Sameera re entry News
సమీరా రీఎంట్రీ ‘అదిరింది’…
ఆడపిల్ల, అభిషేకం, భార్యామణి, ప్రతిబింబం, మంగమ్మ గారి మనవడు సీరియల్స్‌తో ఎంతో పేరు సంపాదించారు ప్రముఖ టీవీ నటి సమీరా షరీఫ్. 2016 నుండి తమిళ టీవీ రంగంలో నటిగా, నిర్మాతగా పేరు సంపాదించారు ఆమె. 2019లో ప్రముఖ క్యారెక్టర్ నటి సన కుమారుడు టీవీ నిర్మాత, నటుడయిన సయ్యద్ అన్వర్‌ను వివాహమాడారు సమీరా. 2020లో ఓ వినూత్నమైన కామెడీషోతో తెలుగు టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చారామె. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు టెలికాస్ట్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంది ‘అదిరింది’ షో. తెలుగులో జీ తెలుగు చానల్ వారు నిర్వహిస్తున్న ప్రెస్టేజియస్ ఎంటర్టైన్మెంట్ షో ‘అదిరింది’, స్టాండప్ కామెడీషో ఇది. జబర్దస్త్‌లో నటించి విశిష్టమైన ప్రచారం పొందిన నటులు ఈ షోలో పాల్గొంటారు. తెలుగు భాషపై అంత పట్టు లేనప్పటికీ ఎంతో ప్రాక్టీస్ చేసి ఈ షోని నిర్వహిస్తున్నారట ఆమె. పెళ్లయిన తర్వాత చాలా తక్కువ మందికే సినీ పరిశ్రమలో కానీ, టీవీ పరిశ్రమలో కానీ అవకాశాలు రావటం చాలా అరుదు. అలాంటి పరిస్థితుల్లో ఈ షో కోసం ఎంతో కష్టపడుతున్నారు సమీరా. చూడాలి మరి మేడమ్ స్టామినా ఏంటో..అంటూ చెవులు కొరుక్కుంటున్నారు టీవీ జనం.