Rasikhanna sing a song one more time…?
రాశిఖన్నా మరోసారి పాట పాడిందా…?
రాశి ఖన్నా తెలుగులో వరుస విజయాలతో దూకుడు మీదుంది. అంతేకాదు తమిళంలో కూడా తనదైన శైలిలో రాణిస్తుంది. ఒకవైపు సినిమాలతో పాటు ఈ భామ తన గొంతును కూడా సవరించేస్తుంది. హీరోయిన్ రాశిఖన్నా కేవలం గ్లామర్‌కే పరిమితం కావాలనుకోవడం లేదు. తనలో మంచి సింగర్ కూడా ఉందని నిరూపించుకుంటుంది. గతంలో జోరు సినిమాలో పాట పాడిన రాశిఖన్నా, తర్వాత మోహన్‌లాల్, విశాల్ విలన్ సినిమా కోసం పాట పాడింది. తెలుగులో మరోసారి తన గొంతు సవరించుకుంది. తెలుగులో నారారోహిత్, రెజీనా హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం బాలకృష్ణుడు. ఈ సినిమాలో రెజీనా కోసం రాశిఖన్నా పాట పాడటం విశేషం. ఈ సినిమాను పవన్ మల్లెల తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.
ఇక ఈ తార మంచి గాయని అన్న విషయం తెలిసిందే. గతంలో కొన్ని చిత్రాలకు పాటలు పాడిన ఆమె తాజాగా ‘ఊరంతా అనుకుంటున్నారు’ సినిమాలో మరో పాటను పాడిందట. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియాలో పేర్కొంది. కాగా, ఈ చిత్రం అక్టోబర్ 5న దసరా సందర్భంగా విడుదల అవుతోంది. ఈ పాట గురించి ఈ చిన్నది చెబుతూ, ఈ పాటను అభిమానులకు వినిపించాలని చాలా ఎగ్జయిటింగ్ గా వున్నానని అంది. రాశీ ఇంతకుముందు ‘జోరు’ సినిమాలో ఓ పాట పాడింది. మోహన్ లాల్ నటిస్తున్న మలయాళీ చిత్రంలోనూ ఓ పాట పాడింది. ఎన్టీఆర్ వంటి టాప్ హీరో సరసన కథానాయకగా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘తొలిప్రేమ’లో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఈ భామ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో..తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో తమిళ భాట పట్టి అక్కడ తన లక్క్ను పరీక్షించుకుంటోంది.