Shakalaka Shankar as Babamma in Die Hard Fan

‘డై హార్డ్ ఫ్యాన్’లో బేబమ్మగా షకలక శంకర్.. కృష్ణ కాంత్ గా రాజీవ్ కనకాల లుక్స్ కు అనూహ్య స్పందన..
శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరామ్.M దర్శకత్వంలో ప్రియాంక శర్మ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం డై హార్డ్ ఫ్యాన్. సెలెబ్రిటీ, అభిమాని మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా ఈ సినిమా కథ. ఫ్యాన్ పాత్రలో శివ ఆలపాటి నటిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య సాగే డ్రామా ఇది. ఇందులో షకలక శంకర్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో షకలక శంకర్ బేబమ్మ.. రాజీవ్ కనకాల కృష్ణ కాంత్ పాత్రలో నటిస్తున్నారు. ఈ ఇద్దరి ఫస్ట్ లుక్ కు అనూహ్యమైన స్పందన వస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సినిమా పూర్తిగా కామెడీ సస్పెన్స్ డ్రామాగా రాబోతుంది. మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సయ్యద్ తేజుద్దీన్ మాటలు రాస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.
నటీనటులు: ప్రియాంక శర్మ, శివ ఆలపాటి, షకలక శంకర్, రాజీవ్ కనకాల తదితరులు
టెక్నికల్ టీమ్:
దర్శకుడు: అభిరామ్ M
బ్యానర్: శ్రీహాన్ సినీ క్రియేషన్స్
నిర్మాత: చంద్రప్రియ సుబుధి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి
మాటలు: సయ్యద్ తేజుద్దీన్
సంగీతం: మధు పొన్నాస్
సినిమాటోగ్రఫీ: జగదీష్ బొమ్మిశెట్టి
ఎడిట్ VFX – తిరు B
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వెంకటేష్ తిరుమల శెట్టి
PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్