Naresh Vijayakrishna interview
ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం
సీనియర్ నటులు నరేష్ నటించిన “రఘుపతి వెంకయ్య నాయడు” చిత్రం ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది, ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.
తెలుగు సినీపరిశ్రమ చెన్నయ్ లో పుట్టి ఇక్కడికి తరలి వచ్చింది తెలుగు సినిమా ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళింది,
తెలుగు సినీ పరిశ్రమకి ఆద్యుడు, ఆదిమూలం, తెలుగు సినిమా పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు.
మచిలీపట్నంలో జన్మించి చెన్నయ్ కి తరలి వచ్చి తిరుగులేని ఫోటోగ్రఫర్ గా పేరు తెచ్చుకుని కేవలం ప్రొడ్యూసర్ గానే కాకుండా సినీ ప్రేమికుడిగా మొదలై సౌండ్,విజువల్ ను సింక్ చేసే క్రోనో మెగాఫోన్ ను తన ఆస్తి ని తాకట్టు పెట్టి తీసుకొచ్చి సినిమాని ప్రపంచమంతా తీసుకెళ్లడమే కాకుండా,మద్రాస్ లో గెయిటి థియేటర్ స్థాపించి మూకీ సినిమాని తెలుగు సినిమా గా మార్చారు.
మా అమ్మకు వచ్చిన రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డ్ చూసి ఆయన గురించి గూగుల్ లో తెలుసుకుని వెంటనే దర్శకుడు బాబ్జి కి ఫోన్ చేసి ఈ ఐడియా చెప్పగానే ఆయన ఒకే చెప్పడం వెంటనే సతీష్ బండవ నిర్మించడానికి ముందుకు వచ్చాడని అతని కెరియర్ ప్రొడ్యూసర్ గా ఈ సినిమా నుంచి మొదలవుతుంది అని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
దాసరి నారాయణ రావు గారు ఈ సినిమాని ఏంతో ప్రేమించారు ఈ సినిమా చూసి వెంటనే ఆయన హత్తుకుని ఏడ్చారని,ఈ సినిమా ఆయన చేతులు మీదగా ఎప్పుడో రిలీజ్ అవ్వాలని దురదృష్టవశాత్తు ఆయన దూరంకావడం బాధకలిగింది అని చెప్పుకొచ్చారు,
ఈ బయోపిక్ నాకు రావడం నా జన్మధన్యం,
ఒక రకంగా నేను రఘుపతి వెంకయ్య నాయుడు కి ముని మనవన్ను అవుతానని,మహేష్ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసినందుకు ఆయనకు థాంక్స్ చెప్తూ, రాఘవేంద్రరావు గారు పోస్టర్ రిలీజ్ చేసినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సినిమా విషయంలో తాను శారీరకంగా తగ్గానని, అన్ని చాలా దగ్గరగా ఉండేటట్లు జాగ్రత్త పడ్డాడని,
పాత్ర విషయంలో ఒరిజినాలిటీ కనిపిస్తోంది అని చెప్పారు.
బయోపిక్ లు చాలా వచ్చాయి కానీ ఈ సినిమా తెలుగు సినిమాలలో ఒక గ్రంథగా మిగిలిపోతుందని,ఇతర సినిమా ఫెస్టివల్స్ కు కూడా ఈ సినిమాని పంపించే ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు.!
ప్రస్తుతానికి ఆయన కెరియర్ చాలా బాగుందని,గత ఏడాది హిట్ అయిన 7 సినిమాలలో ఆయన 6 సినిమాలలో ఉన్నానని చెప్పారు,
ఒక 13 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి,
త్రివిక్రమ్, సుకుమార్ తో పాటు యంగ్ డైరెక్టర్స్ తనకు మంచి అవకాశాలు ఇస్తున్నారని,నాకు డబ్బు కంటే సినిమా ముఖ్యం అని చెబుతూ యంగ్ డైరెక్టర్స్ మంచి కేరెక్టర్ తో వస్తే లక్ష రూపాయలకు కూడా చేస్తానని,ఇప్పటికే వెబ్ సిరీస్,షార్ట్స్ ఫిలిమ్స్ కూడా చేస్తానని చెప్పుకొచ్చారు.
మా అధ్యక్షత పదవిలో మంచి సేవలు అందిచానని,తాను అందరిని కలుపుకుంటూ పోతానని,రాజీకియాలు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు.