Radhe Shyam Pressmeet Photos
లవ్ థ్రిల్లర్‌లో నటించడం కిక్ ఇచ్చింది
వరుస యాక్షన్ మూవీస్ తర్వాత ‘రాధేశ్యామ్’ లాంటి లవ్ స్టోరీలో నటించడం హ్యాపీగా ఉందంటున్నాడు ప్రభాస్. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ సినిమా మార్చి 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రభాస్‌తోపాటు దర్శకుడు రాధాకృష్ణ కుమార్, సంగీత దర్శకులు తమన్, జస్టిన్ ప్రభాకర్, ప్రొడక్షన్ డిజైనర్ రవిందర్ పాల్గొన్నారు.
ప్రభాస్ మాట్లాడుతూ ‘నేను జాతకాలను నమ్మను. అందుకే పామిస్ట్ కథ చెబుతానంటే ఎలా నో చెప్పాలా అనుకున్నా. ఇంటర్వెల్ వరకూ విని నో చెప్పేద్దాం అనుకున్నా. కానీ కథ నచ్చి ఆ విషయం మర్చిపోయి ఇంటరెస్టింగ్‌గా విన్నాను. కాన్సెప్ట్ నచ్చి ఓకే చెప్పాను. అయితే ఇదే కథను పెదనాన్నకు చెప్పమంటే రాధాకృష్ణ చాలా టెన్షన్ పడ్డాడు. చెప్పాక ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే అయింది. పెదనాన్న చాలా గంభీరంగా కనిపిస్తారు కానీ చాలా కూల్. మాకంటే మోడర్న్‌గా ఆలోచిస్తారు. మా సిస్టర్ ప్రసీద కూడా ఈ సినిమాకు ప్రొడ్యూసర్. గోపీకృష్ణా మూవీస్‌లో సినిమా కనుక నేను పెదనాన్న గారికి ఆన్సరబుల్గా ఉండాలి. కొవిడ్ కారణంగా ఆలస్యమైనా ఆయన ప్రోత్సాహం మాకు చాలా ఉంది. పరమహంస అనే కీలకమైన పాత్రను ఆయన పోషించారు. ఆ పాత్రలో ఫిలాసఫీతో పాటు చిన్న వెటకారం ఉంటుంది. మా ఇద్దరి కాంబినేషన్లో రెండు సీన్స్ ఉంటాయి. దీన్నో లవ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఫైట్స్ ఉండవు కానీ యాక్షన్, చేజింగ్ సీన్స్ ఉంటాయి. అంతెందుకు నా క్యారెక్టర్ డిజైన్లోనే మాస్ ఉంది. నాతో లవ్ స్టోరీ చేయడానికి ఎవరైనా భయపడతారు. కానీ ఇలాంటి లవ్‌స్టోరీ నాతో చేసిన రాధాకృష్ణకు థ్యాంక్స్. క్లైమాక్స్‌లోని పదమూడు నిముషాల షిప్ సీన్స్‌కు డైరెక్టర్ రెండేళ్లు కష్టపడ్డాడు. గ్లాడియేటర్, బ్రేవ్ హార్ట్ లాంటి సినిమాలకు వర్క్ చేసిన ఫైట్ కొరియోగ్రాఫర్ నిక్ పాల్ ఆ సీన్స్ చేశారు. వరుస యాక్షన్, కమర్షియల్ మూవీస్ తర్వాత ఇలాంటి లవ్ థ్రిల్లర్‌లో నటించడం నాకెంతో కిక్ ఇచ్చింది. అమితాబ్ బచ్చన్ గారితో కలిసి నటించాలనేది నా కల. ఇన్నాళ్లకు అది నెరవేరింది. సెట్లో ఇరవై ఏళ్ల కుర్రాడిలా ఎంతో హుషారుగా ఉంటారాయన. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్స్ పెరగడం గురించి నాకు అంతగా తెలియదు. మా నిర్మాతలకు బాగా తెలుసు. పెరిగితే చాలా హ్యపీ. త్వరలో ఓ కామెడీ సినిమా చేస్తున్నా.. వివరాలు ఇప్పుడే చెప్పలేను’ అన్నాడు.
‘ప్రభాస్ వల్లే ఈ సినిమా సాధ్యమైంది. విక్రమాదిత్యగా ఆయన అందరికీ గుర్తుండిపోతారు. ప్రేరణ పాత్రలో పూజాహెగ్డే ఒదిగిపోయింది. కాన్సెప్ట్‌కు తగ్గ సంగీతాన్ని ఇచ్చిన జస్టిన్ ప్రభాకరన్‌కు, అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన తమన్‌కు థ్యాంక్స్. సినిమాకు మూడు వందల కోట్ల వరకూ ఖర్చయింది. కానీ తెరపై చూసేటప్పుడు వెయ్యి కోట్ల అనుభూతిని ఇస్తుంది’ అని చెప్పాడు రాధాకృష్ణ. ‘ఔట్పుట్ అద్భుతంగా వచ్చింది. తప్పుకుండా అందరికీ నచ్చుతుంది’ అన్నాడు జస్టిన్. ‘ముందుగా ఇండియాలోనే వింటేజ్ సెట్స్‌లో తీయాలనుకున్నాం. కానీ బాహుబలి, సాహో చిత్రాలతో శారీరకంగా ఎంతో కష్టపడిన ప్రభాస్‌కి నెక్స్ట్ మూవీకి కాస్త రిలాక్స్‌గా ఉండాలని ఇటలీ బ్యాక్‌డ్రాప్‌కి మార్చారు దర్శకుడు. డెబ్బైల నాటి ఇటలీ బ్యాక్‌డ్రాప్ అనే ఆలోచన మాత్ర ప్రభాస్‌దే’ అని చెప్పారు ప్రొడక్షన్ డిజైనర్ రవిందర్. తమన్ మాట్లాడుతూ ‘‘బాహుబలిలో ప్రభాస్ బాడీ సైజ్ చూశారు.. ఇందులో ఆయన హార్ట్ సైజ్ చూస్తారు. మనం ‘మొఘల్ ఎ అజమ్’ లాంటి గ్రేట్ లవ్‌స్టోరీస్ చూసుంటాం. టాలీవుడ్ నుంచి వస్తోన్న అలాంటి ఓ గ్రేట్ లవ్ స్టోరీ ఇది. జస్టిన్ ఈ మూవీ సాంగ్స్‌కి జస్టిస్ చేశాడు. టాలీవుడ్‌కు లభించిన మణిరత్నంగా దర్శకుడు రాధాకృష్ణని చెప్పొచ్చు. యూవీ క్రియేషన్స్‌లో భాగమతి, మహానుభావుడు చిత్రాలకు వర్క్ చేశాను. ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌కు నా రిటర్న్ గిఫ్ట్.