Raja Varu Rani Garu Pre Release Event
చిన్న సినిమా పెద్ద సినిమా కాదు ఇక్కడ కంటెంట్ కింగ్- రాజ్ కందుకూరి
కిరణ్ అబ్బవరపు హీరోగా రవికిరణ్ కొలా దర్శకత్వంలో వస్తున్న చిత్రం రాజావారు రాణి గారు ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ jrc కన్వెన్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.
బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, హీరో విశ్వక్ సేన్,దర్శకుడు తరుణ్ భాస్కర్ తో పాటు ప్రముఖులు మధుర శ్రీధర్ రెడ్డి , రాజ్ కందుకూరి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ
ప్రతీ వారం నాలుగు సినిమాలు వస్తుంటాయి వాటిలో కొన్ని మాత్రమే గ్రేట్ బజ్ క్రియేట్ చేస్తాయి,
ఇవాళ చిన్న సినిమాలు రాజ్యం ఏలుతున్నాయి,
ఇప్పుడు చిన్న పెద్ద లేదు కంటెంట్ ఈజ్ కింగ్ అని చెప్పారు.
మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ
సింపుల్ అండ్ హనస్ట్ లవ్ స్టోరీ ఈ సినిమా నాకు బాగా నచ్చింది,
జయ్ క్రిష్ మంచి మ్యూజిక్ ఇచ్చాడని చెప్తూ 29 న రిలీజ్ కాబోతున్న సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
నిర్మాత మనో వికాస్ మాట్లాడుతూ
నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తానన్నప్పుడు మా ఫాథర్ ఏమి ఎదురుచెప్పకుండా మంచి సపోర్ట్ చేశారు,
ఈ రోజు ఈ ఫంక్షన్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఈ రోజు మా పేరెంట్స్ anniversary Day అందుకు వాళ్లకు ఇది గిఫ్ట్ గా ప్రెజెంట్ చేస్తున్నా,
డైరెక్టర్ కిరణ్ అన్న ఫస్ట్ మాట్లాడినప్పుడు ఎలా ఉన్నాడో సినిమా కంప్లీట్ అయ్యేవరకు అలానే ఉన్నాడు అని చెప్తూ,
ఫంక్షన్ కి హాజరు అయినా వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపారు.
దర్శకుడు రవి కిరణ్ కొలా మాట్లాడుతూ
నేను హైదరాబాద్ వచ్చే ముందే మా నాన్న చనిపోయాడు,మా అమ్మ నాకు బాగా సపోర్ట్ చేసింది, నా చెల్లి తమ్ముడు ఇద్దరు ఉద్యోగాలు చేసి నన్ను హైదరాబాద్ పంపించారు అన్నయ్య నువ్వు సినిమా తీయ్ అని,
ఈ సినిమాకి అందరూ మంచి సపోర్ట్ ఇచ్చారు, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఫ్యామిలీ తో వచ్చి సినిమా చూసి మంచి కంప్లిమెంట్స్ ఇచ్చారు,
మా ఊరిలో అంత కటౌట్స్ కట్టారు, వాట్సప్ గ్రూప్ లో మాట్లాడుకుని నా ఫ్రెండ్స్ ఫ్లెక్స్ లు కట్టారు చాలా ఆనందంగా ఉంది చెప్తూ,
ఈ సినిమా విషయానికి వస్తే ఇది ఒక జెన్యూన్ సబ్జెక్ట్, మిమ్మల్ని అందరిని తీసుకెళ్లి విలేజ్ లో కూర్చోబెడుతుంది,
దాదాపుగా 700 మందికి చూపించాము,
అందరూ పాజిటివ్ గా చెప్పారు ఈ సినిమా గురించి,
ఈ నెల 29 న రిలీజ్ కాబోతోంది తప్పకుండా చూడండి.
రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ
బిగ్ బాస్ జీవితంలో మర్చిపోలేని ఒక జ్ఞాపకం, ఈ సినిమా ఖచ్చితంగా
హిట్ అవుతుంది, జయ క్రిష్ మ్యూజిక్ చాలా బాగుంది, టీమ్ అందరికి ఆల్ ద బెస్ట్.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ
ఒక సినిమా మంచిగా తీస్తే థియేటర్ కి తీసుకెళ్లకుండా ఎవ్వడు ఆపలేడు,
దానికి నిదర్శనమే ఈ సినిమా,
ఈ సినిమా చాలా బాగుంటుంది, థియేటర్ లో తప్పకుండా చూడండి.
దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ….
ఎటువంటి పొల్యూషన్ లేని సినిమా ఇది,
ఇది మన తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకోవచ్చు,
నిజాయితీ కలిగిన ప్రేమ కథ ఇది,
29th అనేది వెరీ సెంటిమెంటల్ డేట్
పెళ్లి చూపులు కూడా 29th రిలీజ్ అయింది,
సురేష్ ప్రొడక్షన్స్ లో చాలా హిట్ సినిమాలు 29 నా రిలీజ్ అయ్యాయి,
ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది.
హీరో కిరణ్ అబ్బవరపు మాట్లాడుతూ
డైరెక్షన్ టీమ్ కి, ప్రొడక్షన్ టీమ్ కి చాలా థాంక్స్ అండి.
ఈ సినిమాని నేను శ్రీరాములు థియేటర్ లో బ్లాక్ టికెట్స్ అమ్ముకున్నోడికి పిలిచి చూపించాను,
వాడు చాలా కాన్ఫిడెన్స్ తో చెప్పాడు నాకు ఈ సినిమా బాగా నచ్చింది అన్న,
నాకు ఏడుపు వచ్చింది.
సినిమా పై మాకు చాలా నమ్మకం ఉంది,
సురేష్ బాబు గారు సినిమా చూసిన తర్వాత పిలిచి 40 నిమిషాలు మాట్లాడారు.
మీ అందరికి ఈ సినిమా నచ్చుతుంది,29 న ఖచ్చితంగా థియేటర్ లో చూడండి.