Ram’s tryst with rifle shooting Photos
Ram’s tryst with rifle shooting!
While Ram Pothineni’s onscreen action sequences are needless to expound, the actor recently got an interesting opportunity to flaunt his adventurous side, off the screen.
The iSmart Shankar star tried his hand out at rifle gun shooting!
Recently Ram graced the silver jubilee celebrations of Zen Technologies Ltd., as the Chief Guest, at the company’s premises in Hyderabad.
Since the company is into facilitating weapons to Defence forces, Ram embraced the rare opportunity to fire a .22 rifle in Contanierised shooting range.
Wait…He did not stop there!
The actor went on to experience shooting various weapons like MMG, AGL, ATGM, CTSR, AK47 simulators and also ShootEdge weapon system.
Describing the experience of rifle shooting as ‘unique and different, Ram shares, “The weapons look so cool; actually holding the gun and firing live is absolutely thrilling. I got to know what goes into manufacturing these powerful weapons; I am very thankful for inviting me for the evening.”
Ashok Atluri (Chairman and MD), Kishore Dutt Atluri (President) and Ravikumar Chenna (Business Head) appreciated Ram for joining their celebrations.
Indeed, Ram relishes opportunities where he can show off his exciting side!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేతికి అసలు గన్ ఇస్తే…
వెండితెర మీద డమ్మీ గన్ లతో ప్రత్యర్థుల మీదికి విరుచుకుపడే హీరోకి అసలైన గన్ లు చేతికి వస్తే ఎలా ఉంటుంది. అలాంటి
అవకాశం మన ఇస్మార్ట్ శంకర్, టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి వచ్చింది. రక్షణ దళాలు, పారామిలిటరీ దళాలు,
వివిధ పోలీసు శాఖలకు గత 25 ఏళ్లుగా తుపాకులు, ఏకే 47 లాంటి ఆయుధాలను రూపొందించి సరఫరా చేసే జెన్
టెక్నాలజీస్ సంస్థ హైదరాబాద్ లో నిర్వహించిన రజతోత్సవ కార్యక్రమానికి రామ్ ని ముఖ్య అతిథిగా
ఆహ్వానించింది. అలాంటి అవకాశం వస్తే ఈ ఎనర్జిటిక్ స్టార్ ఎలా ఊరుకుంటారు. గన్ చేతికి తీసుకుని ఎలా కాలిస్తే టార్గెట్ రీచ్
అవుతుందో తెలుసుకున్నారు. తన సినిమాలకు బాగా పనికి వస్తుందనుకుని ఆయుధాలకు సంబంధించిన సమాచారమంతా
అడిగిమరీ తెలుసుకున్నారు. ఎంఎంజీ, ఏజీఎల్, ఏటీజీఎమ్, సీటీఎస్ఆర్, ఏకే 47… ఇలా అన్ని రకాల ఆయుధాల సమాచారం
తెలుసుకోవడమే కాకుండా , చేతుల్లోకి తీసుకుని ప్రయోగాలు కూడా మొదలు పెట్టేశారు. షూటింగ్ రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యక్ష
ప్రయోగం కూడా చేశారు. ఈ అనుభవం గురించి రామ్ మాట్లాడుతూ ‘అరుదైన అనుభవమిది… సినిమా లాగా లేదు . చాలా
కొత్తగానూ, థ్రిల్లింగ్ గానూ ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ సంస్థవారికి థాంక్స్ చెప్పాలి’అన్నారు. ఈ
సంస్థ ఎండీ, ఛైర్మన్ అశోక్ అట్లూరి ఈ సందర్భంగా రామ్ ను జ్ఞాపికతో సత్కరించారు. సంస్థ ప్రెసిడెంట్ కిషోర్ దత్ అట్లూరి,
బిజినెస్ హెడ్ రవికుమార్ చెన్నా తదితరులు తమ కార్యక్రమానికి హాజరైనందుకు రామ్ కు కృతజ్ఞతలు తెలిపారు.