Ruler Movie Review

ఈ ఏజ్ లో కూడా డాన్స్ ఈజీ గా చేయడం ప్రేక్షకులతో ఈలలు వేయిస్తుంది -రూలర్
నటీనటులు : బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, జయసుధ, భూమిక, సప్తగిరి, సాయాజీ షిండే తదితరులు
దర్శకత్వం : కె ఎస్ రవికుమార్
నిర్మాతలు : సి కళ్యాణ్
సంగీతం : చిరంతన్ భట్
సినిమాటోగ్రఫర్ : రామ్ ప్రసాద్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు-పత్స నాగరాజా
జై సింహా సినిమా తర్వాత కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 105వ చిత్రం ‘రూలర్’ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల రెస్పాన్స్ ఏంటో చూద్దాం.
కథ :
జయసుధ (సరోజినీ ప్రసాద్) పెద్ద ఐటీ బిజినెస్ మాగ్నెట్. అయితే ఆమె తీవ్రమైన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలయ్యను చూసి కాపాడుతుంది. గతం మర్చిపోయిన అతన్ని తన కొడుకుగా మార్చుకుని అతనికి అర్జున్ ప్రసాద్ అని పెట్టి అమెరికా పంపించి బిజినెస్ మెన్ గా తయారుచేస్తోంది. అర్జున్ ప్రసాద్ (బాలయ్య) ఆమె కంపెనీని నెంబర్ వన్ పోజిషన్ లో పెడతాడు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ లో తన కంపెనీ మొదలుపెట్టి ఆపేసిన ఓ ప్రాజెక్ట్ ను మళ్ళీ స్టార్ట్ చేసే ప్రాసెస్ లో.. అక్కడ తన తల్లికి (జయసుధ) జరిగిన అవమానం గురించి తెలుస్తుంది. దానితో అర్జున్ ప్రసాద్ తన తల్లిని అవమానించిన వారిని టార్గెట్ చేసి మరి వారిని కొడతాడు. అయితే అంతలో కొన్ని ఊహించని క్యారెక్టర్స్ అతని జీవితంలోకి వస్తాయి. తనని అక్కడి వారందరూ ధర్మ అని పిలుస్తూ పోలీస్ ఆఫీసర్ ధర్మ గురించి చెబుతారు. ఇంతకీ ధర్మ ఎవరు? ధర్మకు నిరంజన (భూమిక)కు ఉన్న సంబంధం ఏమిటి? అసలు పోలీస్ ఆఫీసర్ ధర్మ గతం ఏమిటి? దేని కోసం అతను పోరాడాడు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
దర్శకుడు కె ఎస్ రవికుమార్ యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు.
దర్శకుడు టేకింగ్ తో ఆకట్టుకున్నా స్క్రిప్ట్ పరంగా మాత్రం పరుచూరి మురళి పూర్తిగా న్యాయం చేయలేకపోయారు.ఆయన స్క్రిప్ట్ మీద ఇంకా బాగా శ్రద్ద పెట్టి ఉంటే సినిమా అవుట్ ఫుట్ మరోలా ఉండేది. అలాగే బాలయ్య చేసిన ధర్మ పాత్ర లుక్ ను దర్శకుడు ఇంకా అందంగా చూపించొచ్చు.
అర్జున్ ప్రసాద్ గా,ధర్మ గా పాత్రకు బాలకృష్ణ తనదైన న్యాయం చేశారు, డాన్స్ లు అయితే సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి,ఈ ఏజ్ లో కూడా బాలయ్య ఈజీ గా చేయడం ప్రేక్షకులతో ఈలలు వేయిస్తుంది.
ఈ సినిమాకి కెమెరామెన్ గా పని చేసిన రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు చిరంతన్ భట్ అందించిన నేపథ్య సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తుంది. సాంగ్స్ చాలా బాగుంటాయి.నిర్మాత సి కళ్యాణ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.హీరోహిన్స్ తనదైన పాత్ర మేరకు బాగానే చేశారు, భూమిక కీలకమైన పాత్రలో అద్భుతమైన పెరఫార్మన్స్ ఇచ్చింది. ప్రకాష్ రాజ్ ఈ సినిమాకి మరో ప్లస్ అని చెప్పొచ్చు.
మొత్తానికి ఈ సినిమా మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే పక్క మాస్ ఫిల్మ్,ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.
Rating-2.5