Palnati Puli Kodela Siva Prasad passed away
పల్నాటి పులి కోడెల శివప్రసాదా్ ఇకలేరు
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రయసాద్ హైదరాబాద్‌లో మృతి చెందారు. సోమవారం హైదరాబాద్‌లోని బసవతారకం కెన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కుటుంబ తగాదాల వల్ల హైదరాబాద్‌లోని సొంతింటోనే ఉరి వేసుకొని కోడెల ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన బసవ తారకం ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని డాక్టర్లు కోడెల మృతిని నిర్ధారించారు. కొడుకుతో గొడవ పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. 2019లోని సాధారణ ఎన్నికల్లో నర్సారావుపేట నియోజకవర్గం నుంచి ఓడిపోయినప్పటి నుంచి అధికార పార్టీ నుంచి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పలు కేసులతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఇబ్బంది పెట్టింది. 29 కేసుల్లో ఇరికించింది. చివరకు అసెంబ్లీ ఫర్నిచర్ కూడా తన ఇంట్లో పెట్టుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన కోడెలకు ఇటీవల గుండెపోటు వచ్చింది. వీటికి తోడు కుటుంబ గొడవలతో కోడెల ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కోడెల మరణంతో నర్సారావుపేట నియోజకవర్గం ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ నాయకుడు ఇక లేరనే వార్త తెలియడంతో ప్రజలు, కార్యకర్తలు దివ్ర దిగ్భాంతికి లోనయ్యారు.
డాక్టర్ వృత్తి కొనసాగిస్తున్న కోడెల శివప్రసాద్ స్వర్గీయ ఎన్టీయార్ పిలుపుతో 1983లో టీడీపీలో చేరారు. అదే ఏడాది గుంటూరు జిల్లా నర్సారావుపేట అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు మంత్రి వర్గంలో మంత్రిగా పలు శాఖలను నిర్వహించారు. వైద్యశాఖ, హోంశాఖ మంత్రిగా, పలుశాఖలను సమర్థవంతంగా నిర్వర్తించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004,2009,2019 సాధారణ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు . ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత తొలి స్పీకర్‌గా కోడెల బాధ్యతలను నిర్వర్తించారు. 2014 సాధారణ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ పార్టీలో తొలి నాళ్ల నుంచి ముఖ్య నాయకుడుగా ఎదిగారు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. టీడీపీలో నెంబర్ 2 నాయకుడుగా చెలామణి అయ్యారు. పల్నాటి పులిగా ఆయన పేరొందారు. టీడీపీ పార్టీలో ఎన్టీయార్, చంద్రబాబులు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. బసవ తారకం ఆసుపత్రికి ఛైర్మన్‌గా వ్యవహరించారు. డాక్టర్‌గా కూడా పలు సేవలందించిన కోడెల రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు.