Radhe Shyam Astrology counter in theaters
రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ వినూత్నమైన ఐడియా.. దేశవ్యాప్తంగా థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్..
రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా గురించి ప్రేక్షకులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో వినూత్నమైన ఐడియాతో వచ్చారు దర్శక నిర్మాతలు. జోతిష్యం, హస్తసాముద్రికం తదితర అంశాలకు సంబంధించి చాలా హనెస్ట్‌గా ఓ విషయాన్ని చెప్పామని.. అదే ఈ చిత్రానికి మెయిన్ కంక్లూజన్ అంటున్నారు మేకర్స్. రాజులు, యువరాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్టర్ వంటి పెద్ద పెద్ద వారికి పల్మనాలజీ చెప్పే పల్మనిస్ట్ క్యారెక్టర్లో ప్రభాస్ నటించారు. ప్రపంచలోనే తొలిసారిగా ఈ నేపథ్యంలో వస్తున్న చిత్రం రాధే శ్యామ్. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్ ఓపెన్ చేసారు. అక్కడ జ్యోతిష్యం చెప్తూ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ వినూత్నమైన ఐడియాకు ప్రేక్షకుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌తో పాటు పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. మార్చ్ 11, 2022న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్, ప్రియదర్శి తదితరులు..
టెక్నికల్ టీమ్:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్షన్ కొరియోగ్రఫీ: నిక్ పావెల్
డైరక్టర్ ఆఫ్ కొరియోగ్రఫీ: వైభవి మర్చంట్
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
సౌండ్ ఇంజనీర్: రసూల్ పూకుట్టి
ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్
పిఆర్ఓ : ఏలూరు శ్రీను