Rudra Naga Movie Opening
‘రుద్రనాగు’ షూటింగ్ ప్రారంభం
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్, భారీ గ్రాఫిక్స్‌తో సర్వేశ్వర మూవీస్ పతాకంపై గుద్దేటి బసవప్పమేరు నిర్మాతగా ఎ.రాజేందర్ , రమేష్ కడూరి (ఆర్కె), బి.లక్ష్మి, రంగసాయి టి.వి సహ నిర్మాతలుగా నిర్మిస్తోన్న చిత్రం ‘రుద్రనాగు’. శివ జొన్నల గడ్డ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సుప్రియ , శివలీల హీరోయిన్స్. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు ఫిలించాంబర్‌లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సారిపల్లి కొండలరావు, సీనియర్ దర్శకుడు వి.సాగర్, ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల , లయన్ సాయి వెంకట్ తదితరులు విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి నటుడు, ఏపీ ఎఫ్ . డి . సి చైర్మన్ విజయ్‌చందర్ క్లాప్‌నివ్వగా సారిపల్లి కొండల రావు కెమెరా స్విచాన్ చేశారు. వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయు సమావేశంలో అతిథిగా విచ్చేసిన సారిపల్లి కొండలరావు మాట్లాడుతూ..‘‘శివ తో నాకు మంచి పరిచయం ఉంది. మల్టీటాలెంటెడ్ పర్సన్. పలు భాషల్లో సినిమాలు చేస్తూ అగ్రెసివ్ హీరోగా ఎదుగుతున్నాడు’’ అన్నారు.
నటుడు, ఏపీ ఎఫ్ డి సి చైర్మన్ విజయ్‌చందర్ మాట్లాడుతూ …“ యూనిట్ అందరికి నా శుభాకాంక్షలు “ అన్నారు.
దర్శకుడు వి.సాగర్ మాట్లాడుతూ…‘‘హీరోగా, దర్శకుడుగా సినిమా లు చేస్తూ శివ మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలన్నారు.
నిర్మాత గుద్దేటి బసవప్పమేరు మాట్లాడుతూ…‘‘శివతో చాలా కాలం నుంచి ప్రయాణం సాగుతుంది. తను హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తుండగా మిత్రులతో కలిసి ‘రుద్రనాగు’ చిత్రాన్ని ఐదు భాషల్లో నిర్మిస్తున్నాం’’ అన్నారు.
దర్శకుడు-హీరో శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ…‘‘కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు మా సినిమా ప్రారంభంతో పాటు టైటిల్ ఫస్ట్ లుక్, అలాగే హనుమంతుడి పై రాసిన పాటలోని పల్లవి రిలీజ్ చేశాం. ఇక కథ విషయానికొస్తే కేరళలోని అనంత పద్మనాభస్వామి కథ ఆధారంగా తీసుకుని ఈ సినిమా రూపొందిస్తున్నాం. కాంచీపురం శివాలయం లో ఉన్న నిధి దుష్టు చేతుల్లో పడకుండా రుద్ర, నాగు (కాల నాగు) ఏ విధంగా కాపాడారు అన్నది మా చిత్ర కథాంశం. దీన్ని ఐదు భాషల్లో భారీ బడ్జెట్‌తో భారీ గ్రాఫిక్స్‌తో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు.
శివ జొన్నలగడ్డ, సుప్రియ, శివలీల , తమటం రామచందర్ గౌడ్, దండ వెంకటస్వామి , రాయచూర్ శంకర్ సింగ్, రాయచూర్ ప్రేమ్ కుమార్, మాచర్ల రవి గౌడ్, తలరి హనుమంతుడు, ఆప్కారి బాలస్వామి, గుర్గిరాల రాజశేఖర్ , సంపంగి నరసింహా, మయలి శ్రీశైలం, దొడ్ల ఈశ్వర్ రెడ్డి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.శివ, సంగీతం: ఎల్.ఎమ్ ప్రేమ్, పాటలు : రమేష్ రుద్రంగి, కొండేకర్ బాలాజి, మేరి మంజు, టి.నిరంజన్ సంజయ్ గాంధీ, నిర్మాత: గుద్దేటి బసవప్ప మేరు, సహ నిర్మాతలు: ఎ.రాజేందర్, రమేష్ కడూరి (ఆర్కె) రంగసాయి టివి, బి. లక్ష్మి, మాటలు -స్క్రీన్ ప్లే -దర్శకత్వం: శివ జొన్నలగడ్డ.