Pushpaka Vimanam Trailer Launch Photos
“పుష్పక విమానం” ట్రైలర్ నాకు బాగా నచ్చింది, సినిమా ష్యూర్ హిట్ అవుతుంది – ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం “పుష్పక విమానం”. గీత్ సైని, శాన్వి మేఘన నాయికలుగా నటించారు. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరించారు. నవంబర్ 12న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతున్న “పుష్పక విమానం” చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని ఓ హోటల్లో “పుష్పక విమానం” సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ట్రైలర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేసి చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా
నటుడు కిరీటి మాట్లాడుతూ…పుష్పక విమానం అంటే ఎంత మంది ఎక్కి కూర్చున్నా, మరొకరికి స్థానం ఉంటుంది. అలా ఈ సినిమా ప్రొడక్షన్ లోనూ ఎంతమంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నా, ఇంకొకరికి అవకాశం ఉంటుంది. “పుష్పక విమానం” చిత్రంలో మంచి క్యారెక్టర్ లో నటించే అవకాశం ఇచ్చినందుకు ఆనంద్ దేవరకొండకు థాంక్స్. అలాగే విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ లాంటి ఇద్దరు బంగారు కొండలను ఇండస్ట్రీకి ఇచ్చిన వాళ్ల నాన్నగారికి థాంక్స్. అన్నారు.
నటుడు గిరిధర్ మాట్లాడుతూ…నాకు ఈ చిత్రంలో నేను చేసిన క్యారెక్టర్ ను కంప్లీట్ గా ఎంజాయ్ చేశాను. ఆనంద్ దేవరకొండ, నరేష్, హర్షవర్థన్ కాంబినేషన్ లో నేను చేసిన సీన్స్ ఆడియెన్స్ కు బాగా నచ్చుతాయి. “పుష్పక విమానం” కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.
నటుడు అభిజీత్ మాట్లాడుతూ..ఆనంద్ దేవరకొండ నటుడిగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. ఆయనకు తన కెరీర్ మీద ఎంత ప్యాషన్ ఉందో చూస్తున్నాం. ఈ “పుష్పక విమానం” చిత్రంతో ఆనంద్ లోని కామిక్ టైమింగ్, యాక్టింగ్ టాలెంట్ మరింతగా ప్రేక్షకులకు తెలుస్తాయి. ఈ చిత్రంలో నేను ఓ మంచి క్యారెక్టర్ చేశాను. అది ట్రైలర్ లో చిన్న గ్లింప్స్ లా వేశారు. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అన్నారు.
కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాట్లాడుతూ…ఒక కొరియోగ్రాఫర్ గా చాలా ఆడియో ఫంక్షన్స్ లో స్జేజి పర్మార్మెన్స్ లు చేశాను. విజయ్ దేవరకొండ ఫస్ట్ ఫిల్మ్ ఆడియో విడుదల కార్యక్రమానికి కూడా నేను ఫర్మార్మ్ చేశాను. అప్పుడు విజయ్ చెప్పేవారు, సందీప్ నువ్వు మంచి కొరియోగ్రాఫర్ అవుతావు అని. ఇవాళ వాళ్ల ప్రొడక్షన్ లో వస్తున్న చిత్రంలో నేను కొరియోగ్రాఫర్ గా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. స్వామి రారా అనే పాట మనం ఎప్పటినుంచో వింటున్నాం. ఈ చిత్రంలో స్వామి రారా పాట కొత్తగా ఉంటుంది. ఆ పాటకు శాన్వి మేఘనా నెక్ట్ లెవెల్ డాన్సులు చేసింది. అని అన్నారు.
గీత రచయిత ఫణికుమార్ రాఘవ్ మాట్లాడుతూ…ఈ చిత్రంలో అహ అని సాగే పాటను రాశాను. ఆ పాటలో ఆనంద్ దేవరకొండ క్యారెక్టర్ పటే పాట్లు, చేసే అల్లరి తెలుస్తాయి. ఈ పాట ఎంత క్రేజీగా ఉంటుందో సినిమా అంతకన్నా ఆసక్తికరంగా ఉంటుంది. “పుష్పక విమానం” మూవీలో పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది. అన్నారు.
నిర్మాత విజయ్ మట్టపల్లి మాట్లాడుతూ…మా పుష్పక విమానం సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి థాంక్స్. గోవర్థన్ రావు దేవరకొండ గారు లేకుంటే ఈ పుష్పక విమానం సినిమా లేదు, మా టాంగా ప్రొడక్షన్ లేదు, ఇవాళ నేను ఈ స్టేజి మీద నిర్మాతగా నిల్చునే వాడిని కాదు. ఆయన నాకు గురువు, తండ్రి లాంటి వారు. లైఫ్ లో ఎదగాలంటే ఎలా ఉండాలో విజయ్ కు చెప్పినట్లే నాకూ చెప్పేవారు. అలా 15 ఏళ్లుగా గోవర్థన్ గారితో పరిచయం ఉంది. పుష్పక విమానం సినిమా మంచి కాన్సెప్ట్ తో చేశాం. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. నవంబర్ 12న థియేటర్ లలో చూడండి. అన్నారు.
