RRR లో ప్రభాస్ కూడా ఉంటాడా…?

RRR లో ప్రభాస్ కూడా ఉంటాడా…?
దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలు గా ఆర్.ఆర్.ఆర్. చిత్రం రూపొందుతుంది. ఈ చిత్ర యూనిట్ చిత్ర షూటింగ్ ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్లగా. ప్రస్తుతం వీరు మొదటి షెడ్యూల్ షూటింగ్ లో భాగంగా ఈ సినిమా లోని వార్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కోసం ఏకంగా 120 కెమెరాలను వాడుతున్నారు చిత్ర సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్.కీరవాణి మ్యూజిక్ దర్శకత్వం లో ఈ సినిమా ఆడియో రూపొందించబడుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం గురించి మరో అప్డేట్ తెలిసింది. తదేమిటంటే…ఈ చిత్రంలోని ఎన్టీఆర్ లుక్‌ను కొమరం భీమ్ జయంతి సందర్భంగా అక్టోబర్ 22న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాక మరో వైపు సినిమాలోని అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను ప్రభాస్ వాయిస్ ఓవర్‌తోనే పరిచయం చేయనున్నారని టాలీవుడ్ వర్గాల టాక్. వచ్చే ఏడాది జూలై 30న ఈ చిత్రం విడుదల కానుంది.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు బాహుబలి చిత్రానికి పనిచేసిన టీం ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం కష్టపడుతోంది. బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. RRR సినిమాలో ఎన్టీఆర్ జోడీగా మరోసారి అమెరికన్ అమ్మాయినే తీసుకుంటున్నాడు రాజమౌళి. ఆ పాత్రకు పక్కా ఫారెన్ బ్యూటీ కావాలి కాబట్టి మరో ఆఫ్షన్ లేక ఇప్పుడు హాలీవుడ్ బ్యూటీ ఎమ్మా రాబర్ట్స్‌ను తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అక్కడ రెండు మూడు సినిమాలు చేసిన ఎమ్మాకు పెద్దగా క్రేజ్ అయితే లేదు. అయితే తన పాత్రకు ఈమె అయితేనే పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫీలవుతున్నాడు రాజమౌళి