New movie launches as Vishwanth Hero under the banner of Ashta Cine Creations
అష్ట సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై విశ్వాంత్ హీరోగా నూతన చిత్రం ప్రారంభం..
అష్ట సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై విశ్వాంత్, గోపిక ఉదయన్ జంటగా కులదీప్ కుమార్ రజన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సినిమాను సిరి సమర్పిస్తుండగా.. దేవు సత్యనారాయణ, ప్రతాప్ రెడ్డి అధురి, షేక్ రహీమ్ నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రవిమణి కే నాయుడు సినిమాటోగ్రఫర్. శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఆదిత్య భార్గవ్ ఈ సినిమాకు రైటర్. కులదీప్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లేతో పాటు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
నటీనటులు:
విశ్వాంత్, గోపిక ఉదయన్
టెక్నికల్ టీమ్:
బ్యానర్: అష్ట సినీ క్రియేషన్స్
సమర్పణ: సిరి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కులదీప్ కుమార్ రజన
నిర్మాతలు: దేవు సత్యనారాయణ, ప్రతాప్ రెడ్డి అధురి, షేక్ రహీమ్
సంగీతం: RR ధృవన్
DOP: రవిమణి కే నాయుడు
ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ R
రైటర్: ఆదిత్య భార్గవ్
ప్రొడక్షన్ ఎగ్జిగ్యూటివ్: PMN రవితేజ
PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్