Raja Varu Rani Garu Stills

కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ జంటగా నటించిన చిత్రం ‘ రాజావారు రాణిగారు. ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకంపై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రాజావారు రాణిగారు. కంటెంట్ ఉన్న సినిమాలకి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు పాటలతో సోషల్ మీడియాలో ఈ చిత్రానికి మంచి ఆదరణ ఉంది. ఇటీవల జరిగిన సినిమా ప్రివ్యూ చూసిన పలువురు సినీ ప్రముఖులు తమ ప్రశంసలు అందించారు. కాగా దీపావళి శుభాకాంక్షలతో ఈ సినిమా నవంబర్ 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా జయ్ క్రిష్ సంగీతం అందించారు.
చిత్ర దర్శకుడు రవికిరణ్ కోలా మాట్లాడుతూ.. పల్లెటూరిలో పుట్టి పెరిగిన వాళ్ళకు తమ జ్ఞాపకాల్ని గుర్తు చేసే చిత్రమిది. పట్నంలో ఉన్నవాళ్లకు పల్లెటూరు ఎలా వుంటుందో రెండుగంటల్లో కళ్ళకు కట్టిన్లు ఆవిష్కరించే చిత్రమిది. సినిమా ప్రివ్యూ చూసిన అందరి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. అని అన్నారు
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ… మా సినిమాను సురేష్‌బాబుగారు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా ప్రివ్యూ కు అద్భుతమైన స్పందన వచ్చింది. హ్యాపీ గా ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఈనెల 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం.
దర్శకుడు రవి ఎంటర్టైన్మెంట్ ని ఎమోషన్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేసాడు. అని అన్నారు.
దర్శకుడు… రవి కిరణ్ కోల
మ్యూజిక్ .. జయ్ క్రిష్
ప్రొడ్యూసర్స్.. మనోవికాస్.డి , మీడియా 9 మనోజ్