Rakul never diet
రకుల్ డైట్ చెయ్యదట…!
హీరోయిన్లు వాళ్ల గ్లామర్‌ని కాపాడుకోవడం కోసం చాలా కష్టాలు పడుతుంటారు. సరైన ఫుడ్ తీసుకోలేరు. ఇష్టమైనవి తినలేరు. చాలా కష్టంగా ఫుడ్ కంట్రోల్ చెయ్యాలసొస్తుంది. వాళ్ళ కళ్ళ ముందు ఎంత మంచి ఫుడ్ ఉన్నా తినలేరు. ప్రతిదానికి డైటింగ్ అనేది అడ్డువస్తూ ఉంటుంది. ఏమాత్రం లావుగా ఉన్నా ప్రస్తుతం జనరేషన్లో హీరోయిన్గా తీసుకోవడానికి దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారు. అయితే దీనంతటికీ వ్యతిరేకంగా ఉంటానంటుంది ఈ పంజాబి భామ రకుల్ ప్రీత్ సింగ్. తన దగ్గర డైటింగ్ పేరుతో నోరు కట్టేయడం లాంటిది వుండదు’ అంటోంది అందాలతార రకుల్ ప్రీత్ సింగ్. ‘నాకు ఇష్టమైన వంటకాలు హాయిగా లాగించేస్తుంటాను. అయితే ఏది తిన్నా ఓ పద్ధతి ప్రకారం తింటాను. మనకసలు డైటింగ్ అన్న మాటే నచ్చదు’ అని చెప్పింది రకుల్.
శంకర్ తన సినిమాలతో ఓ ప్రపంచాన్నే సృష్టిస్తుంటారు. ఇప్పుడు ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టారు రకుల్ ప్రీత్‌సింగ్. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్ 2’. ఇండియన్(తెలుగులో ‘భారతీయుడు)కి ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు రకుల్. ఇందులో సిద్ధార్థ్‌కు జోడీగా ఆమె నటిస్తున్నారని తెలిసింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2021లో విడుదల కానుంది. అనుష్క నాకు ఆదర్శం! – రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పటి హీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తోంది రకుల్ ప్రీత్‌సింగ్. చిత్రసీమలోకి అడుగుపెట్టి రెండేళ్లయ్యిందో లేదో – అందరి స్థానాలకూ ఎసర పెట్టేసింది.
అంతే కాక తాను అనుసరించే స్టైల్ గురించి కూడా చెప్పింది.‘‘మనం ఏం ఆలోచిస్తున్నామో, ఎలా ఉంటామో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు’’ అని అన్నారు నాయిక రకుల్ ప్రీత్‌సింగ్. ఓ వైపు ఫిట్నెస్ ప్రోగ్రామ్‌లు, మరోవైపు షూటింగ్‌లతో బిజీగా ఉండే రకుల్ ఈ మధ్య స్టైల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ ‘‘నేను ఎలాంటి స్టైల్‌ను అనుసరిస్తానో ఎప్పుడూ నోరు తెరిచి చెప్పను. కానీ ట్రెండ్‌లో ఉంటాను. నేను ధరించే దుస్తులను బట్టి, నా స్టైల్ ఏంటో అర్థం కావాలని అనుకుంటాను’’ అని చెప్పారు.