Raja Varu Rani Garu movie Review
రాజావారు-రాణిగారు మనసుకు హత్తుకునే మన సినిమా
నటీనటులు-కిరణ్ అబ్బవరపు,రహస్య గోరక్,రాజ్ కుమార్ కసిరెడ్డి ,యజుర్వేద్ గుర్రం
దర్శకత్వం-రవి కిరణ్ కొలా
నిర్మాత-మనోవికాస్
సంగీతం-జయ్ క్రిష్
సినిమాటోగ్రఫర్-అమర్ దీప్ ,విద్య సాగర్
రిలీజ్-సురేష్ ప్రొడక్షన్స్
సురేష్ ప్రొడక్షన్స్ నుండి సినిమా వస్తోంది అంటే చాలు,అది మంచి వసూళ్లు తో పాటు మంచి పేరుని తీసుకొస్తుంది అని చెప్పొచ్చు,
అలాంటి సినిమానే ఈ రాజావారు-రాణిగారు
కథ:
రాజా (కిరణ్ అబ్బవరపు) అనే ఒక మాములు కుర్రాడు, నిజ జీవితంలో అందరి కుర్రాళ్లు లాగానే రాణి (రహస్య గోరక్) అనే అమ్మాయి తో ప్రేమలో పడతాడు.కానీ తన ప్రేమను రాణి తో చెప్పడానికి లోలోపల ఒక రకమైన భయంతో ఉంటాడు.
తన ప్రేమను రాణి తో చెప్పే టైం కి ఊరు విడిచి వెళ్ళిపోతుంది,
మళ్ళీ రాణి ఊరు వచ్చిందా.?
తనని ఊరు రప్పించడానికి రాజా ఎటువంటి ప్రయత్నం చేసాడు.?
వీటన్నింటి మధ్యలో నాయుడు,చౌదరి అనే ఇద్దరు స్నేహితులు రాజా ప్రేమ విషయంలో ఎటువంటి సాయం చేశారు.?
రాజా తన ప్రేమను రాణి కి చెప్పడానికి ఎలా ప్రయత్నించాడు.?
రాజా ప్రేమ విషయంలో అతని తండ్రి ఎలాంటి సపోర్ట్ చేసాడు.?
రాణి అసలు రాజా ప్రేమని ఒప్పుకుంటుందా.?
ఇలాంటి విషయాలు అన్నింటినీ సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
దర్శకుడు ఒక మాములు కథను తీసుకుని మనసుకి హత్తుకునేలా తీసాడు,సినిమాని చూస్తున్నంతసేపు మన బాల్య జ్ఞాపకాల లోనికి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు,
మన స్నేహితులు,
మన చుట్టూ ఉండే మనుషులు,
మనం చూసిన ప్రేమలు,
మనం దాటొచ్చిన రోజులు,
మనం మర్చిపోలేని అనుభూతులు వీటన్నింటినీ ఒక మూట లా కట్టి వెండితెరపై పరిచేసాడు.
సినిమాని చూస్తున్నంతసేపు థియేటర్ లో కూర్చున్నాం అనే ఫీలింగ్ రాకుండా ఆ ఊరి మధ్యలో కూర్చోబెట్టేస్తాడు,
సినిమాలో చేసిన ప్రతీ ఒక్కరికీ గుర్తుండే పాత్రలను రాసాడు దర్శకుడు రవి కిరణ్,
నాయుడు,చౌదరి పాత్రలు అయితే మనకు కితకితలు పెడుతూ సినిమాలో రాజా కి మాత్రం మేము ఉన్నాం అనే భరోసా ఇస్తాయి.
ఈ సినిమా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడితే విద్యాసాగర్,అమర్ దీప్ నిజంగా ఒక విలేజ్ ఎక్సపీరియన్స్ ని క్రియేట్ చేశారు
ప్రతీ సీన్ ని ప్రతీ షాట్ ని చాలా అందంగా తీర్చిదిద్దారు,
ఈ సినిమా కి సంగీతం ఊపిరిపోసింది అని చెప్పొచ్చు జై క్రిష్ అద్భుతమైన పాటలు తో పాటు,అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.
నటీనటులు పెరఫార్మన్స్ విషయానికి వస్తే పాత్రలో జీవించారు అని చెప్పోచ్చు.
మొత్తానికి ఇది ఫ్యామిలీ తో అందరూ కలిసి చూసి ఎంజాయ్ చెయ్యాల్సిన చిత్రం.
Rating:3