Satyagrahi New Year Poster

పవన్ కళ్యాణ్ టైటిల్ `సత్యాగ్రహి` ఫస్ట్ లుక్ వచ్చింది
గతం లో పవన్ కళ్యాణ్ `సత్యా గ్రహి ` అనే టైటిల్ తో ఒక సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చ లేదు. అయితే ఆ టైటిల్ తో … పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల స్ఫూర్తి తో `సత్యాగ్రహి` చిత్రాన్ని శ్రీ భవిత క్రియేషన్స్ పతాకం పై గంగారెడ్డి నిర్మిస్తుండగా కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ నూతన సంవత్సరం సందర్భం గా ఈ రోజు రిలీజ్ చేశారు .
పవన్ కళ్యాణ్ ని స్పూర్తిగా తీసుకొని తన సిద్ధాంతాలను ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సమాజం పై యవత బాధ్యత తో ఉండాలని చెబుతూ … పవన్ కళ్యాణ్ ఫాన్స్ అయిన నలుగురు యువకులు సమాజాన్ని మార్చే బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కథాంశం. ఇక దీనికి సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంట్రస్టింగ్ గా ఉంది . లవ్ స్టోరీస్, అడల్ట్ కంటెంట్ , లిప్ లాక్ లతో సినిమాలు వస్తున్న ఈ రోజుల్లో ఇలా సొసైటీ పైన సినిమా చేసినందుకు దర్శుకుడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి మ్యూజిక్ : సాయి కార్తీక్ , పాటలు: శర్మ, సురేష్ గంగుల , ఎడిటింగ్: శ్రీకాంత్ , నిర్మాత :గంగా రెడ్డి , స్టోరీ -స్క్రీన్ ప్లే -డైలాగ్స్ -డైరెక్షన్ :కృష్ణ చైతన్య .