Sebastian PC524 movie Trailer launch Photos
జ్యోవిత సినిమాస్ పతాకంపై కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్, నివేక్ష (నమ్రతా దరేకర్) నటీనటులుగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘సెబాస్టియన్ పిసి524’.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లో సినీ అతిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. సామాజిక మద్యమమైన ట్విట్టర్ ద్వారా సెన్సేనల్ హీరో విజయదేవరకొండ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో
నిర్మాత సిద్దారెడ్డి మాట్లాడుతూ.. ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే విధంగా తెరకెక్కించడం జరిగింది. మార్చి 4 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
నిర్మాతలు రాజు, ప్రమోద్ లు మాట్లాడుతూ.. రాజావారు రాణి గారు తో ప్రేక్షకులను అలరించి, యస్.ఆర్. కళ్యాణమండపం తో ప్రభంజనం సృష్టించిన కిరణ్ అబ్బవరం తన మూడో చిత్రంలో రేచీకటి కాన్సెప్ట్ ను ఛాలెంజ్ గా తీసుకొని చక్కని నటనను ప్రదర్శించాడు. ఆద్యంతం అలరించే పట్టువదలని కథ, కథనంతో బాలాజీ చాలా చక్కగా తెరకెక్కించాడు. జిబ్రాన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.పాటలకు,టీజర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.మా టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడ్డారు. కిరణ్, నివేక్ష లు చాలా.చక్కగా నటించారు.ఎంతో చక్కని కథతో తెలుగు ప్రేక్షకులను ఆలరించడానికి మా కిరణ్ అబ్బవరం మార్చి 4 న ఛార్జ్ తీసుకోబోతున్నాడు.రెండున్నర గంటల సేపు అందరినీ కట్టిపడేసే కథనంతో ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది.చూసిన వారందరికీ మా సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన విజయ్ దేవరకొండ కు ధన్యవాదాలు.ఇప్పుడు విడుదలైన ట్రైలర్ కంటే సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమా చూస్తున్న వారికి ఒక రకమైన కామిక్,సస్పెన్స్, థ్రిల్లింగ్ గాని కలిగిస్తుంది.నిన్న మేము ఫస్ట్ కాపీ చూశాను సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులందరూ ఈ సినిమాలోని కైండ్ ఆఫ్ విజువల్స్ బీస్ట్ ను, కైండ్ ఆఫ్ సౌండింగ్ ను ఎక్స్పీరియన్స్ చేయడానికి వారి హియర్స్ ను,ఐస్ ను ప్రిపేర్ చేసుకోవాలి.సినిమా కథ రాసుకున్నప్పుడే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యి రాసుకున్నాను. దీనికి తగ్గట్టు జిబ్రాన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రేచీకటి పెర్ఫార్మన్స్ డీల్ చేయడం చాలా కష్టం.కానీ ఈ సినిమాలో కిరణ్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ చేసాడు. మదనపల్లె లో 32 రోజుల్లో ఈ సినిమా చేయడం జరిగింది. నటీనటులు, టెక్నిషియన్స్ అందరి ఫుల్ సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన కిరణ్ కు ,నిర్మాతలకు, ధన్యవాదాలు
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన విజయ్ దేవరకొండ కు ధన్యవాదాలు.
సిల్వర్ స్క్రీన్ పై వస్తున్న ఈ సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇందులో ప్రతి సెటప్ కూడా చాలా కొత్తగా ట్రై చేశాము. సిద్దారెడ్డి,రాజు, ప్రమోదు గార్లు నాకు బాగా సపోర్ట్ గా నిలిచారు. జ్యోవిత బ్యానర్లో వస్తున్న ఈ సినిమా తరువాత ఈ బ్యానర్ మంచి మంచి సినిమాలు తీస్తూ ఎంతో మందికి అవకాశం కూడా కల్పిస్తుంది.నివేక్ష ,కోమలి ప్రసాద్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు.టెక్నీషియన్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. బాలాజీ గారు నాకు రేచీకటి ఉన్న కథను చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ అయ్యాను. ఈ కథ చాలా ఇంట్రెస్ట్ అనిపించి ఈ సినిమా చెయ్యడం జరిగింది. రేచీకటి ఉన్న మనిషి లైఫ్ ఎలా ఉంటుందని బాలాజీ గారు చాల బాగా చూపించారు. జిబ్రాన్ సంగీతం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి “సెబాస్టియన్ పిసి524’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా మంచి సినిమా చూశాము అనే ఫీలింగ్ తో బయటికి వస్తారు.
హీరోయిన్ నివేక్ష మాట్లాడుతూ.. ఇలాంటి సినిమా కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.
ఎడిటర్ విప్లవ్ మాట్లాడుతూ.. కిరణ్ పెర్ఫార్మన్స్ ఎగ్జైట్మెంట్ గా వుంటుంది..కామెడీ,సస్పెన్స్,ఎమో
ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ మామిడి మాట్లాడుతూ..బాలాజీ గారు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.మార్చి 4 న వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
కెమెరామెన్ రాజ్ కె. నల్లి, మాట్లాడుతూ… మార్చి 4 న వస్తున్న ఈ సినిమా కొరకు మేము ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నాము.ట్రైలర్ చాలా బాగుంది.ఈ ట్రైలర్ కంటే టెన్ టైమ్స్ బెటర్ గా ఈ సినిమా ఉంటుంది.ప్రేక్షకులందరూ వచ్చి మా సినిమాను చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
కమెడియన్ రవితేజ మాట్లాడుతూ…ట్రైలర్ చాలా బాగుంది. ఇందులో నేను నిరంజన్ గా ఫుల్ లెన్త్ కామెడీ రోల్ లో నటించాను. తెలుగు ఫిల్మ్ లోకి సెబాస్టియాన్ లుక్ కొత్తగా ఉంటుంది. మందనపల్లె వింటేజ్ లుక్ లో ఉంటుంది.ల్ సినిమా.నాకీ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అన్నారు.
నటీనటులు
కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దారేకర్), శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
సాంకేతిక నిపుణులు
నిర్మాణ సంస్థ: జ్యోవిత సినిమాస్, నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, ప్రమోద్, రాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.ఎల్. మదన్, కథ – దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి, సంగీతం: జిబ్రాన్, ఛాయాగ్రహణం: రాజ్ కె. నల్లి, డిజిటల్ పార్ట్నర్: టికెట్ ఫ్యాక్టరీ, మార్కెటింగ్ & బిసినెస్ హెడ్ : చవన్ ప్రసాద్, స్టిల్స్: కుందన్ – శివ, సౌండ్: సింక్ సినిమాస్ సచిన్ సుధాకరన్, కాస్ట్యూమ్స్: రెబెకా – అయేషా మరియమ్, ఫైట్స్: అంజి మాస్టర్, సిజి: వీర, డీఐ: రాజు, కూర్పు: విప్లవ్ న్యసదాం, కళ: కిరణ్ మామిడి, పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు`ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)