దర్శకుడు దామోదర మాట్లాడుతూ…మా సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకకు వచ్చిన అల్లు అర్జున్ గారికి ఆయన ఫ్యాన్స్ కు, మా రౌడీ స్టార్ విజయ్ కు, ఆయన ఫ్యాన్స్ కు థాంక్స్. ఏ ఇంట్లో అయినా పెళ్లి వేడుకకు ముందు కార్డు మనకు చాలా ఇష్టమైన వారికి ఇస్తారు, లేదా దేవుడి దగ్గర పెడతారు. అలా పుష్పక విమానం సినిమా ఫస్ట్ కార్డు అల్లు అర్జున్ గారికి ఇచ్చాం. ఆయన ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారని తెలిసి, సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ ఎంతోమంది ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఒక మంచి సినిమాను సపోర్ట్ చేయడం అల్లు అర్జున్ గారి మంచితనానికి నిదర్శనం. ఒక దర్శకుడిగా కథ బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను. పుష్పక విమానం సినిమా ఒక కామెడీ థ్రిల్లర్. ఈ చిత్రంలో చిట్టిలంక సుందర్ అనే క్యారెక్టర్ లో ఆనంద్ దేవరకొండ నవ్విస్తాడు ఏడిపిస్తాడు. అల్లు అర్జున్ కు ఆర్య, విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డిలా ఆనంద్ యాక్టింగ్ టాలెంట్ ను సుందర్ క్యారెక్టర్ చూపిస్తుంది. విజయ్ నిర్మాతగా పూర్తి స్వేచ్ఛను ఇచ్చి చేయించారు. గోవర్థన్ గారి వల్లే నేను ఈ సినిమాకు దర్శకత్వం చేయగలిగాను. ఒకే రోజు సినిమా చేశారా అన్నంత కంటిన్యుటీతో సినిమా ఒక ఫ్లోలో వెళ్తుంది. మీ టైమ్ మా సినిమాకు ఇవ్వండి, మీకు ఎంటర్ టైన్ మెంట్ గ్యారంటీ. అన్నారు.
నాయిక గీత్ సైని మాట్లాడుతూ…డాన్స్ వచ్చు కాబట్టి సినిమాల్లోకి వచ్చానని అల్లు అర్జున్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నేను కూడా ఆయనలాగే. నాకూ డాన్స్ అంటే చాలా ఇష్టం. డాన్స్ కోసం సినిమా కెరీర్ ఎంచుకున్నాను. పుష్పక విమానం ట్రైలర్ కు మీరు ఇస్తున్న రెస్పాన్స్ కు సంతోషంగా ఉంది. సినిమా చూస్తే ఇంతకంటే పదిరెట్లు ఎంటర్ టైన్ అవుతారు. నవంబర్ 12న మీ దగ్గర్లోని థియేటర్ లలో పుష్పక విమానం ల్యాండ్ అవుతుంది తప్పకుండా చూడండి. అన్నారు.
