Nishabdham Press Meet Photos
`నిశ్శబ్దం` రిలీజ్ డేట్ ప్రెస్‌మీట్
`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం `నిశ్శబ్దం`. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్స్‌పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతోన్న ఈ క్రాస్ ఓవర్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జనవరి 31, 2020లో విడుదల చేస్తామని ప్రకటించారు నిర్మాతలు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో…
నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ – “2017లో ఈ కథ హేమంత్ మధుకర్ రూపంలో నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నిన్నుకోరి సినిమా విషయంలోనూ అలాగే జరిగింది. కథ మనల్ని కదిలిస్తే .. అది సినిమా అవుతుంది. హేమంత్ చెప్పిన పాయింట్ విన్న నాకు అద్భుతమైన సినిమా అవుతుందనే ఫీలింగ్ కలిగింది. ఇద్దరం రెండేళ్లు ట్రావెల్ అయ్యాం. ఈ ప్రయాణంలో అనుకోని మంచి ఘటనలు ఎదురయ్యాయి. మేం నమ్మిన ఈ కథను ముందుకు తీసుకెళ్లడానికి మాకు విశ్వప్రసాద్‌గారు దొరికారు. మొత్తం సినిమాను అమెరికాలోనే చిత్రీకరించిన తొలి తెలుగు సినిమా ఇదేనని అనుకుంటున్నాను. హాలీవుడ్ యాక్టర్స్, టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాకు పనిచేశారు. అలాంటి నిర్మాత దొరకడం వల్లనే ఈ సినిమా సాధ్యమైందని భావిస్తున్నాను. ఏదడిగినా కాదనకుండా.. అదెయ్యంత వరకు మా వెనుకపడతారు. మంచి క్వాలిటీ ప్రొడ్యూసర్. మన టెక్నీషియన్స్‌తో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేయడం వల్ల కొత్త విషయాలను నేర్చుకున్నాం. ఇదొక ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్ట్ అని చెప్పలేను కానీ.. ఎగ్జాంపులర్ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పగలను. మా టీజర్‌కు ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. 20 మిలియన్ వ్యూస్ క్రాస్ అయ్యింది. అనుష్క చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటుంది. ముందు ఈ సినిమాలో వేరే హీరోయిన్ను అనుకున్నాం. మాకు వీసాలు తదితర కారణాలతో సినిమా డిలే అయ్యింది. మేం అనుకున్న హీరోయిన్‌కి ఈ సినిమాను చేయలేనని చెప్పేసింది. ముంబై నుండి వస్తున్న సమయంలో అనుష్క ఫ్లైట్‌లో కనపడింది. మేం ప్రయాణించాల్సిన ఫ్లైట్ డిలే అయ్యింది. ఆ సమయంలో నేను అనుష్కకి ఈ కథ చెప్పాను. తను కూడా చాలా ఎగ్జయిట్ అయ్యింది. ఓ వారం గ్యాప్ తర్వాత తనను నేను మళ్లీ అప్రోచ్ అయ్యాను. అప్పుడు తను నేను సినిమా చేస్తానని చెప్పింది. ఈ సినిమాలో సుబ్బరాజు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ పాత్రలో కనపడబోతున్నారు. ఇందులో అనుష్క చేసిన సాక్షి అనే అమ్మాయి పాత్ర మాట్లాడలేదు. చెవులు వినపడవు. తన యాంగిల్లో కథ రన్ అవుతుంది కాబట్టే ఈ సినిమాకు `నిశ్శబ్దం` అనే టైటిల్‌ను పెట్టాం. `నిన్నుకోరి` తర్వాత గోపీసుందర్ అంత గొప్ప ఆల్బమ్‌ను ఈ సినిమాకు ఇచ్చాడు. ఈ క్రెడిట్ అంతా హేమంత్‌కే దక్కుతుంది“ అన్నారు.
సుబ్బరాజు మాట్లాడుతూ – “నేను, హేమంత్ పదిహేనేళ్లుగా స్నేహితులం. ఈ కథను నేను కూడా విమానంలోనే విన్నాను. ఇందులో ఓ పాత్రను నాకు ఇస్తే బావుంటుంది కదా! అని అనుకున్నాను. ముందు ఈ పాత్రకు యూనిట్ ఎవరిని అనుకున్నారో ఏమో కానీ.. సినిమా ప్రారంభానికి మూడు, నాలుగు నెలల ముందు నాకు ఈ సినిమాలో నటించే అవకాశం దక్కింది. వైరటీ క్యారెక్టర్‌ను ఇచ్చిన హేమంత్‌కి, నిర్మాతలు విశ్వప్రసాద్, కోన వెంకట్‌గారికి థ్యాంక్స్“ అన్నారు.
సహనిర్మాత మాట్లాడుతూ వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ – “ మంచి సినిమా.. సినిమాను అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాం“ అన్నారు.
టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ – “నిన్నుకోరి` సినిమా నుండి కోన వెంకట్‌గారితో అనుబంధం ఉంది. ఆ సినిమాకు లైన్ ప్రొడక్షన్లో వర్క్ చేశాం. టెక్నాలజీ నా వృత్తి అయినా సినిమాలంటే ప్యాషన్‌తో ఈ రంగంలోకి అడుగుపెట్టాను. హాలీవుడ్ రేంజ్లో ఓ సినిమా చేయాలని అనుకునేవాడిని. నేను ఇదే విషయాన్ని కోనవెంకట్గారితో కలిసి డిస్కస్ చేశాను. అలాంటి సినిమా ఇండియన్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, హాలీవుడ్ యాక్టర్స్, టెక్నీషియన్స్‌తో సినిమా చేస్తే తీయాలని అనుకున్నాం. రెండేళ్ల క్రితం హేమంత్ దగ్గర లైన్ విని.. సినిమాను డెవలప్ చేసుకుంటూ వచ్చాం. హాలీవుడ్ స్టైల్లో ఉండే ఇండియన్ మూవీ ఇది. జనవరి 31న దీన్ని రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.
డైరెక్టర్ హేమంత్ మధుకర్ మాట్లాడుతూ – “నేను, కోనగారు కలిసి ట్రావెల్ చేసే క్రమంలో విశ్వగారితో పరిచయమైంది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత నేను ఏది అడిగినా.. ఆయన వెంటనే సమకూర్చారు. అంత కో ఆపరేటివ్ ప్రొడ్యూసర్ నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అనుష్కగారు మూడు నాలుగు నెలలు కష్టపడి సైన్ లాంగ్వేజ్, పెయింటింగ్ నేర్చుకున్నారు. హాలీవుడ్ యాక్టర్ మైకేల్‌గారు కూడా చక్కగా చేశారు. అంజలిగారు ఇందులో టఫ్ కాప్ రోల్ చేశారు. సుబ్బరాజుగారు కూడా వైరటీ పాత్రలో కనపడతారు. జనవరి 31న ఈ సినిమాను విడుదల చేస్తాం. టెక్నికల్‌గా ఇదొక కొత్త చిత్రం. ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుందని నమ్ముతున్నాను. సినిమా అందరినీ ఇంప్రెస్ చేస్తుందని నమ్ముతున్నాను“ అన్నారు.
అనుష్క శెట్టి, ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల, హంటర్ ఓ హరో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్: నీరజ కోన, స్టంట్స్: ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్రఫీ: షానియల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంకట్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్, స్టోరీ, డైరెక్షన్ – హేమంత్ మధుకర్.