Nikhil Siddharth Interview Photos
సంతోష్ ఒక రాక్షస డైరెక్టర్ – హీరో నిఖిల్
నిఖిల్ సిద్ధార్థ్ అండ్ లావణ్య త్రిపాఠీ జంటగా నటిస్తున్న చిత్రం అర్జున్ సురవరం రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ సందర్భంగా హీరో నిఖిల్ మీడియాతో ముచ్చటించారు.
మే 1st న రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పటివరకు డీలే అయింది,
ఈ సినిమాకి పేరు మార్చిన తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి.
ఫైనల్ గా ఇప్పుడు రిలీజ్ అవుతోంది.
ఈ మూవీ రిలీజ్ డీలే లో మీరెంటువంటి సాయం చేశారు.?
నేను రెమ్యూనరేషన్ డిమాండ్ చేయలేదు,ఎంత ఇస్తే అంత తీసుకున్న ఏ సినిమాకి ఇప్పటివరకు నేను అలా చేయలేదు.
ఇప్పటివరకు నేను మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేయలేదు ఇది 1st టైం.!
ఇప్పుడు కార్తికేయ-2 సినిమా చేస్తున్న,
గీత ఆర్ట్స్ లో ఒక సినిమా చేస్తున్న డైరెక్టర్ వి.ఐ ఆనంద్ తో,
హనుమాన్ అనే ఒక సినిమా చేస్తున్నాను.
మీకు ఇప్పటివరకు హిట్స్ అని స్ట్రెయిట్ ఫిలిమ్స్ వలన వచ్చాయి,
ఇప్పుడు మళ్లీ రీమేక్.?
రీమేక్ లో 2 రకాలు ఉంటాయి,
ఒకటి కేరెక్టర్ పరంగా ఉంటాయి,
ఇంకోటి ప్లాట్ పరంగా ఉంటాయి,
ఈ సినిమా ప్లాట్ అలాంటిది.
దృశ్యం,పోకిరి లాంటి సినిమాలు ఎక్కడ రీమేక్ చేసిన ఆడుతాయి,
కొన్ని సినిమాలు ఎక్కడ రీమేక్ చేసిన ఆడవు, హ్యాపీ డేస్,బెంగుళూర్ డేస్ ఎక్కడ రీమేక్ ఆడవు అలా అన్నమాట.
కార్తికేయ తర్వాత ఏ సినిమా చేస్తారు.?
ఇంకా డిస్కషన్ లో ఉంది సర్,ఈ డిసెంబర్ నుండి కార్తికేయ స్టార్ట్ అవుతోంది.
డైరెక్టర్ సంతోష్ గురించి చెప్పండి.?
సంతోష్ ఒక రాక్షస డైరెక్టర్ సర్ (నవ్వుతూ) తనకు కావాల్సింది వచ్చినంతవరకు ఆర్టిస్ట్ లతో పెరఫార్మన్స్ చేపిస్తారు,
వాళ్ళ నాన్నగారు జర్నలిస్ట్ కావడంతో ఈ సినిమా ఆయనకు ఇంకా దగ్గరగా ఉంటుంది.
నా పెరఫార్మన్స్ ఏ మాత్రం బాగున్నా ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ దే.
చీరంజీవి గారి ముందు పెరఫార్మన్స్ చేయడం ఎలా అనిపించింది.?
ఒకప్పుడు స్కూల్ కాంపిటేషన్ లో
ఆయన ముందు పెర్ఫార్మన్స్ చేయాలి అప్పుడు కుదర్లేదు చాలా బాధపడ్డను
ఇప్పుడు చేయడం చాలా హ్యాపీ అనిపించింది.ఈ సినిమా ఫంక్షన్ కి ఆయన రావడం వలన పెద్ద బజ్ వచ్చింది.
హీరోహిన్ లావణ్య త్రిపాఠి గురించి.?
అందాల రాక్షసి తర్వాత ఆమెకు ఈ సినిమాలో బెస్ట్ రోల్ అండి ఈ సినిమాలో ఆమె స్టంట్స్ కూడా చేసారు.
అందుకే పబ్లిసిటీ లో కూడా ఎక్కువ పాల్గొంటున్నారు.
మళ్ళీ రీమిక్ సినిమాలు ఏమైనా చేస్తారా.?
లేదు అండి ఇదే నా లాస్ట్ రీమేక్,
నేను కార్తికేయ, స్వామి రారా సినిమాలకు మాత్రం సీక్వెల్ చేయలనుకున్నాను అంతే.