Senior actress Krishna Veni was awarded the Shatabdi Ghantasala Centenary Award
సీనియర్ నటి కృష్ణ వేణి కి
ఆకృతి- ఘంటసాల శతాబ్ది పురస్కారం
–—————————–
భారత దేశ చరిత్ర లో అందరూ గుర్తించు కొని గర్వించ దగ్గ నటి, గాయని, నిర్మాత కృష్ణవేణి అన్నారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్స్ కార్పోరేషన్ చైర్మన్ అనిల్ కూర్మ చలం.
ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో శుక్ర వారం ఆకృతి- ఘంటసాల శతాబ్ది పురస్కారం ఆయన సుప్రసిద్ధ సినీ నటి, గాయని , నిర్మాత సి. కృష్ణ వేణి ప్రదానం చే సి ప్రసంగించారు..ఆమె ఎన్టీఆర్ లాంటి మహానటుడుకి తమ మనదేశం చిత్రంలో తొలి అవకాశం ఇవ్వడం మరచి పోలేని విషయం అన్నారు..ఘంటసాల శతాబ్ది పురస్కారం ఆయనను తొలి సారి సంగీత దర్శకుని చేసిన కృష్ణ వేణి కి ఆకృతి సంస్థ ఇవ్వడం అత్యంత ఔచిత్యం గా వుందన్నారు. ఎవరినైనా సక్సెస్ తర్వాతనే గుర్తు పెట్టు కుంటారు.. కానీ ఎంతోమంది కి సక్సెస్ ఇచ్చిన కృష్ణ వేణి కి తగినంత గుర్తింపు రాకపోవడం బాధాకరం అన్నారు. ఈ వేదిక ద్వారా ఈ మహ నీయురాలి తో పరిచయం కావడం నా అదృష్టం గా భావిస్తున్నాను అన్నారు.