Raashi Khanna Interview Photos
కాంపిటీషన్ అవసరం,కాంపిటేషన్ లేకపోతే మనం కష్టపడలేము – రాశీఖన్నా
విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న వెంకీమామ చిత్రం డిసెంబర్ 13న రిలీజ్ కి సిద్ధంగా ఉంది,
ఈ సందర్భంగా హీరోయిన్ రాశీఖన్నా మీడియాతో మాట్లాడారు.
మీరు తెలుగు అమ్మాయా.?
ఇప్పుడు తెలుగు అమ్మాయి అయ్యాను.
ఈ సినిమా కోసం తగ్గినట్లు ఉన్నారు.?
అవునండీ జిమ్ చేసాను,ఇప్పుడు చాలా ఫిట్ అయ్యాను,ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను.
ఈ సినిమాలో మీ కేరెక్టర్.?
ఈ సినిమాలో నా పేరు హారిక,
ఈ సినిమాలో నేనొక ఫిల్మ్ మేకర్,
ఈ సినిమా అవకాశం వచ్చినప్పుడు నేను అయోధ్య షూటింగ్ లో ఉన్నాను,నాగ చైతన్య తో మనం లో ఒక చిన్న రోల్ చేసాను,ఈ సినిమా చేయటం రియల్లీ ఎంజాయింగ్.
వెంకటేష్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఫీలింగ్ ఏంటి.?
చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది అని అందరికి తెలిసిందే, ఫస్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సెకండాఫ్ ఎమోషనల్ గా ఉంటుంది. ఈ సినిమాలో కేరెక్టర్స్ అన్ని బాబీ గారు చాలా బాగా రాసారు,అందరకీ మంచి స్కోప్ ఉంది.
కాంపిటేషన్ బాగా ఉంది కదా.?
కాంపిటీషన్ అవసరం,కాంపిటేషన్ లేకపోతే మనం కష్టపడలేము,కాంపిటీషన్ ప్రతి చోట వుంటుంది,మీ జర్నలిజం లో కూడా ఉంటుంది ఎవరు బెస్ట్ ఆర్టికల్ రాస్తారు అని.
వెబ్ సిరీస్ ఏమైనా చేస్తున్నారా.?
మంచి రోల్ వస్తే ఖచ్చితంగా చేస్తాను,చాలా మంది చేస్తున్నారు కదా.
ఇండస్ట్రీ ఏమైనా ఇంప్రూవ్ అయింది అంటారా.?
డెఫినెట్ గా అండి,మంచి రోల్స్ వస్తున్నాయి హీరోయిన్స్ కి కూడా,
ఇప్పుడు సమంతా గారు మ్యారేజ్ అయినా తరువాత కూడా మంచి రోల్స్ చేస్తున్నారు,వెబ్ సిరీస్ కూడా వస్తున్నారు.ఇంతకుముందు పెళ్లి అయిపోతే కెరియర్ ఆగిపోయేది ఇప్పుడు అలా కాదు.
ఈ డేట్స్ ప్రాబ్లమ్ వలన ఏమైనా ఆగిపోయినా సినిమాలు ఉన్నాయా.?
నేను కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటాను,అన్ని నేను మేనేజ్ చేసుకుంటాను,నాకు నిజంగా ఒక ప్రాజెక్ట్ నచ్చితే డే అండ్ నైట్ వర్క్ చేస్తాను.