను రీచ్ కావడం కూడా అదృష్టమే. ట్రైలర్‌ను చూసినప్పటి నుండి అందరిలో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అందరూ సినిమాలో థియేటర్లోనే చూడాలని అనుకుని ఉంటారు. కానీ.. పరిస్థితులు ప్రభావంతో ఓటీటీయే ప్రేక్షకులను రీచ్ కావడానికి మంచి మార్గం. ఇలాంటి ఓ ఎక్స్‌పీరియెన్స్ కూడా కొత్తగానే ఉంది.
* మొదటి సినిమా(అష్టాచమ్మా) చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణగారితోనే 25వ సినిమాగా ‘వి’ను చేయడం యాదృచ్చికమనే చెప్పాలి. ఆయనతోనే 25వ సినిమా చేయాలని అనుకోలేదు. ఆ సమయంలో ఆయన నన్ను కలిసి కథ చెప్పడం నాకు నచ్చడంతో సినిమా చేయడానికి ఓకే చెప్పాను. ఫ్యాన్స్, ఫ్రెండ్స్ ఇది నా 25వ సినిమా అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ.. నేను సెలబ్రేట్ చేసుకోవడం లేదు. ఎందుకంటే.. ప్రతి సినిమా నాకు ఇంపార్టెంటే.
* నా తొలి సినిమా సమయంలో నీ 25వ సినిమా అప్పుడు ఇలా ఉంటావని ఎవరైనా చెప్పి ఉండుంటే నేను నమ్మేవాడిని కాను. జోక్ చేస్తున్నారని అనుకునేవాడిని. ఇంత కెరీర్, ప్రేమ, ఆప్యాయత దొరుతుందని చెప్పి ఉంటే గ్యారంటీగా నమ్మి ఉండేవాడిని కాను. ప్రతి ఆర్టిస్ట్ సినిమాల్లో కష్టపడతారు. కానీ.. ప్రేక్షకులు ఓన్ చేసుకోవడం కూడా అదృష్టమనే చెప్పాలి. ముందు ముందు కూడా మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే అంతకంటే ఏమీ లేదు అని భావిస్తున్నాను.
* అష్టాచమ్మా, జెంటిల్మన్.. ఇప్పుడు ‘వి’.. ఈ మూడు సినిమాల సమయంలో మా ఇద్దరి మధ్య ఎలాంటి మార్పూ లేదు. అప్పుడెలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. వర్క్ పరంగా ఇద్దరిలో మార్పు అయితే ఉంది. అష్టాచమ్మా రెండు ఫ్రేములు చూసి.. ‘వి’ సినిమా రెండు ఫ్రేములు చూస్తే ఇద్దరం ఒకటేనా అనిపిస్తుంది. కలిసి పెరిగిన క్లాస్‌మేట్స్‌లా అనిపిస్తుంది. ఈ 12 ఏళ్ల ప్రయాణంలో ఎప్పుడు కలుసుకున్నా.. నిన్ననే కలిసి మాట్లాడుకున్నట్లు మాట్లాడుకుంటాం. టేకింగ్ పరంగా ఓ డైరెక్టర్‌గా ఆయనలో చాలా మార్పు వచ్చింది. రేపు సినిమా చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది. ‘వి’ లాంటి సినిమాను ఆయన్నుండి మనం ఎక్స్పెక్ట్ చేయలేం.
* సెప్టెంబర్ 5నే అష్టాచమ్మా విడుదలైంది. అదే రోజున ‘వి’ సినిమా కూడా విడుదల కావడం అనేది మేం ముందుగా అనుకోలేదు. అమెజాన్ ప్రైమ్ వాళ్లు రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకున్నారు.
* నెగటివ్ షేడ్‌లో నేచురల్‌గా ఉండటానికి నేను పడ్డ కష్టమేమీ లేదు. స్క్రిప్ట్ విన్నప్పుడు ఏదైతే అనిపించిందో.. కథ విన్నప్పుడు మన మైండ్‌లో ఓ ఇమేజ్ క్రియేట్ అవుతుందిగా దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్లాను. ఎక్స్ట్రాగా నేనేమీ కష్టపడలేదు. రెగ్యులర్‌గా చేసే సినిమాలకన్నా.. ఈ సినిమాను చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాను.
* ముందుగా మార్చి 25న విడుదల అనుకున్నాం. చాలా ఎగ్జయిట్‌గా వెయిట్ చేస్తున్న తరుణంలో మార్చి 22న లాక్డౌన్ అనౌన్స్ చేశారు. వారం అనుకున్నాం. నెల అనుకున్నాం.. రెండు నెలలు అనుకున్నాం.. కానీ కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పుడు బాగా డిసప్పాయింట్ అయ్యాను. నాలుగు నెలలు అయిన తర్వాత ప్రేక్షకులకు సినిమాను ఎప్పుడెప్పుడు చూపిస్తామా? అనే ఎగ్జయిట్మెంట్ పెరిగిపోయింది. ఎందుకంటే సినిమాను నేను చూశాను. సినిమా బాగా ఉంది. దాంతో ఎగ్జయిట్మెంట్ రోజురోజుకీ పెరుగుతూ వచ్చింది. అలాంటి సమయంలో ఓటీటీలో విడుదల చేయాలనుకున్నాం. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాకున్న బజ్ చూస్తుంటే సరైన టైమ్‌లో సరైన నిర్ణయం తీసుకున్నామనిపించింది. మేం అనౌన్స్ చేసిన తర్వాత మరికొంత మంది మా రూట్లో వస్తున్నారు. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను.
