RadheShyam to release on the 11th March
Rebel Star Prabhas’ RadheShyam to release on the 11th March in a theater near you!
RadheShyam is one of the most anticipated pan India films of this year. Because of the third wave the release of the film did get pushed but it being such a massive film with larger than life scenes, it had to release in theaters. So the makers have selected 11th March 2022 as the new release date.
The makers announced the new releases date with a new poster which looks intense.
Till now, we have seen a few glimpses of the mighty Prabhas as a mysterious lover boy ‘Vikram Aditya’, which can be termed something extraordinary, we have never seen in Indian cinema. The glimpses convey the storyline of a unique love story. In the trailer, we will see how the story is going to be unwrap, and the mystery created in the sneak peaks will be unsolved.
Fans and audiences have been waiting with a bated breath for Radhe Shyam to be hit the theatres.
‘RadheShyam’ will hit the screens on March 11, 2022. It’s a multi-lingual film, helmed by Radha Krishna Kumar, presented by Dr.U.V.Krishnam Raju Garu and GopiKrishna Movies. It is produced by UV Creations.
The film is produced by Vamsi, Pramod and Praseedha.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు. అలాగే అభిమానులు కూడా రాధే శ్యామ్ అప్ డేట్స్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు రెండు చోట్లా సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాను మరో అప్ డేట్ బయటికి వచ్చింది. రాధే శ్యామ్ సినిమా మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. సినిమాలోని ముఖ్యాంశాన్ని విజువలైజ్ చేస్తూ సిద్ధం చేసిన ఓ థీమ్ పోస్టర్ ద్వారా రాధేశ్యామ్ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నట్లుగా ఈ అధికారిక ప్రకటణ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి వర్క్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. మార్చ్ 11, 2022న సినిమా విడుదల కానుంది.
నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్, ప్రియదర్శి తదితరులు..
టెక్నికల్ టీమ్:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్షన్ కొరియోగ్రఫీ: నిక్ పావెల్
డైరక్టర్ ఆఫ్ కొరియోగ్రఫీ: వైభవి మర్చంట్
సౌండ్ ఇంజనీర్: రసూల్ పూకుట్టి
ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్
పిఆర్ఓ : ఏలూరు శ్రీను