PV Sindhu met AP CM with her parent At secrateria

అమరావతి: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్, తెలుగుతేజం పీ.వి.సింధు తన తల్లిదండ్రులతో కలిసి ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డిని సచివాలయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా పీ.వీ. సింధుకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్, పలువురు శాప్ అధికారులు సింధుని అభినందించారు.