నాయిక శాన్వి మేఘనా మాట్లాడుతూ…ఇక్కడున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికంటే నేనే ఆయనకు పెద్ద అభిమానిని అని చెప్పగలను. ఆయనంటే అంత ఇష్టం. మా సినిమా ట్రైలర్ రిలీజ్ కు అల్లు అర్జున్ గారు గెస్ట్ గా వస్తున్నారని తెలిసి నిద్రపట్టలేదు. పుష్పక విమానం ఒక మంచి కథ. ఈ కథకు లైఫ్ ఇచ్చిన నిర్మాతలు, ప్రతి ఒక్క టెక్నీషీయన్ కు థాంక్స్ చెబుతున్నా. నవంబర్ 12న థియేటర్లో ఇచ్చి పడేస్తున్నాం. రెడీగా ఉండండి. అన్నారు.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ…ఈ స్టేజి మీద బన్నీ అన్న, మా అన్న విజయ్ మధ్యలో నా సినిమా పోస్టర్ ఉండటం హ్యాపీగా ఉంది. పుష్పక విమానంలో చిట్టిలంక సుందర్ అనే క్యారెక్టర్ ప్లే చేశాను. గవర్నమెంట్ స్కూల్ టీచర్ అతను. వచ్చే జీతంలో సగం దాచుకుని, పెళ్లి చేసుకుంటాడు. హాయిగా హనీమూన్ కు వెళ్లి, లైఫ్ లో సెటిల్ అవ్వాలని అనుకునే టైమ్ లో ఆయన భార్య లేచిపోతుంది. చిట్టిలంక సుందర్ భార్య దొరికిందా లేదా నవంబర్ 12న థియేటర్లలో చూద్దాం. పుష్పక విమానం సినిమా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది, థ్రిల్లింగ్ గా ఉంటుంది. అల్లు అర్జున్ అన్న మీకు టైమ్ ఉన్నప్పుడు మా సినిమా చూడాలని కోరుతున్నా. ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్స్. అన్నారు.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ…పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి స్క్రిప్టులు, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగ లాంటి ప్రతిభ గల దర్శకులు పక్కనే ఉన్నా నిర్మాతలు ఎవరూ లేక ఆ సినిమాలు చేయలేని పరిస్థితిని చూశాను. ఆ కష్టాలు చూసిన అనుభవంతో టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేయాలి అనే సొంత ప్రొడక్షన్ కంపెనీ పెట్టాను. నా కింగ్ ఆఫ్ హిల్ ఎంటర్ టైన్ మెంట్స్ లో రెండో ప్రాజెక్ట్ పుష్పక విమానం. దామోదర నాకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా నుంచీ తెలుసు. ఆయన అప్పుడు రైటర్ గా కథలు రాసేవారు. నాకు ఓ కథ చెప్పారు నచ్చింది, సినిమా చేద్దామనే ఆలోచన ఉండేది. ఆ స్నేహం అలా కంటిన్యూ అయ్యింది. దామోదర మా ప్రొడక్షన్ లో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఒక నిర్మాతగా దామోదర వర్క్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. మంచి కథ కాబట్టి నాన్న గోవర్థన్, తమ్ముడు ఆనంద్ ఈ ప్రాజెక్ట్ చేయాలని పట్టుబట్టారు. ఈ కథలో హీరో క్యారెక్టర్ కు చాలా కష్టాలుంటాయి. అతనికి కష్టాలు గానీ మనకు నవ్వొస్తాయి. సునీల్ క్యారెక్టర్ ఈ సినిమాకు ఓ పిల్లర్. గీత్ సైని, శాన్వి మేఘనా సూపర్బ్ గా నటించారు. బన్నీ అన్న మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు మా నాన్నతో కలిసి డాడీ అనే సినిమా చూశాను. ఆ సినిమాలో బన్నీ అన్న చేసిన డాన్సులు ఫిదా అయ్యాను. ఆర్య సినిమా చూసినప్పుడు అల్లు అర్జున్ పర్మార్మెన్స్, డాన్సులు చూసి అద్భుతంగా చేశాడు అనిపించింది. అప్పటి నుంచి అల్లు అర్జున్ గారంటే బాగా ఇష్టం. ఆ తర్వాత అల్లు అరవింద్ గారి వల్ల మేము మరింత దగ్గరయ్యాం. బన్నీ అన్న, మహేష్ గారు లాంటి స్టార్స్ సినిమా ఫంక్షన్ లో నా గురించి మాట్లాడటం కలా నిజమా అనిపించేది. అన్నా, మీ టాలెంట్, లక్ ఈ టీమ్ కు కూడా ఉండాలి. వీళ్లు మంచి సినిమాలు చేయాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు బెస్ట్ స్టేజ్ లో ఉంది. బన్నీ అన్న పుష్ప, ఆర్ఆర్ఆర్, ప్రభాస్ గారు చేస్తున్న సినిమాలు తెలుగు సినిమా గ్రేట్ నెస్ చూపిస్తున్నాయి. అల్లు అర్జున్ అన్న వర్క్ చూసి ప్రతి రోజూ ఇన్ స్పైర్ అవుతుంటా. పుష్ప సినిమాకు మీరు పడిన కష్టం చూస్తుంటే