Prati roju panduga roju review
పండగ పర్వాలేదు అనిపించింది- ప్రతీరోజు పండగే
నటీనటులు-సాయి తేజ్, రాశీఖన్నా, సత్యరాజ్,రావు రమేష్,హరితేజ,మహేష్ అచంట
దర్శకత్వం- మారుతి
నిర్మాత- బన్నీ వాసు
సంగీతం-ఎస్.థమన్
మెగాహీరో సాయి తేజ్ హీరో గా మారుతీ దర్శకత్వంలో నటించిన చిత్రం “ప్రతీరోజు పండగే” సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం.
కథ:
‘ప్రతిరోజూ పండగే’ అందరికీ తెలిసిన ఒక మాములు కథ. రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూరిలో ఉండే పసుపులేటి రఘురామయ్య (సత్యరాజ్)కు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు సంతానం. కొడుకులు ప్రయోజకులు కావాలని తన నుండి దూరంగా పంపిస్తాడు. కూతరుకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. తాను ఒక్కడే సొంతూరిలో ఉంటాడు. ఆయనకి లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఇక బతికేది ఐదు వారాలేనని డాక్టర్లు చెబుతారు.
ఈ విషయాన్ని రఘురామయ్య తన పిల్లలకు చెబుతాడు.
కానీ, తమ బిజీ లైఫ్‌లో పడిపోయిన కొడుకులు,కూతురు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటారు,
ఈ విషయం తెలుసుకున్న మనవడు సాయి (సాయిధరమ్ తేజ్) తన తండ్రి రమేష్‌కు కూడా చెప్పకుండా యూఎస్ నుంచి వెంటనే తాతయ్య దగ్గరికి వచ్చేస్తాడు.
ఇలా తాత దగ్గరకు వచ్చిన సాయి ఏం చేశాడు?
లంగ్ కేన్సర్ నీ రఘురామయ్యా ఏ విధంగా ఎదుర్కొన్నాడు.?
తాతయ్యకు ప్రతిరోజూ పండగను ఎలా చూపించాడు? తన తండ్రిని, చిన్నాన్నలను, అత్తన ఎలా మార్చగలిగాడు అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ:
కామెడీ ఫిలిమ్స్ కి కేరాఫ్ అడ్రస్ అయినా మారుతీ దర్శకత్వంలో సినిమా వస్తుంది అనగానే అందరూ హాయిగా నవ్వుకునే ఉదేశ్యంతోనే సినిమా థియేటర్ కి వస్తారు,ఈ సినిమా మొదటి నుంచి చివరివరకు అందరిని నవ్వించే ప్రయత్నం చేసాడు దర్శకుడు,అయితే కొన్ని ఏమోషనల్ సీన్స్ తో ఆకట్టుకోలేకపోయాడు,తనదైన పాత్రలో సాయి తేజ్ చాలా బాగా చేసాడు,రాశీఖన్నా పెరఫార్మన్స్ లోను, గ్లామర్ లోను తన పాత్ర మేరకు బాగానే చేసింది,ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన పాత్ర రావు రమేష్,దాదాపు సినిమా మొత్తాన్ని భుజాలు మీద మోసుకొచ్చాడు అని చెప్పొచ్చు,
సాయి తేజ్ తండ్రిగా,రఘురామయ్యా (సత్యరాజ్) కొడుకుగా కామెడీ టైమింగ్ తోనూ, డైలాగ్ డెలివరీ తోనూ ప్రేక్షకులకు మంచి పండగను అందించాడు,థమన్ మ్యూజిక్ సినిమాకి ఇంకో ప్లస్.మొత్తానికి ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ అందమైన,హాస్యమైన చిత్రం.
Rating-2.5