* ఇలాంటి డిఫరెంట్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయడం వల్ల నా ఫ్యాన్ బేస్ పెరుగుతుందే కానీ.. తగ్గుతుందని అనుకోవడం లేదు. ప్రేక్షకులు చాలా మారారు.
* భవిష్యత్తులోనూ ఇలాంటి నెగటివ్ షేడ్ పాత్రలతో వచ్చి స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండా చేస్తాను.
* సుధీర్ తన పాత్రను అద్భుతంగా చేశాడు. తన పాత్రను నేను లొకేషన్లో లేనప్పుడే ఎక్కువ భాగం షూట్ చేశారు. ఏం జరుగుతుందో తెలియదు. ఎడిటింగ్ సమయంలో నేను సినిమా చూశాను. మోహన్‌గారు నాతో ఏం చెప్పారో అంత కంటే రెండు, మూడు రెట్లు సుధీర్ పాత్ర బావుంది. సుధీర్ ఈ పాత్ర కోసం పెట్టిన ఎఫర్ట్ గురించి ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. నేనైనా, సుధీర్ అయినా రెగ్యులర్ ప్యాట్రన్‌లో కాకుండా డిఫరెంట్ స్టోరిలో ఇలా డిఫరెంట్ పాత్రల్లో నటించడం.. దాని కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడటం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
* ‘వి’ సినిమాలో సుధీర్, నా పాత్ర చాలా గ్రిప్పింగ్‌గా సాగుతాయి. లైఫ్ సాఫీగా సాగిపోతున్న సెలబ్రిటీ పోలీస్ లైఫ్‌లోకి ఓ విలన్ వచ్చి ఛాలెంజ్ విసురుతాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ లైఫ్ ఎలా టర్న్ అవుతుందనేదే సినిమా. ప్రేక్షకులు పాత్రలకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు.
* ఈ లాక్‌డౌన్‌ను జున్నుతో బాగా ఎంజాయ్ చేస్తున్నాను. టక్‌జగదీష్ కోసం ఇరవై రోజులు రాజమండ్రిలో షూటింగ్ చేసినప్పుడు తనకు దూరంగా ఉంటే చిన్న బెంగ స్టార్ట్ అయ్యింది. అదే సమయంలోనే పాండమిక్ వచ్చింది. నాకోసమే వచ్చిందా? అనిపిస్తుంది. తనతో అంత బాగా టైమ్ స్పెండ్ చేస్తున్నాను.
* దిల్‌రాజుగారు నిర్మాతే కాదు.. డిస్ట్రిబ్యూటర్, బయ్యర్ ఇలా చాలా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో తన సినిమాను ఓటీటీ విడుదల చేయాలనే నిర్ణయం తీసుకుంటున్నప్పుడు చాలా మందికి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అలాంటి ఆయన నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయాన్ని నేను గౌరవిస్తే చాలు.. నేను పెద్దగా గౌరవించాల్సిన అవసరం లేదు.
* సినిమా బడ్జెట్ అనేది ఓవరాల్‌గా ఇంత అవుతుందని ముందే చెప్పలేం. ఓ అంచనాతో ప్రారంభిస్తాం. అయితే ఇంత బిజినెస్ కావడం లేదు.. ఇంతే అవుతుంది అని అనిపించినప్పుడు తగ్గించాలంతే.. సినిమా సినిమాకు ఆ లెక్క మారిపోతుంది. మనందరి బాధ్యత ఏంటంటే.. ఎవరూ నష్టపోకూడదని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా నిర్మాత ఇబ్బంది పడకూడదు. అందుకని జనరల్‌గా ఓ స్టేట్మెంట్ ఇచ్చేస్తే సరిపోదుగా.. పరిస్థితులను బట్టి మనం నిర్మాతలకు సపోర్ట్ చేయాలి. అందరికీ ఆ బాధ్యత ఉండాలి.
* బాలీవుడ్లో సినిమా చేయాలనే కోరిక లేదు. నేను తెలుగువాడ్ని. ఇక్కడే సినిమాలు చేయాలనే అనుకుంటున్నాను.
* ప్యాన్ ఇండియా సినిమా చేయాలనే స్ట్రాటజీ ఏం వేసుకోలేదు. అయితే సినిమా చేయాలనిపిస్తే అప్పుడు ఆలోచిస్తాను.
* టక్ జగదీష్ 50 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. అక్టోబర్ నుండి ఈ సినిమా మిగిలిన షూటింగ్‌ను చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా పూర్తయిన తర్వాతే శ్యామ్‌సింగరాయ్ స్టార్ట్ చేస్తాం. లాక్డౌన్ ముందే నేను 2020 ఎండ్ వరకు బిజీగా ఉన్నాను.. లాక్డౌన్ వల్ల అన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. దీంతో ఈ సినిమాలన్నీ 2021…2022 వరకు వెళ్లాయి.
* లాక్డౌన్ సమయంలో రెండు సినిమాలు ఓకే చేశాను. అందులో ఒకటి డెబ్యూ డైరెక్టర్ మరొకటి ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్‌తో చేయబోతున్నాను.
* రాబోయే రోజుల్లో షూటింగ్స్, లొకేషన్స్ ఎలా ఉంటాయనే దానిపై ఎవరికీ అవగాహన లేదు. కరోనా వ్యాక్సిన్ రాలేదు. పని లేకుండా చాలా రోజులు ఇంట్లోనే వెయిట్ చేశాం. చాలా మందికి మనం సాయం చేశాం కానీ.. అది శాశ్వత పరిష్కారం కాదు.. పని ఒక్కటే దారి. ఇండస్ట్రీ దీనిపై ఓ నిర్ణయం తీసుకోకపోతే పనులు ముందుకు కదలవు. అందరూ చాలా జాగ్రత్తలు తీసుకుని వర్క్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.