మనం కూడా ఇలా కష్టపడాలి అని అనిపిస్తుంటుంది. మాకు ఎప్పుడూ ఇన్సిపిరేషన్ గా మీరు ఉండటం సంతోషంగా ఉంది. మీరు, సుకు సార్ కలిసి పుష్పలో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. బన్నీ అన్నను పుష్పరాజ్ గానే చూస్తున్నా. ఆ సినిమా చూసేందుకు వెయిట్ చేస్తున్నా. పుష్పక విమానం నవంబర్ 12న రిలీజ్ అవుతుంది. థియేటర్ లలో చూసేయండి. నిన్న పునీత్ అన్నను కోల్పోయాం. ఆయనను రెండు మూడు గంటలు మాత్రమే కలిశాను. నిన్నటి నుంచి మనసులో ఆయన ఆలోచనే ఉంటూ వస్తోంది. జీవించి ఉన్నంతకాలం సంతోషంగా ఉందాం, ప్రేమిద్దాం, స్నేహంగా ఉందాం. లవ్ యూ ఆల్. అన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ….పుష్ప ఫర్ పుష్పరాజ్ ..ఈ టైటిల్, ఈ కాన్సెప్ట్, ఈ కార్యక్రమం అదిరింది. ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ కంగ్రాంట్స్. పుష్పక విమానం ట్రైలర్ చాలా బాగుంది. నేను రిలీజ్ చేయకున్నా ఇదే విషయం ట్వీట్ చేసేవాడిని. పుష్పక విమానం ట్రైలర్ నాకు బాగా నచ్చింది. మీ అందరికీ తెలుసు నాకు సినిమా నచ్చకుంటే ఆ సినిమా ఫ్రెండ్స్ సినిమా అయినా, మా వాళ్లదైనా నేను ఎక్కువగా మాట్లాడను. నచ్చితే మాత్రం వీలైనంత సపోర్ట్ చేస్తుంటా. పుష్పక విమానం సినిమా ట్రైలర్ చూశాక..సినిమా మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. సినిమా విజయవంతం అవుతుందనే వైబ్స్ తెలుస్తున్నాయి. అందుకే ఈ టీమ్ కు ఆల్ ద బెస్ట్ కాకుండా అడ్వాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నాను. విజయ్ దేవరకొండను ప్రేమిస్తాను. అతను సెల్ఫ్ మేడ్ యాక్టర్. నటుడిగా ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి..ఇలా ప్రతి సినిమాకు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు. సొంతంగా కష్టపడి పైకొచ్చే వాళ్లను నేను అభిమానిస్తాను. విజయ్ ఎదుగుదల నా విజయం అనుకుంటాను. అతనికి పేరొస్తే సంతోషించే వాళ్లలో నేనూ ఉంటాను. నువ్వూ ఇంకా పేరు తెచ్చుకుంటాడని నమ్మకముంది. విజయ్ కు మంచి మనసు, మేధస్సు ఉన్నాయి. పాజిటివ్ గా ఆలోచిస్తాడు. ఇంటెలిజెంట్ గా ఉండేవాళ్లు అందరితో సరదాగా ఉండలేరు. కానీ విజయ్ ఇంటెలిజెంట్ అయినా స్నేహంగా, కలుపుగోలుగా ఉంటాడు. విజయ్ లా ఇంత తక్కువ టైమ్ లో స్టార్ అయిన నటుడిని చూడలేదు. విజయ్ తన సినిమాల ఫలితం ఎలా ఉన్నా, విభిన్నమైన సినిమాలే చేస్తాడు. విజయ్ నాకు పంపే రౌడీ క్లోత్స్ చాలా ఇష్టం. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని మీరు సొంత ప్రొడక్షన్ పెట్టడం నిజంగా మంచి విషయం. ఎంతోమంది టాలెంట్ పీపుల్ కు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. విజయ్ పైకొస్తుంటే మీకు అసూయగా ఉండగా అని అప్పట్లో నన్ను ఒకరు అడిగారు. నేను అన్నాను ఎందుకు అసూయ, మనకంటే ఒకరు ముందు పరిగెడితే అతన్ని చూసి ఇన్స్ పైర్ అవ్వాలి గానీ అసూయ పడొద్దని చెప్పా. అలా విజయ్ ఎదుగుతుంటే అతన్ని చూసి నేనూ స్ఫూర్తిపొందుతా. అలా కష్టపడి ఎదిగేవాళ్లు మరింత ముందుకు వెళ్లాలని కోరుకోవాలి కూడా. పుష్పక విమానం సినిమాతో మీరు హిట్ కొట్టారనే అనుకుంటున్నా. కోవిడ్ టైమ్ లో రిలీఫ్ ఇచ్చే సినిమా ఇది. ఈ చిత్రంలో మేఘనా, గీత్ లాంటి తెలుగు అమ్మాయిలు నటించడం చూసేందుకు బాగుంది. ఆనంద్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఈ సినిమాలో నటించాడు. ట్రైలర్ లో అతన్ని చూస్తుంటే ఆకట్టుకునేలా నటించాడు. విజయ్ తనలో ఎలా స్ట్రెంత్ గుర్తుంచాడో అలాగే నీలో బలమేంటో తెలుసుకుని ఎదగాలని కోరుకుంటున్నా. పునీత్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన అకస్మాత్తుగా వెళ్లిపోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. అన్నారు.