Shaaash Mithu Press meet Photos
జులై 15న విడుదల కానున్న తాప్సీ “శభాష్ మిథు”, హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సందడి
దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం “శభాష్ మిథు”. ఈ సినిమాలో తాప్సీ పన్ను మిథాలీ రాజ్ పాత్రను పోషిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్లో 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డు బద్దలు కొట్టిన మిథాలీ రాజ్, వన్డేల్లో 10000 పరుగులకు పైగా చేసింది. ఈ చిత్రంలో ఆమె లెజెండరీ క్రికెటర్గా మారే ప్రయాణాన్ని, ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను చూపించనున్నాడు దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ.
ప్రస్తుతం శభాష్ మిథు రిలీజ్ కు రెడీ గా ఉంది, జులై 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధిన ప్రొమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాప్సీ తో పాటు క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా ఈ ప్రొమోషన్స్ లో పాల్గొనడం గమనార్హం. ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వేదికగా పత్రికా విలేకర్లు తో పాటు అభిమానులతో ముచ్చటించారు.
ఇదివరకే భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరైన సౌరవ్ గంగూలీ ఈ ట్రైలర్ ను లాంచ్ చేసారు. “శభాష్ మిథు” ట్రైలర్ అనూహ్య స్పందన లభించింది. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం జూలై 15న విడుదలకానుంది.